Telangana: ఆఫీసుకు రాలేని స్థితిలో మహిళ.. ఇంటికెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన ఎమ్మార్వో.. ఎక్కడంటే..

ఎమ్మార్వో సుజాత

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయానికి వెళితేనే.. ఆరోజు పని అవుతుందో లేదో అనే సందేహం ఉంటుంది. ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన కూడా పట్టించుకోని అధికారులు కూడా కొందరు ఉంటారు.

  • Share this:
    సాధారణంగా ప్రభుత్వ కార్యాలయానికి వెళితేనే.. ఆరోజు పని అవుతుందో లేదో అనే సందేహం ఉంటుంది. ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన కూడా పట్టించుకోని అధికారులు కూడా కొందరు ఉంటారు. కానీ ఓ ప్రభుత్వ అధికారే ఇంటికి వచ్చి పనిచేసి పెట్టింది. అనారోగ్యంతో ఉన్న పేషెంటు వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ పని పూర్తి చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాల మల్యాల మండలంలో చోటుచేసుకుంది. ఇలా పనిచేసిన మల్యాల మండలం తహసీల్దార్ సుజాతను పలువురు అభినందిస్తున్నారు. వివరాలు.. మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన దొనకండ కమల భర్త పోచయ్య 10 ఏళ్ల కిందటే చనిపోయాడు. వీరికి ఐదుగురు బిడ్డలు. గతంలో కమల జగిత్యాలలోని ఓ డాక్టర్ ఇంట్లో వంట మనిషిగా పనిచేసేంది.

    అయితే ప్రస్తుతం కమల నడవలేని స్థితిలో ఉంది. అనారోగ్యంతో బాధపడుతుంది. అయితే చికిత్స కోసం తన 20 గుంటల భూమిని అమ్ముకుంది. ఇందుకుకోసం స్లాట్ బుక్ చేసుకోగా.. జూలై 5వ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అపాయింట్‌మెంట్ ఖరారు అయింది. అయితే కమల రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లాలంటే చాలా శ్రమించాలి. కమల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మల్యాల తహశీల్దార్ సుజాత జిగిత్యాలలో ఉంటున్న కమల వద్దకు వెళ్లింది.

    తనతో పాటు ఆపరేటర్‌ను కూడా తీసుకెళ్లింది. అక్కడే ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసింది. మానవతా దృక్పథంతో తహసీల్దార్ స్పందించిన తీరు తెలుసుకన్న పలువురు ఆమెను అభినందిస్తున్నారు. ఇప్పుడు మల్యాల మండలంలో అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వ అధికారులు ఉంటే ప్రజలు కార్యాలయాల్లో రోజుల తరబడి తిరిగే అవసరం ఉండదని అనుకుంటున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: