హుజూరాబాద్ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెల కొంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గులాబీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఈటల సొంత గ్రామం కమలాపూర్ లో కేటీఆర్ పర్యటిస్తుండడం గమనార్హం. ఇక ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ వెంట మంత్రి గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ పర్యటించనున్నారు.
హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు హెలికాప్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ చేరుకొని కరీంనగర్ లోని కేసీఆర్ రెస్ట్ హౌస్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ నుంచి కమలాపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి జమ్మికుంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని తిరుగు ప్రయాణమవుతారు. సుమారు రూ. 49 కోట్లతో చేపట్ట నున్న ఎంజేపీ గురుకుల విద్యాలయం, కస్తూర్భాగాంధీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, డబుల్ బెడ్రూం ఇండ్లు, కుల సంఘం భవనాలు, బస్టాండ్ నిర్మాణం, అయ్యప్ప ఆలయం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను కమలాపూర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జమ్మికుంటలో బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్క్యూట్ రెస్ట్ హౌసు పరిశీలించారు. అనంతరం మాట్లాడు తూ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యం లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో పాటు జమ్మికుంటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో అత్యాధునిక హంగులతో నిర్మి స్తున్న అతిపెద్ద ప్రభుత్వ అతిథి గృహం కరీంనగర్ సర్క్యూట్ ను (కేసీఆర్)ను కరీంనగర్లోనే నిర్మించారు. గతంలో ప్రభుత్వ అతిథి గృహాలు అంటే దుర్గంధంగా ఉండేవని అన్నారు.
ఫైవ్ స్టార్ హోటల్ ను తలపించేలా ఈ నిర్మాణం చేపట్టారు. ఈ అతిథి గృహం జిల్లా కలెక్టర్ ఆధీనంలో పర్యవేక్షణ ఉండనుంది. అతిథి గృహం నిర్వహణ కూడా హోటల్ మేనేజ్మెంటు ఇవ్వనున్నారు. చాలా రోజుల తర్వాత ఈటెల ఇలాకాలో కేటీఆర్ రావడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. భారీ బహిరంగ సభలో ఈటెల రాజేందర్ గురించి మాట్లాడే అవకాశం ఉందని చుట్టుపక్కల ఎటు రెండు కిలోమీటర్ల దూరంలో ఇతరులను రానివ్వకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Etela rajender, Huzurabad, Minister ktr, Telangana