Home /News /telangana /

KARIMNAGAR KARIMNAGAR POLICE ARRESTED 3 ACCUSED WHO KIDNAPED A BOY FROM MUBAI VRY

Boy kidnap : ముంబయి TO హైదరాబాద్ ... 3 లక్షల 15 వేలకు బాలుడి అమ్మకం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Boy kidnap : మూడు లక్షల కోసం కక్కుర్తి పడి తల్లి నుండి బిడ్డను వేరు చేశారు. అదికూడ ముంబయి రోడ్లపై యాచిస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్న మహిళ నుండి బాలున్ని ఎత్తుకు వచ్చి కరీంనగర్‌లో అమ్మిన ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

    కన్న పేగు నుండి పిల్లలను వేరు చేస్తున్న ముఠాను కరీంనగర్(Karimanagr) పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న పిల్లలను ఎత్తుకువచ్చి ఇతరులకు అమ్ముతున్న గ్యాంగ్‌పై(Gang) నిఘా పెట్టి రెండు రోజుల్లోనే మిస్టరీని చేధించి నిందితులను అరెస్ట్ చేశారు.

    3 లక్షల 15 వేలకు పిల్లాడి అమ్మకం

    కరీంనగర్ జిల్లా బుగ్గారం గ్రామానికి చెందిన 50 ఏళ్ల వయసు దాటిన దంపతులకు పిల్లలు లేరు. అయితే వాళ్లకు నక్క రాజు అనే డిష్​ మెకానిక్ పరియచమయ్యాడు. తమకు ఓ బాబు కావాలని అడిగారు... దీంతో ముంబయిలో తనకు తెలిసిన వారికి సమాచారం చేరవేశాడు. దీంతో ముంబయి(Mumbai) చెందిన ఓ మధ్యవర్తికి సమాచారం అందించారు. దీంతో ఓ బాలున్ని ఇచ్చేందుకు ముంబయికి చెందిన గ్యాంగ్ ఒప్పుకున్నారు. ఇందుకోసం మూడు లక్షల పదిహేను వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో డబ్బులు(Money) చెల్లించి బాలున్ని తీసుకువచ్చేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన జంట ముంబయికి వెళ్లారు.

    ఇది చదవండి : మూడు కిలోల బంగారం కోసం స్కెచ్.. స్నేహితుడికి ఇచ్చి.. ప్లాన్..


    యాచక దంపతుల నుండి బాలుడి కిడ్నాప్

    కాగా బాలుడ్ని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ముఠా గత నెల 29 ముంబయి వీధుల్లో యాచక దంపతుల (Beggers family) నుండి ఓ బాలుడ్ని అపహరించారు. ఆ బాలున్ని కరీంనగర్ దంపతులకు అప్పగించేందుకు సిద్దమయ్యారు. డబ్బులు ఇచ్చి కారులో బయలు దేరారు.

    ఇది చదవండి : డబుల్ ఇళ్లను ఆక్రమించుకున్న లబ్ధిదారులు.. తాళాలు పగులగొట్టి గృహ ప్రవేశం


    ముంబయిలో కేసు నమోదు

    అయితే బాలుడి కోసం వెతికిన యాచక జంట ముప్పైవ తేదీన పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సీసీ కెమెరా సహాయంతో పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడ్ని తీసుకువచ్చి కారు నంబర్‌ను ముంబయి పోలీసులు గుర్తించారు. దీంతో కారు కరీంనగర్ జిల్లాకు చెందినది కావడంతో కమీషనర్ సత్యనారాయణకు(Satyanarayana) సమాచారం అందించారు.

    నిందితులను అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు

    వెంటనే అప్రమత్తమైన కమీషనర్‌ బాలుడి ఆచూకి కోసం సెర్చ్ చేసి కనిపెట్టారు. అనంతరం ముంబయి నుండి తీసుకువచ్చి దంపతులను ఆధీనంలోకి తీసుకుని ముంబయి పోలీసులకు సమాచారం అందించారు. కాగా నేడు వారు కరీంనగర్‌కు చేరుకుని బాలుడ్ని తీసుకువెళ్లడంతో పాటు మధ్యవర్తి మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Karimnagar, Maharashtra, Mumbai crime, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు