(P.Srinivas,New18,Karimnagar)
ఉద్యమాల జిల్లాగా పేరు గడించిన కరీంనగర్(Karimnagar)జిల్లాకు సాహితీ చరిత్రలో మరో అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం అందించే సాహిత్య అకాడమీ పురస్కారం (Kendra sahitya akademi)awardమరోసారి జిల్లావాసికి దక్కింది. ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదుగురు ఈ పురస్కారం అందుకోగా సినీ విమర్శకుడు వారాల ఆనంద్(Anand)కు గురువారం పురస్కారం ప్రకటించడం జిల్లా వాసుల్లో ఆనందాన్ని నింపుతోంది. కరీంనగర్ జిల్లా నుంచి మొదటిసారి ఈ పురస్కారం డాక్టర్ సి. నారాయణరెడ్డి( C. Narayana Reddy)అందుకోగా, అనంతరం బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ (Nalimela Bhaskar)అనువాద సాహిత్యంలో అందుకున్నారు. బాల సాహిత్యంలో మెట్పల్లికి చెందిన వాసాల నర్సయ్య, సిరిసిల్ల(Siricilla)కు చెందిన నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్‌ను పురస్కారాలు వరించాయి.
ఉద్యమాల పుటిరి గడ్డ..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమాలతో పాటు సాహిత్యంలో కూడా అగ్రస్థానమేనని చాటుకుంది. ఇప్పటి వరకు ఉద్యమాల జిల్లాగానే పేరున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా అవార్డుల జిల్లాగా మారుతోంది. కేంద్ర సాహిత్య అకాడమీ తరపున మరోసారి జిల్లాకు చెందిన వారాల ఆనంద్ సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. గ్రంథ పాలకుడిగా పదవీ విరమణ చేసిన ఆనంద్ సాహిత్యం, సినీ రంగాలను అధ్యయనం చేస్తున్నారు. చైతన్య వ్యాసాలు రాస్తున్నారు. ఆన్లైన్ రేడియో ద్వారా సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 'ఇరుగు పొరుగు, మంచి సినిమా, ప్రముఖ దర్శకుల ప్రత్యేకతల విశ్లేషణ కథనాల'ను పాఠకులకు అందిస్తున్నారు.
కళాకారుల జిల్లాగా మార్పు..
ఇద్దరు తెలుగు కవులకు ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు దక్కాయి. వారాల ఆనంద్, మధురాంతకం నరేంద్రకు ఈ అవార్డులు వరించాయి. అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ రాసిన "ఆకుపచ్చ కవితలు" పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం దక్కింది. ప్రముఖ కవి పద్మభూషణ్ గుల్జార్ రాసిన గ్రీనోపోయెమ్‌ను పవన్ కే వర్మ పుస్తకాన్ని తెలుగులో 'ఆకుపచ్చ కవితలు' పేరుతో అనువదించారు వారాల ఆనంద్. ఈ పుస్తకంలో మొత్తం 58 కవితలు ప్రకృతికి సంబంధించినవి ఉంటాయి. మనిషి, ప్రకృతి మధ్య అనుబంధాన్ని ఈ కవితల ద్వారా ఎంతో అద్భుతంగా చెప్పారు రచయిత ఆనంద్.
ఈసారికి ఇద్దరికి గుర్తింపు..
కేంద్ర సాహిత్య పురస్కారం కింద తామ్ర ఫలకం, రూ.లక్ష నగదును అందజేయనున్నారు. మధురాంతకం నరేంద్ర రాసిన "మనో ధర్మపరాగం" నవలకు తెలుగు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.సాహిత్య అకాడమీ 2022 సంవత్సరానికి సంబంధించి అవార్డులు ప్రకటించింది. ఈ జాబితాలో ఏడు పుస్తకాలు, ఆరు నవలలు, రెండు షార్ట్ స్టోరీస్, మూడు నాటకాలు, రెండు విమర్శనాత్మక కథనాలు, ఒక ఆటోబయోగ్రఫిక్ వ్యాసం, సాహిత్యానికి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి. బెంగాలీ భాషకు సంబంధించిన అవార్డను త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు.ఇప్పటికే ఇతను 28 నవలలు రాసి పలు అవార్డులను కూడా అందుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Telangana News