KARIMNAGAR MAN ARRESTED FOR BLACKMAILING KARIMNAGAR WOMAN THROUGH SOCIAL MEDIA SNR KNR
Karimnagar: అమ్మాయిలు జాగ్రత్త..ఇలాంటోడు మీ ఫ్రెండ్స్‌లో ఉంటే ఫిల్టర్ చేయండి లేదంటే అంతే
(వీడో వెరైటీ చీటర్ )
Women cheater:పరిచయమైన అమ్మాయిల్ని టార్గెట్ చేసుకున్నాడు. వాట్సాప్‌లో మెసేజ్‌లు, ఫోటోలు పెట్టి పరువు తీస్తాడు. ప్రేమించమని, పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేశాడు. లేదంటే తానేంటో చూపిస్తానంటూ బెదిరించాడు. భరించలేకపోయిన ఓ యువతి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో కటకటాలపాలయ్యాడు.
(P.Srinivas,New18,Karimnagar)
సోషల్ మీడియాsocial mediaలో ప్రేమ పేరుతో యువతిని , ఆమె కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తున్న యువకుడిని కరీంనగర్(Karimnagar)పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ చెందిన యువతి హైదరాబాద్(Hyderabad)లోని ఉస్మానియా యూనివర్సిటి(Osmania University) 2019-21 సంవత్సరంలో పీజీ (PG) చదువుచుండగా హైదరాబాద్ సంతోష్‌నగర్(Santosh Nagar)కి చెందిన వుప్పాల భరద్వాజ్(Vuppala Bhardwaj)కూడా ఆమెతో కలిసి చదువుకున్నాడు. చదువుకునే రోజుల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన యువతితో పాటు ఆమె స్నేహితులతో భరద్వాజ్ క్లోజ్‌గా ఉండేవాడు. ఆ పరిచయం, చనువుతో యువతి మంచి తనాన్ని ఆసరాగా మార్చుకున్నాడు భరద్వాజ్.
ఫ్రెండ్ ముసుగులో చీటింగ్..
కరీంనగర్‌కి చెందిన యువతి వాట్సాప్ నెంబర్ తెలుసుకొని ఆమెకు ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటూ ఎస్ఎంఎస్లు పంపాడు. యువతి తిరస్కరించింది. తన కుటుంబ సభ్యులు ఇలాంటివి ఒప్పుకోరంటూ సున్నితంగా మందలించింది. అయినప్పటికి భరద్వాజ్‌లో మార్పు రాలేదు. స్నేహితులతో కరీంనగర్ యువతి దిగిన సెల్ఫీ ఫోటోలను ఆమె బంధువులు, కుటుంబ సభ్యులకు స్నేహితులకు పంపుతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా వాట్సాప్‌లో , ఎస్ఎంఎస్ల ద్వారా అసభ్యకరముగా మెసేజ్‌లు పంపిస్తూ బెదిరిస్తూ వచ్చాడు భరద్వాజ్. తనను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకోకుండా చేస్తానని యువతి కుటుంబ పరువు తీస్తానంటూ బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టాడు.
సోషల్ మీడియాలో అగ్లీ మెసేజ్‌లు..
భరద్వాత్ గతంలో కూడా ఉస్మానియా క్యాంపస్‌లో చదువుతున్న రోజుల్లో ఎగ్జామ్స్ రాసి బయటకు వస్తున్న సమయంలో కూడా మరో యువతిని ఇదే విధంగా బెదిరించాడు. ఆమె సోదరుడు జస్వంత్ సింగ్ అక్కడికి వచ్చినప్పటికి అతడ్ని కూడా చంపుతానంటూ భయపెట్టాడు. ఆ సమయంలో యువతి పరువు పోతుందేమోనన్న భయంతో భరద్వాజ్ వేధింపులు భరిస్తూ వచ్చింది. అక్కడితో ఆపకుండా భరద్వాజ్ తన వేధింపులు కొసాగిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే కరీంనగర్ యువతి వెంటపడ్డాడు.
అమ్మాయిలే టార్గెట్‌గా వేధింపులు..
భరద్వాజ్ పెట్టే వేధింపులు, అసభ్యకరమైన మెసేజ్‌లతో విసిగిపోయిన బాధితురాలు ఈ నెల 10వ తేదీన కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్లో భరద్వాజ్ కంప్లైట్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని సోమవారం మధ్యాహ్నం 3:00 గంటల సమయం లో వనపర్తి టౌన్ లో CCS,టాస్క్‌ఫోర్స్, షీ టీమ్స పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించారు. అసభ్యకరమైన ఫోటోలు, పోస్ట్‌లు పంపిన సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. భరద్వాజ్‌ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 15రోజుల రిమాండ్ విధించింది. కరీంనగర్ పోలీస్ కమీషనర్ సత్యనారాయణ ఇకపై ఇలాంటి నేరాలు ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. అమ్మయిలు కూడా ఇలాంటి మోసగాళ్లతో ఫ్రెండ్షిప్ చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.