హోమ్ /వార్తలు /తెలంగాణ /

Viral news : అమ్మవారి విగ్రహం పాదల దగ్గర అజ్ఞాత భక్తుడి లేఖ .. ఏం కోరిక కోరాడో తెలిస్తే షాక్ అవుతారు

Viral news : అమ్మవారి విగ్రహం పాదల దగ్గర అజ్ఞాత భక్తుడి లేఖ .. ఏం కోరిక కోరాడో తెలిస్తే షాక్ అవుతారు

DEVOTEE LETTER

DEVOTEE LETTER

OMG: అందరూ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేస్తారు. కాని ఓ అజ్ఞాత భక్తుడు లేఖ ద్వారా అమ్మకి తన గోడు చెప్పుకున్నాడు. విగ్రహం కాళ్ల దగ్గర వదిలి వెళ్లిన భక్తుడి లేఖ ఇప్పుడు జిల్లాలోనే కాదు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

(P.Srinivas,New18,Karimnagar)

విజయదశమి(Vijayadashami) కావడంతో దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి చోట భక్తులు ఘనంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ అనేక రూపాల్లో ప్రత్యక్షమైన అమ్మవార్లను పూజిస్తున్నారు. కాని తెలంగాణలోని జగిత్యాల (Jagityal)జిల్లాలో మాత్రం అమ్మవారి ఆలయంలో ఓ భక్తుడు పెట్టిన లేఖ(Letter) కలకలం రేపుతోంది. భవానీ మాత(Bhavani Mata)ను కష్టాలు తీర్చమని కోరుకుంటూనే తన వ్యక్తిగత సమస్యను లేఖలో పొందుపర్చి అమ్మవారి విగ్రహం దగ్గర ఉంచిన వార్త కలకలం రేపుతోంది. జిల్లాలోనే కాదు సోషల్ మీడియా(Social media)లో కూడా అజ్ఞాత భక్తుడు అమ్మవారికి రాసిన లేఖపైనే చర్చ జరుగుతోంది. ఆ లేఖలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి.

KCR | TRS : కేసీఆర్ ప్రధాని కావాలంటూ .. మద్యం,కోళ్లు పంచిన టీఆర్ఎస్‌ నేత ..ఎక్కడో తెలుసా..?

అమ్మవారికి అజ్ఞాతభక్తుడి వినతి..

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న మార్కెండేయ ఆలయంలోని దుర్గమాత విగ్రహం పాదాల దగ్గర ఓ అజ్ఞాత భక్తుడు వదిలివెళ్లిన లేఖ ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లేఖే కదా అని కొట్టిపారేయవద్దు. ఎందుకంటే ఆ లేఖ సారాంశం అంతా డబ్బు చుట్టూ తిరగడంతో పాటు లేఖలో ఉన్న పేరు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి బంధువు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయంపైనే మాత్రం క్లారిటీ రావడం లేదు. అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర వదిలిన వెళ్లిన లేఖలో అసలు ఏమని ఉందంటే "అమ్మా భవాని మేము మీ భక్తులం కష్టాలలో ఉన్నాం అదుకోవాలి అమ్మా"  కాలేజీ కోసం నరైన్‌ గాంధీ అనే వ్యక్తి తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని లేఖ రాసిన భక్తుడు పేర్కొన్నాడు.

కలకలం రేపుతున్న లేఖ ..

అంతే కాదు డబ్బులు తీసుకున్న తీసుకున్న నరైన్ గాంధీ అనే వ్యక్తి తిరిగి ఇవ్వడం లేదని కాలేజీ కోసం తీసుకున్న డబ్బులు లాభాలు వస్తే ఇస్తానని చెప్పాడని లాభాలు ఏమో గాని మేము ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని లేఖలో పేర్కొనడం జరిగింది. అంతే కాదు తన దగ్గర డబ్బులు తీసుకున్న నరైన్‌ గాంధీ అనే వ్యక్తి తిరిగి ఇస్తే అందులో జగిత్యాలలో జరుగుతున్న గుడి నిర్మాణానికి తన వంతు సాయం చేస్తానని లేఖ ద్వారా భక్తుడు అమ్మవారికి మాట ఇచ్చాడు. ఇప్పుడు ఈ లేఖే జగిత్యాల జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Crime news : లేడీ సీఐతో మరో సీఐ సీక్రెట్ రిలేషన్‌షిప్ ..ఇద్దర్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది ఎవరో తెలుసా ..?

సోషల్ మీడియాలో వార్త వైరల్ ..

అయితే అజ్ఞాత భక్తుడు గుడిలో అమ్మవారి పేరుతో లేఖ వదిలి వెళ్లడం చూస్తుంటే నిజంగా ఇందులో పెద్ద వ్యక్తులే ఉన్నారని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. డబ్బులు కూడా పెద్ద మొత్తంలోనే తీసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు, ఇతర వ్యక్తులతో పరిష్కరించుకోకుండా ఈవిధంగా దైవంపైనే భారం వేసిన అజ్ఞాత భక్తుడికి రావాల్సిన డబ్బులను అమ్మవారు ఏ రూపంలో చేరుస్తారో చూడాలి. పేరుతో సహా లేఖలో రాయడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. అసలు ఎవరీ నరైన్‌గాంధీ అని ఆరా తీస్తున్నారు.

First published:

Tags: Jagityal, Telangana News, VIRAL NEWS

ఉత్తమ కథలు