Home /News /telangana /

KARIMNAGAR LEADERS KTR BANDI SANJAY PONNAM PRABHAKAR RAMANA AND VENKAT REDDY PLAYING KEY ROLE IN GHMC ELECTIONS AK KNR

GHMC Elections: గ్రేటర్ ఎన్నికల పోరు... ఎవరు గెలిచినా క్రెడిట్ అంతా ఈ జిల్లాకే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

GHMC Elections: గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరపున చక్రం తిప్పుతున్న నేతల్లో ఎక్కువమంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే కావడంతో.. వారిలో ఎవరు ఈ విషయంలో సక్సెస్ అవుతారనే ఆసక్తికరంగా మారింది.

    గ్రేటర్ మహానగర పుర పోరులో ఉద్యమాల గడ్డ కరీంనగర్ బిడ్డలే చక్రం తిప్పబోతున్నారు. ప్రధాన పార్టీల రథసారధులందరూ కరీంనగర్ వాసులు కావడం ఆసక్తి రేపుతోంది. బల్దియా ఎన్నికల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా చక్రం తిప్పుతున్న నేతలంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాళ్లే. టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ పార్టీ నాయకులందరూ కరీంనగర్ జిల్లా ఉద్దండులే. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌లో ఒకరైన పొన్న ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ.. గ్రేటర్ పోరులో తమ తమ పార్టీల గెలుపు కోసం పోరాడుతున్నారు. హైదరాబాద్ గడ్డపై విజయం కోసం కరీంనగర్ జిల్లా నేతలు చేస్తున్న ప్రయత్నంలో ఎవరిది పైచేయి కానుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్ పీఠం కోసం కరీంనగర్ నేతలు చేస్తున్న ప్రయత్నంలో ఎవరిది పైచేయి అవుతుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. టీ

    ఈ పోరుతో ముందుగా చెప్పుకోవాల్సింది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్‌ను రాష్ట్ర రాజకీయాలతో పాటు టీఆర్ఎస్ రాజకీయాల్లో స్టార్‌ను చేసింది గత గ్రేటర్ ఎన్నికలే. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 సీట్లు సాధించడంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్.. ఈసారి గ్రేటర్‌లో గులాబీ పార్టీకి ఏ సీట్లు సాధించిపెడతారనే అంశం ఆసక్తికరంగా మారింది. మరోసారి ఆయన గ్రేటర్‌లో టీఆర్ఎస్‌భారీ విజయం సాధించేలా చేయగలిగితే.. ఆయనకు తెలంగాణ రాజకీయాల్లో తిరుగుండదనే వాదన బలంగా వినిపిస్తోంది.

    Ghmc elections, Karimnagar leaders in ghmc, ktr, bandi sajay, ponnam prabhakar, l ramana, chada venkat reddy, జీహెచ్ఎంసీ ఎన్నికలు, కేటీఆర్, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, ఎల్ రమణ, చాడ వెంకట్ రెడ్డి
    కేటీఆర్; బండి సంజయ్(ఫైల్ ఫోటో)


    ఇక గత లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా విజయం సాధించిన బండి సంజయ్ గురించి అంతకుముందు ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బండి సంజయ్.. ఆ తరువాత తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో బండి సంజయ్‌దశ తిరిగిపోయింది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళుతున్న బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ మెజార్టీ స్థానాలు సాధిస్తే.. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో మరింత పైకి ఎదిగినట్టే అనే చర్చ జరుగుతోంది.

    ఇక కాంగ్రెస్ పార్టీ విజయం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న వారిలో ఒకరైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకుడే. ఆయనతో పాటు గ్రేటర్‌లో కాంగ్రెస్ విజయం కోసం జిల్లాకు చెందిన మాజీమంత్రి జీవన్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కూడా గ్రేటర్ ఎన్నికల్లో తమ తమ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు.

    వీరేకాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కూడా హైదరాబాద్‌లోని పలు డివిజన్లలో టీఆర్ఎస్ విజయం కోసం శ్రమిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరపున చక్రం తిప్పుతున్న నేతల్లో ఎక్కువమంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే కావడంతో.. వారిలో ఎవరు ఈ విషయంలో సక్సెస్ అవుతారనే ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bandi sanjay, GHMC Elections, Karimnagar, KTR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు