తెలంగాణ (Telangana)లోని హైదరాబాద్ వేదికగా బీజేపీ తమ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని (BJP National executive meeting 2022) నిర్వహిస్తోంది. బీజేపీ ప్లీనరీకి ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi), హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. బీజేపీ స్పెషల్ మీట్ లో స్పెషల్ మెనూ (Special menu)ను ఫైనల్ చేశారు. మధ్యాహ్నం భోజనంలో తెలంగాణ వంటకాలు (Telangana dishes) ఉండేలా చూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు బీజేపీ దిగ్గజాలు ఈరోజు తెలంగాణ వంటకాల రుచి చూడబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి గుడాటిపల్లెకి చెందిన యాదమ్మ (Karimnagar Yadamma) చేతితో చేసిన వంటకాలను ఆయా ప్రముఖులంతా టేస్ట్ చేయబోతున్నారు. భోజనంతోపాటు స్నాక్స్ సైతం తెలంగాణ స్టయిల్ లోనే తయారు చేస్తున్నారు. స్వీట్స్ సైతం తెలంగాణ తినుబండారాలనే వడ్డిస్తుండటం విశేషం. స్వీట్స్ సహా దాదాపు 50 రకాల వంటకాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు రోజైన ఆదివారం మధ్యాహ్నం అతిరథ మహారథుల కోసం సిద్ధం చేస్తున్నారు. అవన్నీ స్వయంగా యాదమ్మ చేతితోనే చేస్తుండటం గమనార్హం. నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి పొందుతున్నా, అవకాశం కల్పించిన బండి సంజయ్ కు రుణపడి ఉంటానని యాదమ్మ అన్నారు.
ఇక వంటల విషయానికొస్తే ..
కూరలు.. చిక్కుడుకాయ టమోటా, ఆలు కూర్మ, వంకాయ మసాల, దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై, బెండకాయ కాజు పల్లీల ఫ్రై, తోటకూర టమోటా ఫ్రై, బీరకాయ మిల్ మేకర్ చూర ఫ్రై, మెంతికూర పెసరపప్పు ఫ్రై, గంగవాయిలకూర మామిడికాయ పప్పు, సాంబారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, బగార, పులిహోర, పుదీన రైస్, వైట్ రైస్, పెరుగన్నం, గోంగూరు పచ్చిడి, దోసకాయ ఆవ చట్నీ, టమోటా చట్నీ, సొరకాయ చట్నీ
ఇక స్వీట్స్ .. బెల్లం పరమాన్నం, సేమియా పాయసం, భక్షాలు, బూరెలు, అరిసెలు సిద్ధం చేస్తున్నారు.
స్నాక్స్ విషయానికొస్తే...పెసరపప్పు గారెలు, సకినాలు, మక్క గుడాలు, సర్వపిండి, టమోటా చట్నీ, పల్లీ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ, మిర్చి,
నేడు ఈ వంటకాలతో పాటు దేశ వ్యాప్తంగా పేరుగాంచిన వంటకాలు, తెలంగాణ వంటకాలు బీజేపీ నేతలకు వడ్డించనున్నారు. నేడు హైదరాబాదీ బిర్యానీ (Hyderabad biryani), దమ్ బిర్యానీ, కుబూలీ బిర్యానీ, మోటియా బిర్యానీ, దోసకాయ రైతా, మిర్చ్ కా సలాన్, దోస, ఉతప్పం, ఉప్మా, పాలక్ దోశ, వంకాయ పకోడీ, దాల్ మఖానీ, దాల్ తడ్కా, సాంబార్, పలు రకాల రొట్టెలు. మిల్లెట్స్‌తో ఐదు రకాల కిచిడీలు, ఇక మూడో రోజున.. టమాటా కూర, మెంతికూర ఆలుగడ్డ, వంకాయ మసాలా, దొండకాయ కొబ్బరి ఫ్రై, బెండకాయ కాజూపల్లి ఫ్రై, తోటకూర టమాటా ఫ్రై, బీరకాయ పాలకూర, గంగవాయిలి మామిడికాయ పప్పు, మెంతి పెసరపప్పు, చనా మసాలా, పప్పుచారు, పచ్చి పులుసు, ముద్దపప్పు, బగారా అన్నం, పులిహోర, పుదీనా రైస్, తెల్ల అన్నం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, BJP National Executive Meeting 2022, Food, Hyderabad, Karimangar, Telangana bjp