Home /News /telangana /

KARIMNAGAR LOVE AFFAIR GIRL BROTHER BRUTALLY ATTACKS ON BOY FRIEND AND HIS FAMILY IN KARIMNAGAR DISTRICT MAMIDI VILLAGE KNR PAH

ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం.. యువకుడి కుటుంబంపై కత్తులతో దాడి.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karimnagar:  ప్రేమ వ్యవహారం యువకుడి కుటుంబం ప్రాణాలు పోయేంత పనిచేసింది. యువతి కుటుంబ సభ్యులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India
కరీంనగర్ జల్లాలో (karimnagar) అమ్మాయి, అబ్బాయి ప్రేమ వ్యవహరం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసింది. చిగురు మామాడికి మండలానికి చెందిన చందు అనే యువకుడికి, జగిత్యాలలో ఉంటున్న యువతికి మధ్య ప్రేమ వ్యవహరం నడుస్తోంది. ఇది కాస్త యువతి సోదరుడికి తెలిసింది. దీంతో కోపంతో రగిలిపోయిన యువతి సోదరుడు తన స్నేహితులతో కలిసి చందుకుటుంబ సభ్యులపై కత్తులతో దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ప్రవేశించి చందును ఇష్టమోచ్చినట్లు కొట్టారు. వీరిని అడ్డుకున్న చందుతల్లిదండ్రులను కూడా కత్తులతో గాయపర్చారు. చందు కడుపులో, శరీరంపై అనేకచోట్ల పొడిచారు. దీంతో తండ్రి శ్రీనివాస్, తల్లి స్వప్పలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారి అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో భయపడిపోయిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే బాధితులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చందు కడుపులోనే కత్తి చిక్కుకుని ఉంది. దీంతో వైద్యులు వారికి అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా తాజాగా ఒకటి చిత్తూరు జిల్లా (Chittoor District) లో వెలుగులోకి వచ్చింది. అయితే అ పరాయి మోజు కథలో చాలానే ట్విస్టులు బయటకు వచ్చాయి. పెళ్ళైన ఎనిమిదేళ్ల తరువాత.. ఆ భర్త.. మరొక మహిళతో వివాహేతర  సంభందం పెట్టుకున్నాడు. ఆ విషయం భార్యకు తెలియడంతో  అడ్డుకొనే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..? అతడి  వివాహేతర సంబంధానికి.. ఆమె అత్తమామలే వత్తాసు పలికారు. చివరికి ఏమైంది అంటే? అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని  నివాసం ఉంటున్నారు శంకరప్ప నాయుడు., భార్య సుశీలమ్మ. వీరికి బాల ప్రసాద్ అనే కుమారుడు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ బెథా మంగళంలోని శ్యామరహళ్లికి చెందిన ఎం. సుధతో  2014 అంటే ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది.  వివాహాన్ని రంగరంగ వైభంగా నిర్వహించారు రెండు కుటుంబాల పెద్దలు.. పెళ్ళైన నాటి నుంచి భార్య భర్తలు ఇద్దరూ సఖ్యంగానే ఉండేవారు. చూసిన వారంతా వీరిది అన్యోన్య దాంపత్యం అనేవారు. అయితే  ఈ మధ్య  భార్యపై మోజు తగ్గిందో ఏమో గాని పక్క చూపులు చూడటం మొదలెట్టాడు. అదే గ్రాణంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలిపై మోజుతో కట్టుకున్న భార్యను చిత్ర హింసలకు గురి చేస్తూ వచ్చేవాడు. భార్యను ఎలాగైనా ఇంటి నుంచి బయటకు పంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతడి వివాహేత సంబంధం తెలిసినప్పటి నుంచి ఆమె రివర్స్ లో నిలదీయడం ప్రారంభించారు. అప్పటి నుంచి భార్యను అదనపు కట్నం కోసం తరచూ వేధించి చిత్రహింసలు గురి చేసేవాడే. కట్నం తెస్తేనే ఇంటికి రావాలంటూ భార్యను పుట్టింటికి తరిమేశాడు.  ఇలా భార్యను పుట్టింటికి పంపించి..  మరో వివాహిత స్నేహను ఇంటికి తెచ్చుకున్నాడు. ఆమెతో సహజీవనం సాగించాడు.విషయం తెలుసుకున్న సుధ రూరల్ పోలీసులను వెంట పెట్టుకొని భర్త ఇంటికి వెళ్ళింది. భర్తతో పాటు సహజీవనం చేస్తున్న స్నేహను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న భర్త.. అతడి ప్రియురాలు.. స్నేహ అత్తమామలు ఒక్కసారిగా రేచ్చిపోయారు. సుధ పై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దాడికి గురైన సుధా మదనపల్లె రురల్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె  ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామని రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Karimnagar, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు