హోమ్ /వార్తలు /తెలంగాణ /

Maha shivratri: ఆ దేవాలయ ప్రాంగణంలో కోటి శివలింగాలు.. మహా శివరాత్రికి లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం.. జాతరకు ఏర్పాట్లు పూర్తి

Maha shivratri: ఆ దేవాలయ ప్రాంగణంలో కోటి శివలింగాలు.. మహా శివరాత్రికి లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం.. జాతరకు ఏర్పాట్లు పూర్తి

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం మహా శివరాత్రి జాతర శోభను సంతరించుకుంది . జాతరకు వచ్చే భక్తులకు రూ .2 కోట్లతో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది .

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం మహా శివరాత్రి జాతర శోభను సంతరించుకుంది . జాతరకు వచ్చే భక్తులకు రూ .2 కోట్లతో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది .

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం మహా శివరాత్రి జాతర శోభను సంతరించుకుంది . జాతరకు వచ్చే భక్తులకు రూ .2 కోట్లతో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది .

    (న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి)

    దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (Temple of Sri Rajarajeswaraswamy) మహా శివరాత్రి (Maha shivratri) జాతర శోభను సంతరించుకుంది . జాతరకు వచ్చే భక్తులకు రూ .2 కోట్లతో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది . సోమవారం నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి (Maha shivratri) వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం అయింది . దాదాపు 2 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసి దానికనుగుణంగా అధికారులు వసతులను ఏర్పాటు చేశారు . ఆలయాన్ని విద్యుత్​ కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు . ప్రత్యేక అలంకరణలు , స్వాగత తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతికి , ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా ఆలయంలో వేడుకలను నిర్వహించనున్నారు. గుడి చెరువులో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమ నిర్వహణకు వేదిక సిద్ధం చేశారు . భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు . 3 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధంగా ఉంచారు.

     ఆలయ ప్రత్యేకతలు..

    శివరాత్రి (Maha shivratri) రోజున వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది . అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు . భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి , ఆ గిత్తను దేవాలయానికి దక్షిణగా ఇచ్చేస్తారు . దీనివల్ల సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు . శైవులు, వైష్ణవులు, జైనులు , బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు . దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన , బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి . దేవాలయ ప్రాంగణంలో 100 ఏళ్ళ నాటి మసీదు ఉంది . ఇస్లాం మతానికి ఏమండీ చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్ధం ఈ మసీదు నిర్మించారట . గుందెల్లి పర్షరం గరు గౌథం  దేవాలయ ప్రాంగణంలో కోటి శివలింగాలు ఉంటాయి అని విశ్వసిస్తారు.

    జాతర (Maha shivratri)కు వచ్చే వారికోం ఆర్టీసీ బస్సులను 770 ప్రత్యేక నడుపుతోంది . తిప్పాపూర్ నుంచి కట్ట బస్టాప్ వరకు 14 ఉచిత బస్సులను నడపనున్నారు. ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తులకు పార్కింగ్ స్థలంలో తాత్కాలిక మరుగు దొడ్లు, జల్లు స్నానాల నల్లాలు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు శుద్ధ జలం, నీటి ప్యాకెట్లు , మజ్జిగ ప్యాకెట్లు అందించనున్నారు. ఆలయ అధికారులు ఆలయ పరిసరాల్లో 166 సీసీ కెమెరాలు, నాంపల్లి గుట్టపై మరో 14 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, పట్టణంలోని వివిధ కూడళ్ల వద్ద పోలీసులు మరో 110 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం 276 సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు . వీటన్నింటిని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు .


    జాతరలో బందోబస్తు నిర్వహించేందుకు 1,500 మంది పోలీసులు ఉంటారు . ఇందులో ఒక అడిషనల్ ఎస్పీతో పాటు 8 మంది డీఎస్పీలు , 30 మంది సీఐలు , 139 మంది ఎస్సైలు , 250 మంది హెచ్సీలు , మరో 500 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. పారిశుద్ధ్యం సమస్య తలెత్తకుండా వీధులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు పెద్ద ఎత్తున సిబ్బంది పనిచేయనున్నారు . ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బంది 368 మంది, పట్టణంలో ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు మున్సిపల్ పారిశుద్ధ్యం సిబ్బంది 525 మందిని నియమించారు .

    First published:

    Tags: Karimangar, Maha Shivratri

    ఉత్తమ కథలు