హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : తుపాకులతో రెచ్చిపోతున్న నాయకులు ..

Telangana : తుపాకులతో రెచ్చిపోతున్న నాయకులు ..

KARIMNAGAR GUNS

KARIMNAGAR GUNS

Telangana: గడిచిన రెండేళ్లల్లో కేవలం ఇద్దరు నాయకులకు మాత్రమే తాము గన్‌ లైసెన్స్‌లు ఇచ్చామని కరీంనగర్ జిల్లా పోలీసులు వెల్లడించారు. కాని హుజురాబాద్‌ నియోజకవర్గంలో తుపాకులు వినియోగించే వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంటుందనేలా ప్రచారం సాగుతోంది. అసలు ఈ తుపాకుల గోలేంటని స్థానికులు హడలిపోతున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  కరీంనగర్(Karimnagar)జిల్లాలోని హుజూరాబాద్(Huzurabad)నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక వివాదం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా కొందరు నేతల అత్యుత్సాహం వల్ల పలువురు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తాజాగా సెటిల్‌మెంట్‌లలో తలదూర్చుతూ కొందరు హల్‌చల్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎక్కువగా భూ తగాదాల విషయంలో జోక్యం చేసుకుంటున్నారనేది ఇక్కడ బాహాటంగానే వినిపిస్తోంది. ఓ ముఖ్య నేత సహకారంతో కొన్ని మండలాల్లోని నాయకులు రెచ్చిపోతున్నారని వినిపడుతోంది. ఇక్కడి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కొన్ని పంచాయతీల్లో కొందరు నాయకులు తుపాకుల(Guns)ను చూపిస్తూ పంచాయతీలు చేస్తున్నారనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

  Telangana : BRSలో ఉద్యమాల జిల్లా నేతలకు ప్రాధాన్యత ..నెక్స్ట్ కేసీఆర్‌ పోటీ చేసేది అక్కడి నుంచేనా..!

  గన్‌ కల్చర్ మొదలైందా..?

  గడిచిన రెండేళ్లల్లో కేవలం ఇద్దరు నాయకులకు మాత్రమే తాము గన్‌ లైసెన్స్‌లు ఇచ్చామని కరీంనగర్ జిల్లా పోలీసులు వెల్లడించారు. కాని హుజురాబాద్‌ నియోజకవర్గంలో తుపాకులు వినియోగించే వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంటుందనేలా ప్రచారం సాగుతోంది. ఫలానా .. నాయకుడికి కూడా తుపాకీ ఉందటా .. ? అనేలా ఎక్కడపడితే అక్కడ మాటలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. ఏదైనా వివాదంలో వీటిని ఇష్టానుసారంగా ఉపయోగిస్తే ఊహించని నష్టం వాటిల్లే ప్రమాదముంది. అందుకనే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఈ తుపాకీ సంస్కృతిపైన దృష్టి పెట్టాల్సిన అవసరముందని ఇక్కడి ప్రజలు అంటున్నారు.

  పోలీసుల పాత్రపై అనుమానాలు..

  విధి నిర్వహణలో అన్నివర్గాల ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు పోలీసుల పనితీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . ఉపఎన్నికల సమయంలో ఒక పార్టీకి వత్తాసు పలికేల వ్యవహరించడం , కొందరిపై చేయి చేసుకున్నారనే విషయమై అప్పట్లో ఓ పోలీసు అధికారిని అప్పటికప్పుడే బదిలీ చేశారు. ఐదు నెలల కిందట ఇదే నియోజకవర్గంలోని ఓ గ్రామంలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కొందరిని తప్పించే ప్రయత్నం చేశారనే విషయమై ఓ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.

  తుపాకులు చూపించే బెదిరింపులు..

  నెలరోజుల కిందట హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ ఎంపీపీ భర్త ఏకంగా తనకున్న అనుమతి తుపాకీని బయటకు కనిపించేలా ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అధికార పార్టీకి చెందిన ఈ నాయకుడి వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగింది. నియోజకర్గంలో విచ్చలవిడిగా తుపాకులను ఇస్తున్నారంటూ హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. పోలీసులు మాత్రం ఆయన ఆరోపణల్ని ఖండించారు.

  Farmers Problems : మొక్కజొన్న రైతులను నిండా ముంచిన భారీ వర్షాలు .. పెట్టుబడి రావడం కష్టమేనంటూ ఆవేదన

  తుపాకులతో పంచాయితీ ..

  రెండేళ్లలో కేవలం ఇద్దరికి మాత్రమే గన్ లైసెన్స్ ఇచ్చామన్నారు. రెండు రోజుల కిందట ఇదే నియోజకవర్గంలోని కమలాపూర్ మండలానికి చెందిన ఓ నేత హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో తుపాకీతోనే నానా రచ్చ చేశారు. తమపై అకారణంగా పోలీసులు కేసు నమోదు చేశారనే ఆగ్రహంతో వారిని తిడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.ఒక వర్గానికి చెందిన వారికి రావాల్సిన లక్షలాది రూపాయల వ్యవహారమే ఈ గొడవకు కారణమనేది తెలుస్తోంది. ఈ ఆర్దిక గొడవల వ్యవహారం డైరెక్టుగా ఏసీపీ ఆఫీస్‌లోనే జరగడం విమర్శలకు దారిస్తోంది. అధికారపార్టీకి చెందిన ఓ బడా నేతతో పాటు పోలీసుశాఖలోని ఓ ఉన్నతాధికారి జోక్యంతోనే అటూ .. ఇటూ వర్గాల తగువు పోలీస్‌ కార్యాలయం వరకు వచ్చిందనే ఆరోపణలున్నాయి.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimangar, Telangana News

  ఉత్తమ కథలు