Home /News /telangana /

KARIMNAGAR KARIMNAGAR YADAMMA WILL GOING TO COOK TELANGANA DISHES FOR PRIME MINISTER NARENDRA MODI FULL DETAILS ABOUT HER KNR PRV

Karimnagar yadamma: దేశ ప్రధానికి తెలంగాణ వంటల రుచి చూపించనున్న కరీంనగర్ మహిళ.. ఎవరామె?

యాదమ్మ

యాదమ్మ

దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే.. కనీసం అయిదు నక్షత్రాల హోటల్‌లో చేయి తిరిగిన నలభీములు అయ్యుండాలి కదా.. కానీ.. హైదరాబాద్‌ (Hyderabad) రానున్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు.

ఇంకా చదవండి ...
    (Srinivas P, News18, Karimnagar)

    దేశ ప్రధానికి వండి (Cook), వడ్డించడమంటే.. కనీసం అయిదు నక్షత్రాల హోటల్‌లో చేయి తిరిగిన నలభీములు అయ్యుండాలి కదా.. కానీ.. హైదరాబాద్‌ (Hyderabad) రానున్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు.. నేపథ్యం అతి సాధారణమైనా తెలంగాణ రుచుల తయారీలో మాత్రం అసామాన్యురాలీమె.. అందుకే ఏరికోరి ఎంపికచేశారు.. జులై 2 నుంచి జరగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు (BJP National Working Committee meetings) హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీకి అచ్చ తెలంగాణ వంటలు రుచి చూపించాలని నిర్ణయించారు. దీనికోసం కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను (Goolla Yadamma) ఎంపికచేశారు. 29 సంవత్సరాలుగా వంటలు చేస్తూ జీవిస్తున్న యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట (Siddipet) జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామం. 15వ ఏటనే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో కరీంనగర్‌ (Karimnagar) చేరుకున్న యాదమ్మ మంకమ్మ తోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. ఈమె చేసే శాకాహార (Veg), మాంసాహార వంటకాలు (Non తిన్నవారు ఆహా అనకుండా ఉండలేరని చెబుతారు.

    10వేల మందికి కూడా ఇట్టే వండివార్చేస్తారు యాదమ్మ. మంత్రులు కేటీఆర్‌ (KTR), గంగుల కమలాకర్‌ (Gangula kamalakar) పాల్గొన్న కార్యక్రమాలతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) నిర్వహించిన సమావేశాల సందర్భంగా వంటలు చేయడంతో మంచి గుర్తింపు వచ్చిందీమెకు. యాదమ్మను బుధవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  హైదరాబాద్‌ పిలిపించారు. కొన్ని వంటలు తయారు చేయించి రుచి చూశారు.

    ఈ సందర్భంగా యాదమ్మ మాట్లాడుతూ.. ‘మోదీ సారు తెలంగాణ వంటకాల గురించి అడిగారట. బండి సంజయ్‌ సారు మా యాదమ్మ మంచి వంటకాలు చేస్తోందని చెప్పారట. నన్ను బుధవారం పెద్ద హోటల్‌కు పిలిపించారు. కూరగాయలతో భోజనం కావాలన్నారు. పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి ఐదారు రకాల వంటలు, గంగవాయిలి కూర పప్పు, పచ్చిపులుసు, సాంబారు, గుత్తి వంకాయ వంటి కూరగాయలు వండుతాం. సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్షాలు, పాయసం, పప్పుగారెలు వంటివి కూడా తయారు చేస్తాం.  పెద్ద హోటల్‌లో ముఖ్యమైన వాళ్ల కోసం వంట చేయమంటున్నారు. మోదీ సారు నేను చేసే వంట తింటారంటే అంతకంటే ఎక్కువ ఏముంటుంది..అదే నాకు భాగ్యం’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆమె తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.. ఏది ఏమైనప్పటికి కరీంనగర్ వ్యక్తి దేశ ప్రధానికి వంట చేయడం మామలు విషయం కాదంటానుర్రు.. కరీంనగర్ ప్రజలు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: BJP National Executive Meeting 2022, Hyderabad, Karimnagar, PM Narendra Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు