Home /News /telangana /

KARIMNAGAR KARMNAGAR DISTRICT LAKSHMIPUR VILLAGE IS FAMOUS FOR ITS PROPHECY SNR KNR

Telangana : చిలకజోస్యానికి కరీంనగర్ జిల్లాలోని ఆ గ్రామం ఫేమస్ .. అది ఏ ఊరంటే

ఈ ఊరు చిలకజోస్యానికి ఫేమస్

ఈ ఊరు చిలకజోస్యానికి ఫేమస్

Karimnagar: కరీంనగర్ జిల్లాలో లక్ష్మీపూర్‌ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. రెండు వందల కుటుంబాలు 200సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసముంటున్నాయి. ఎవరికైనా జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు, సందేహాల్ని నివృత్తి చేసేందుకు ఓ పక్షి సాయంతో నివృత్తి చేస్తారు. మరి ఆ గ్రామం ఎక్కడుందంటే.

ఇంకా చదవండి ...
  (P.Srinivas,New18,Karimnagar)
  భవిష్యత్తు తెలుసుకోవాలనే తపన, ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, లేదంటే ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న పని ఆలస్యం అవుతున్న సందర్భాల్లో కచ్చితంగా మాకే ఎందుకిలా జరుగుతోంది అనే సందేహం ఉంటుంది. అలాంటి సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకే జ్యోతిష్యం(Astrology)చెప్పేవాళ్లు, జాతకాలు చూసేవాళ్లు, లేదంటే హస్తసాముద్రికం(Palmistry)వాస్తుశాస్త్రవేత్తలను సంప్రదిస్తారు. కాని కరీంనగర్ (Karmnagar) జిల్లాలోని ఆ గ్రామానికి వెళ్తే ఖచ్చితమైన సమాధానం వస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇంతకీ అక్కడ అంతటి స్పెషాలిటీ ఏమిటి .. కరీంనగర్ జిల్లాలో ఆ గ్రామం ఏమిటో తెలుసా.

  చిలకజోస్యానికి ఫేమస్ ఆ విలేజ్..
  కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం లక్ష్మిపూర్  చిలక జోస్యానికి చాలా ఫేమస్. గ్రాములో బూడిగ జంగాల కాలనీ ఉంది అక్కడ 200 కుటుంబాలు కేవలం చిలక జోస్యం చెప్పుకొని కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. అయితే ఇది నిన్న, మొన్నటి చెబుతున్నది కాదు. తరతరాల నుండి వారి కుటుంబంలోని వాళ్లే ఇలా చిలక జోస్యం చెప్పుకుంటూ వస్తున్నారు. చిలక జోస్యం చెప్పడంలో ప్రత్యేకత ఏముంది చాలా చోట్ల చెబుతారు కదా అనే సందేహాన్ని పక్కనపెట్టండి. ఎందుకంటే ఇక్కడ జోస్యం చెప్పేవాళ్లు 200సంవత్సరాల నుంచి 200కుటుంబాలు అదే విద్యను ఉపాధిగా మార్చుకొని జీవిస్తున్నారంటే వారి జోస్యంపై ఎంతో కొంత నమ్మకం ఉండటం వల్లే ఇంత పేరు వచ్చిందనే చుట్టు పక్కల జనం నమ్ముతూ ఉంటారు.  కూర్చున్న చోటే జీవనోపాధి..
  అయితే మనకు కనిపించే చిలక జోస్యం చెప్పే వాళ్లందరిలా కాకుండా లక్ష్మీపురంలో ఉండే వాళ్లు జాతకం కార్డు తీసే చిలుకకు ట్రైనింగ్ ఇస్తారు. వాటిని మచ్చిక చేసుకొని..అన్నీ విద్యలు నేర్పిస్తారు. చిలక జోతిష్కుడు వేసే ప్రశ్నలు అర్ధం చేసుకునేలా వాటికి తర్ఫీదు ఇచ్చి మరీ ఫీల్డ్‌కి దింపుతారు. అందుకే చిలుక లాంటి పక్షిపై ఆధారపడి వందల కుటుంబాలు, వందల ఏళ్ల నుంచి జీవనోపాధి పొందడం వెనుస అసలు సీక్రెట్ ఇదే. ఇలా చిలుక జోస్యం చెప్పుకునే ఒక్కో కుటుంబం రోజుకు 500 రూపాయల నుంచి వెయ్యి వరకు సంపాధిస్తున్నారంటే వాళ్ల చిలుక జోస్యంపై జనానికి ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

  ఇది చదవండి : అలంకార్ టిఫెన్ సెంటర్‌లో ఇడ్లీ ఎంతో ఫేమస్ .. ఒక్కసారి టేస్ట్ చేస్తే మర్చిపోరంతే


  భవిష్యత్ తరాలకు నేర్పిస్తారట..
  చిలక చెప్పే జాతకం వినడానికి లక్ష్మీపూర్‌ గ్రామానికి కేవలం సామాన్యులే కాదు రాజకీయ నేతలు, బడా వ్యాపారస్తులు, చదువుకున్న వాళ్లు సైతం వస్తుంటారని చిలక జోస్యం చెప్పే వాళ్లు అంటున్నారు. తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాలతో పాటు ముంబై, బీమండి, సోలాపూర్ ఛత్తిష్ గడ్, రాష్టాలనుండి ఇక్కడి వచ్చి చిలక జోస్యం చెప్పించుకుంటున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న ఈ విద్యను తమ భావితరాలకు కూడా నేర్పిస్తామని చెబుతున్నారు చిలక జ్యోతిష్కులు. తాము చెప్పేవాటిలో ఎలాంటి మాట, మోసం లేదని కాల పత్ర గ్రంధాలను చూసి ఇక్కడికి వచ్చిన వారికి పంచాంగం చెప్తున్నామని.. వారికి అంతా మంచే జరుగుతుందనే నమ్మకంతోనే తమకు తోచినంత డబ్బులు ఇచ్చి వెళ్తున్నారని చిలక జ్యోతిష్కులు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimnagar, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు