హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: కొత్త మునిసిపల్ చైర్మన్ ఎవరు.. మున్సిపల్ చైర్మన్ విషయం లో తల పట్టుకుంటున్న ఎమ్మెల్యే.

Karimnagar: కొత్త మునిసిపల్ చైర్మన్ ఎవరు.. మున్సిపల్ చైర్మన్ విషయం లో తల పట్టుకుంటున్న ఎమ్మెల్యే.

మున్సిపల్ కార్యాలయం

మున్సిపల్ కార్యాలయం

Telangana: తెలంగాణా రాష్ట్ర వ్యాప్తం గా సంచలం సృష్టించిన జగిత్యాల మున్సిపాలిటి చైర్మెన్ రాజీనామా బిఆర్ఎస్ పార్టీలో ఇన్ని రోజులు నివురుకప్పిన నిప్పుల ఉన్న లుకలుకలని బయటికితెచ్చినవి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

శ్రీనివాస్. పి. న్యూస్ 18తెలుగు, కరీంనగర్.

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తం గా సంచలం సృష్టించిన జగిత్యాల మున్సిపాలిటి చైర్మెన్ రాజీనామా బిఆర్ఎస్ పార్టీలో ఇన్ని రోజులు నివురుకప్పిన నిప్పుల ఉన్న లుకలుకలని బయటికితెచ్చినవి. జగిత్యాల ఎమ్మెల్యే తో పొసగక భోగ శ్రావణి రాజీనామా చెయ్యడం తో కొత్త చైర్మెన్ ఎంపిక జగిత్యాల ఎమ్మెల్యే కి ఇప్పుడు సవాల్ గా మారింది. కొత్త చైర్మెన్ ఎంపిక జగిత్యాల ఎమ్మేల్యే కి అప్పజెప్పడం తో వచ్చే ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జగిత్యాల లో  అత్యధిక జనాభా ఉన్న పద్మశాలిలకే కట్టబెట్టె అవకాశం ఉండడం తో చైర్మెన్ పదవికి నలుగురు పద్మశాలి వర్గానికి చెందినా వారు పోటి పడుతున్నారు.

రోజురోజుకి చైర్మెన్ పదవి చేబట్టలన్న ఆశావహుల సంఖ్యా కూడా పెరిగిపోతుంది. బిఆర్ఎస్ అధిష్టానం జగిత్యాల ఎమ్మెల్యే కే చైర్మెన్ ఎంపిక పూర్తీ భాద్యతలనిఅప్పజెప్పింది. మాజీ చైర్ ఫర్సన్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపుల వల్లనే పదవి నుండి తప్పుకుంటున్నానని ఎమ్మెల్యే లపై ఆరోపణలు చేసింది. కలెక్టర్ ని  కలిసి తన రాజీనామా ని కూడా సమర్పించింది.

ఇన్నిరోజులు కలిసి అభివృద్ధి లో భాగస్వామ్యులుగా ఉన్న ఇద్దరు ఒక్కసారిగా శ్రావణి ఎమ్మెల్యే పై ఆరోపణలు చెయ్యడం తో జగిత్యాల రాజకీయాలు వేడెక్కినవి.శ్రావణి మద్దతుగా పద్మశాలి సామజిక వర్గం మద్దతు కూడా తెలిపి అండగా నిలవడం తో చివరికి ఎమ్మెల్సి రమణ జోక్యం కూడా చేసుకోవలసి వచ్చింది.

జగిత్యాలలో పద్మశాలి సామజిక వర్గానికి చెందినా 28  వేల ఓట్లు ఉండడం తో పద్మశాలి ఓట్లే వచ్చే ఎన్నికలలో కీలకం గా మారి గెలుపోటములు ప్రభావితం చేసే అవకాశం ఉంది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మున్సిపల్ చైర్మెన్ ఎంపిక విషయం లో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పద్మశాలిలా ఓట్లు రాబట్టాలి అంటే అదే సామాజిక వర్గానికి కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

జగిత్యాల లో మున్నూరు కాపు సామజిక వర్గానికి చెందినా ఓట్లు కూడా ఎక్కువ ఉండడం తో మున్నూరు కాపు సామజిక వర్గం వారు కూడా తమకి గత సారి చైర్మెన్ ఇవ్వలేదని కావున ఇప్పుడు తమకే కావాలని సంజయ్ దగ్గర పట్టు బడుతున్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్మెన్ కోసం మున్నురుకాపు సామజిక వర్గానికి చెందినా శ్రీవాణి,రజని  ,పద్మశాలి సామజిక వర్గానికి చెందినా జ్యోతి ,ఒడ్డెర సామజిక వర్గానికి చెందినా రేణుక లు పోటిపడుతున్నారు.

జగిత్యాల పట్టణం లో పద్మశాలి మరియు మున్నురుకాపు సామజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండడం తో ఎప్పుడు రెండు సామాజిక వర్గాలలో ఎవ్వరి వైపు మొగ్గు చుపాలన్నది సంజయ్ కి కొత్త తలనొప్పి తీసుకువచ్చింది అలాగే కవిత జోక్యం చేసుకుంటారా లేదా లేకుంటే కవిత అనుచరుల కట్టబెట్టే అవకాశం ఉన్నాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . అందుకే సంజయ్ కుమార్ చైర్మెన్ ఎంపిక విషయం లో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

కరువుమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం అన్న చందం గా తయ్యరైంది సంజయ్ కుమార్ పరిస్థితి. సంజయ్ కూడా అందరు కౌన్సిలర్ల తో మాట్లాడి అందరి ఆమోదయోగ్యమైన వారికే చైర్మెన్ ఇస్తారని భావిస్తున్నారు....ఇప్పటికే చైర్ ఫర్సన్ రాజీనామా తో మొదలైన రాజకీయ కుదుపులు సంజయ్ కుమార్ ని ఎటు వైపు తీసుకుపోతాయో వేచి చూడాలి మరి...

First published:

Tags: Karimangar, Local News, Telangana

ఉత్తమ కథలు