Karimnagar: చిన్నగొడవలకే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్న జంటలు.. కాపురాలు దిద్దుతున్న ఖాకీలు..

ప్రతీకాత్మక చిత్రం

మూడుముళ్ల బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారుతోంది . జీవితాంతం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన కొందరు విడిపోతామంటూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.

  • Share this:
    మూడుముళ్ల బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారుతోంది . జీవితాంతం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన కొందరు విడిపోతామంటూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. చిన్న గొడవలకే పంచాయితీల వరకు వెళ్తున్నారు. కలిసి ఉండమంటూ .. పచ్చటికాపురాన్ని కూల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్న పలు జంటలకు పోలీసులు కౌన్సె లింగ్ ఇస్తున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించి కాపురాలను నిలబెడుతున్నారు. కరీంనగర్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు స్టేషన్‌కు 794 ఫిర్యాదులు రాగా.. 609 పరిష్కరించి వారికి కొత్త జీవితాలను అందించారు.

    ప్రస్తుతం ట్రెండు మారింది. గతంలో పెద్దలతో కలిసి ఉన్నప్పుడు దంపతుల మధ్య చిన్న సమస్య వచ్చినా .. ఇంట్లోనే పరిష్కరించేవారు. ఇద్దరికీ సర్దిచెప్పేవారు . ఇప్పుడు అలా కాదు. పెళ్లయ్యాక చాలామందికి పెద్దలతో కలిసి ఉండడం రుచించడం లేదు. పెళ్లికి ముందే ఉద్యోగ, వ్యాపారరీత్యా వేరుకాపురం పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లయిన నాలుగు రోజులకే ఇంటివారికి దూరంగా వెళ్తున్నారు. అలా వెళ్లినవారు కొన్నాళ్లపాటు బాగానే ఉంటున్నా.. తరువాత దంపతుల మధ్య ఆధిపత్య ధోరణి పెరుగుతోంది. అభిప్రాయభేదాలతో చిన్నగొడవలకే విడాకుల వరకు వెళ్తున్నారు. చాలాకేసుల్లో రెండు , మూడు నెలల్లోనే విడాకుల వరకు రావడం బాధాకరమని, ఇలాంటివి వేరుకాపురంలోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.

    తల్లిదండ్రులు సైతం పిల్లలకు పెళ్లికి ముందు కొన్ని నైతిక విలువలు నేర్పించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. దాంపత్య బంధం గురించి, అత్తవారింట్లో మెదలాల్సిన పద్ధతుల గురించిచెప్పాలని అంటున్నారు. చిన్న సమస్య రాగానే పెద్దలు కూడా ఆలోచన లేకుండా వ్యవ హరించడం సరికాదని సూచిస్తున్నారు. వారికి సర్దిచెప్పాల్సిన బాధ్యత పెద్దలపై ఉంటుందన్నారు. కౌన్సెలింగ్ కు వచ్చే వారు చాలామంది ప్రేమ వివాహాలు చేసుకున్న వారే ఉంటున్నారని ఎస్సై సురేందర్ తెలిపారు.

    చదవండి: Nirmal: లగ్గం ఆడా.. భోజనం ఇడా.. చాలా కొత్తగా ఉందంటున్న అతిథులు

    Dalit Bandhu: హుజురాబాద్‌లో దళిత బంధు అమలుకు మరో రూ. 500 కోట్లు..

    దంపతులు గొడవలతో కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్‌కు రాగానే .. వారికి వేర్వేరుగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. భార్యాభర్తల బంధం గురించి వివరిస్తుంటారు. స్టేషన్‌లోని కౌన్సిలింగ్ సెంటర్‌లో సైకాలజిస్టులు, న్యాయనిపుణులు, పోలీసులు కలిసి వారికి సర్దిచెబుతుంటారు . సమస్యను బట్టి అనుకూలమైన పరిష్కారాన్ని చూపుతుంటారు. ఆవేశంగా వచ్చిన దంపతులు ఏకమై వెళ్లడం సంతోషంగా ఉందని పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దంపతుల మధ్య ఏర్పడిన సమస్యను చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలని, ప్రతీ విషయంలో గొడవపడడం మానుకోవాలని, ఒకరినొకరు పరస్పరం గౌరవం ఇచ్చుకోవడంతో పాటుగా.. అత్తింటి, పుట్టింటి విలువలకు గౌరవం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ముందకు సాగితే వివాహబంధం సంతోషంగా ఉంటుందని అంటున్నారు. గొడవలు పెట్టుకొని పోలీస్ స్టేషను వచ్చిన కేసుల్లో కౌన్సెలింగ్ ఇస్తూ .. దంపతులను కలుపుతున్నామని కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలిపారు.

    (పి శ్రీనివాస్, న్యూస్18 కరీంనగర్ కరస్పాండెంట్)
    Published by:Sumanth Kanukula
    First published: