హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: జీతాలు రాక చెన్నూరు మున్సిపాలిటీ వర్కర్ల ఇబ్బందులు!

Karimnagar: జీతాలు రాక చెన్నూరు మున్సిపాలిటీ వర్కర్ల ఇబ్బందులు!

X
జీతాల్లేక

జీతాల్లేక ఇబ్బందులు

Karimnagar: గత 12 నెలల నుండి జీతాలు రాక చెన్నూరు మున్సిపాలిటీలోని స్వచ్ఛ ఆటో డ్రైవర్లు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

P.Srinivas,New18,Karimnagar

గత 12 నెలల నుండి జీతాలు రాక చెన్నూరు మున్సిపాలిటీలోని స్వచ్ఛ ఆటో డ్రైవర్లు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు గత సంవత్సర కాలం నుండి వేతనాలు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.

చెన్నూరు మున్సిపల్ పరిధిలో మొత్తం 18 వార్డులు ఉండగా, చెత్త సేకరణ కోసం కేవలం 16 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసి అవసరాల నిమిత్తం ఉపయోగిస్తున్నారు. ఈ ఆటోల కోసం గత రెండేళ్ల క్రితం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 16 మంది డ్రైవర్లను చెన్నూరు మున్సిపాలిటీ అధికారులు విధులకు తీసుకున్నారు. అయితే వీళ్ళకి గత 12 నెలలుగా జీతాలు అందడం లేదు. దుమ్ము, దూళి, మురికిలో పనిచేస్తూ ఎంతో దుర్భర జీవితం సాగిస్తున్న మాకు ఇలా జీతాలు ఇవ్వకుండా వేధించడం సరికాదని డ్రైవర్లు వాపోతున్నారు.

గత 12 నెలలుగా తమకు జీతాలు ఇవ్వక పోవడంతో అష్టకష్టాలు పడుతూ జీవనాన్ని సాగిస్తున్నట్లు వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తమకు రావలసిన 12 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని స్వచ్ఛ ఆటో డ్రైవర్లు వేడుకుంటున్నారు.

First published:

Tags: Karimnagar, Local News, Telangana

ఉత్తమ కథలు