హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana News: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ జీవితంలో ఓడిపోయారు.. ఏం జరిగిందంటే..

Telangana News: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ జీవితంలో ఓడిపోయారు.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana News: వారిద్దరు పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ జీవితంలో మాత్రం ఓడిపోయారు. కుటుంబ కలహాల నేపథ్యంలో నెల వ్యవధిలోనే నలుగురు చనిపోయారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వారిద్దదరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ గురించి పెద్దలకు కూడా చెప్పారు. కానీ వారు ఒప్పుకోలేదు. మనస్సులు కలవడంతో విడిగా ఉండలేకపోయారు. అయినా ఇంట్లో మరోసారి చెప్పి చూశారు. ఈ సారి వాళ్ల కుటుంబసభ్యులు చేతులకు పని పెట్టారు. అంతే కాకుండా ఇంటి నుంచి బయటకు వెళ్తే చంపేస్తామంటూ కూడా బెదిరించారు. అయినా వారి ప్రేమ ముందు ఇవన్నీ నిలవలేదు. పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమలో విజయం సాధించిన ఈ ప్రేమికులు జీవిత ప్రయాణంలో మాత్రం ఓడిపోయారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారం గ్రామానికి చెందిన జంగటి ప్రవీణ్‌ (32) అతని భార్య అరుణ నివసిస్తున్నారు. ఇరు ఇరు కుటుంబాల పెద్దలను ఎదిరించి కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సాత్విక్, సాత్వికలు ఉన్నారు.

అయితే కుటుంబకలహాల నేపథ్యంలో ఈ నెల 11 న రామగుండం రైల్వే స్టేషన్‌లో జంగటి అరుణ తన ఇద్దరు పిల్లలు సాత్విక్, సాత్వికను రైలు కిందికి తోసి తాను దూకింది. అందులో తల్లి కూతురు మృతి చెందగా.. చికిత్స పొందుతూ రెండు రోజుల వ్యవధిలో కుమారుడు మృతిచెందాడు. ఆ రోజు నుంచి ప్రవీణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తమ స్నేహితులకు చెప్పుకుంటూ కుంగిపోయాడు.

కుటుంబం మొత్తం మృతి చెందడంతో ప్రవీణ్ ఒంటరితనం భరించలేక పోయాడు. దీంతో అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు క్వాశ్రీరాంపూర్‌ ఎస్సై వెంకటేశ్వర్‌ తెలిపారు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.

First published:

Tags: Crime news, Peddapalli