హోమ్ /వార్తలు /తెలంగాణ /

Huzurabad: ఒక్కో ఇంటికి రూ.24 వేలు.. బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు పంచుతున్న నేతలు.. వీడియో వైరల్..

Huzurabad: ఒక్కో ఇంటికి రూ.24 వేలు.. బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు పంచుతున్న నేతలు.. వీడియో వైరల్..

రోడ్డెక్కిన మహిళలు

రోడ్డెక్కిన మహిళలు

Huzurabad: జాతర మొదలైంది . నిన్నటి వరకు సంక్షేమం , సానుభూతి అంటూ ప్రచారం చేసిన పార్టీలన్నీ ఇప్పుడు ప్రలోభాలకే పెద్దపీట వేస్తున్నాయి . ఈసారి ఓటరుతో డైరెక్ట్ డీల్ కుదుర్చుకుంటున్నారు. కొన్నిచోట్ల స్థానిక నేతలు కొంత వెనుకేసుకుంటుండటం , ఓటర్లు గొడవలకు దిగుతుండటంతో నేరుగా ఓటర్లకే నగదు బదిలీ చేసే ప్లాన్ మొదలైంది. ఒక్క ఓటుకు రూ.6 నుంచి రూ.12 వేలు ఇస్తున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి ...

(P.Srinivas,News18,Karimnagar)

జాతర మొదలైంది . నిన్నటి వరకు సంక్షేమం , సానుభూతి అంటూ ప్రచారం చేసిన పార్టీలన్నీ ఇప్పుడు ప్రలోభాలకే పెద్దపీట వేస్తున్నాయి . ఈసారి ఓటరుతో డైరెక్ట్ డీల్ (Direct Deal) కుదుర్చుకుంటున్నారు. కొన్నిచోట్ల స్థానిక నేతలు కొంత వెనుకేసుకుంటుండటం , ఓటర్లు గొడవలకు దిగుతుండటంతో నేరుగా ఓటర్లకే (Voters) నగదు బదిలీ చేసే ప్లాన్ మొదలైంది. ప్రధాన పార్టీల దగ్గర నియోజకవర్గం మొత్తంగా ఎన్ని కుటుంబాలున్నాయి , ఇంటి పెద్ద ఎవరు అనే వివరాలు సమగ్రంగా ఉన్నాయి . ఇప్పటికే ఓ పార్టీ ఓటుకు రూ . 6 వేల చొప్పున పంపిణీ చేస్తుందని తెలిసింది . మరో పార్టీ గురువారం నుంచి నగదు పంపిణీని ప్రారంభించనుంది .

Huzurabad By Elections: అతడి వైపే మొగ్గుచూపుతున్న బెట్టింగ్ రాజాలు.. 20 వేల మెజారిటీ పక్కా అంటూ..


ఈ విషయాన్నిఆ పార్టీ నేతలే చెబుతుండటం గమనార్హం . తొలి విడుతలో ఒకే రోజు రూ .100 కోట్లకుపైగా పంపిణీ హుజూరాబాద్ ఓటరుకు నిర్ణీత ధర ఫిక్స్ చేసి పంపకాలు చేపడుతుండడం గమనార్హం . మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో సహా ముప్పై మంది బరిలో ఉన్నారు . ప్రధాన రాజకీయ పార్టీలు పంపకాల పనిలో పడ్డాయి . ఉదయం నుంచే ఇంటింటికీ కవర్లు పంచిపె ట్టారు . ఒక ఇంటిలో ఉన్న ఓటర్ల సంఖ్య ఆధారంగా కవర్లు సిద్ధం చేశారు . ప్రత్యేక బస్తాలు , బాక్స్ కవర్లు తీసుకువచ్చి ఇంటింటికీ పంపిణీ చేశారు . ముందుగా ఓ పార్టీ తొలి విడుతలో సాధారణ ఓటుకు రూ .6 వేల ధరను నిర్ణయించింది . అత్యంత సమస్యాత్మక , కీలక ఓటుకు రూ .12 వేలుగా ధర నిర్ణయించింది . ఇలా దాదాపు రెండు లక్షల మంది ఓటర్లకు నగదు పంపిణీ చేసే పనిలో ఉంది .

Uses Of Ladyfinger: బెండకాయ వంటలకే కాదు.. ఔషద పరంగా కూడా ఎంతో ఉపయోగకరం.. ఏ వ్యాధులకు ఉపయోగిస్తారంటే..


కేవలం డబ్బు పంపకానికే ఆ పార్టీ రూ .100 కోట్ల నుంచి రూ .200 కోట్ల వరకు వెచ్చిస్తు న్నది . దీనిలో తొలి విడుతలోనే దాదాపు ఒక్క రోజే రూ . 100కోట్లకుపైగా నగదును పంచి పెట్టారు . వంద మంది ఓటర్లకు ఇదివరకే ఓ ఇంచార్జిని నియమించి పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది . ఉదాహరణకు ఇంట్లో నాలుగు ఓట్లుంటే ఆ నాలుగు ఓట్లకు కలిపి రూ . 24 వేలు ఉన్న ఒక కవర్ను ఇంటికిచ్చి ఒట్టు వేయించు కుని వెళ్తున్నారు . బుధవారం తెల్లవారుజాము నుంచే ఈ ప్రక్రియ మొదలైంది .

Lucky Chance: ఈ రూపాయి కాయిన్ మీ దగ్గర ఉందా.. మీ పంట పండినట్లే.. కోటీశ్వరులు అయ్యేందుకు అవకాశం..!


గతంలో ఎన్నికలు ఏవైనా స్థానిక లీడర్లకు పంపిణీ బాధ్యతలను అప్పగించారు . కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ ప్రక్రియను మార్చి వేసింది . నగదును పట్టుకొని స్థానికేతర లీడర్లు ఇంటింటికీ తిరిగి పంచుతున్నారు . ఒక ఇంటిలో సదరు ఇంటి పెద్దను కలిసి ఆయన ఫోన్ నంబర్ను తీసుకుని ఓటేయాలని ఒప్పందం చేసు కుంటున్నారు . కొన్నిచోట్ల నేరుగా నగదు పంపిణీ చేస్తుండగా .. మరికొన్ని ప్రాంతాల్లో సింపుల్ పేమెంట్ మొబైల్ యాప్ల ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు .


PMJDY: జన్ ధన్ ఖాతా ఉన్నవాళ్లకు శుభవార్త.. ఇలా చేస్తే రూ. 2.30 లక్షలు సొంతం చేసుకోవచ్చు.. వివరాలివే..

ఇలా నేరుగా ఓటర్లతోనే డీల్ కుదుర్చుకుంటున్నారు . స్థానిక నేతలపై తిరుగుబాటు తొలి దఫాలో కొన్నిచోట్ల స్థానిక నేతలకు నగదు పంపిణీ అప్పగిస్తే నేతలు చేతివాటం చూపిస్తున్నారు . ఒక్కో ఇంటిలో నాలుగు ఓట్లు ఉంటే మూడు ఓట్లకే ఇస్తున్నారు . ఓటుకు రూ .6 వేల చొప్పున వస్తే ... గ్రామాల్లో రూ . 5 వేలు మాత్రమే ఇస్తున్నారన్న ఆరోపణ లున్నాయి . హుజూరాబాద్ మండలంలోని ఓ గ్రామంలో ఇలాగే పంపిణీ చేస్తే కొంతమంది ఓటర్లు సదరు సర్పంచ్ ను నిలదీశారు . సర్పంచ్న్ఇంటికి వెళ్లి గొడవకుదిగారు . దీంతో ఓటుకు రూ .

వెయ్యి చొప్పున తిరిగి చెల్లించారు . ఈ నేపథ్యంలోనే నేరుగా ఓటర్లతో ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తుందని పార్టీల నేతలు బహిరంగంగానే చెప్పుతున్నారు . కవర్లపై ' కోడ్ ' రెండు పార్టీలకు కీలకంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రలోభాల పర్వం జోరందుకుంది . కవర్లలో నగదు పెట్టి పంపిణీ చేస్తున్నారు . అయితే ఈ కవర్లపై ప్రత్యేకంగా కోడ్ నెంబర్లు పెట్టుకున్నారు...

First published:

Tags: Huzurabad, Huzurabad By-election 2021

ఉత్తమ కథలు