హోమ్ /వార్తలు /తెలంగాణ /

Fake Baba: పూజల పేరుతో బురిడీ.. విచారణలో షాక్ కు గురైన పోలీసులు.. ఏం జరిగిందంటే..

Fake Baba: పూజల పేరుతో బురిడీ.. విచారణలో షాక్ కు గురైన పోలీసులు.. ఏం జరిగిందంటే..

పోలీసులకు చిక్కిన దొంగబాబా

పోలీసులకు చిక్కిన దొంగబాబా

Fake Baba: దొంగ బాబాలు ప్రతి రోజు పుట్ట గొడుగులుగా వెలుస్తూ.. నిత్యం అమాయక ప్రజలను మాయమాటలతో బురిడీ కొట్టించి రూ. లక్షలు కొల్లగొడుతున్నారు. ఇటువంటి సంఘటనే ఒకటి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

  టెక్నాలజీ ఎంత దూసుకుపోతున్నా మూఢనమ్మకాలను మాత్రం చాలామంది వీడటం లేదు. మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. ఇలా ఓ దొంగ బాబా ఆరోగ్య సమస్యలు సరిగ్గా లేకున్నా.. ఉద్యోగం కావాలన్నా పూజలు చేసి పరిష్కారం చూపిస్తానని అమాయక ప్రజలను మోసం చేశాడు. ఇలా ఓ వ్యక్తి అతడి చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం మొత్తం బయటకు వచ్చింది. పూర్తి వివరాల ఇలా ఉన్నాయి. కరీంనగర్ దుర్శేడ్ గ్రామానికి చెందిన గంధం రమేష్ అనే అతడు అనారోగ్య సమస్యలు ఉంటే పూజలు చేసి వాటికి పరిష్కారం చూపెడుతాం అంటూ.. అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వాసులు చేస్తున్నాడు. ఇలా అమాయక ప్రజలని పూజల, మంత్రాల, పేరిట మోసం చెస్తుండేవాడు. అలా ఒకరోజు అతనికి కరీంనగర్ SBI బ్యాంకు లో పరిచయమైన ఒక సెక్యూరిటీ గార్డ్ తో పరిచయం పెంచుకుననాడు. అతనికి ఏ ఇతర సమస్యలు ఉన్నా పూజలు చేసి నయం చేస్తానని చెప్పడంతో అతని మాటలు నమ్మాడు.

  తనకు ఉన్నటువంటి సమస్య చెప్పుకొని దాన్ని తీర్చమని కోరగా అతడు దానికి చాలా పూజలు చేయా ల్సి ఉంటుందని వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి పూజలు, హోమమం చేయాల్సి ఉంటుందని చెప్పి అతని వద్దనుండి 2 లక్షల రూపాయల డబ్బులు తీసుకుని పూజలు చేయడం మొదలుపెట్టాడు. పూజలు చేసిన సదరు వ్యక్తికి ఎటువంటి ప్రయోజనం కలగకపోవడం తో మోసపోయాను అని గ్రహించాడు .దొంగబాబా గురించి అరదీసాడు. అప్పుడు ఆ వ్యక్తి కి అసలు విషయం తెలియడం తో టాస్క్ఫోర్స్ పోలీస్ మరియు రూరల్ పోలీసులను సంప్రదించాడు. దీంతో పక్కా సమాచారం తో పోలీసులు దొంగ బాబాను అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాడగా నివ్వరపోయే నిజాలు బయట పడ్డాయి.

  దొంగబాబా ఇప్పటికే చాలా మందిని పూజల పేరుతో అమాయక ప్రజలను మోసం చేయడమే కాక.. ప్రజలను టార్గెట్ చేసి పూజలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా చాలామందిని మోసం చేసినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. సంతానం కలుగ చేస్తాము ఆరోగ్య సమస్యలు తీరుస్తానాని చాలా మంది నుండి లక్షలు కాజేశాడని విచారణలో దొంగ బాబా నిజస్వరూపం బయట పడింది. ఇలాంటి దొంగ స్వాముల మాయమాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Arrested, Cheating, Karimangar, Telangana Police

  ఉత్తమ కథలు