Home /News /telangana /

KARIMNAGAR KARIMNAGAR HAS RECORDED THE HIGHEST TEMPERATURES IN THE SUMMER SEASON AND EXPERTS ADVISING PEOPLE TO BE CAREFUL KNR PRV

Summer: ఆ జిల్లాలో భానుడి ఉగ్రరూపం.. ఎండలతో ఠారెత్తిపోతున్న జనం.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

పగటి ఉష్ణోగ్రతలు మార్చి నెలలో దడ పుట్టిస్తుండటంతో ప్రజలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మండు వేసవి మే నెలలో ఎండ ఎంతగా ఉంటుందోననే ఆందోళన మొదలైంది.

    (న్యూస్ 18, తెలుగు. కరస్పాండెంట్​. శ్రీనివాస్. పి)

    మార్చిలోనే  భానుడు భగభగమంటున్నాడు. ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఎండలు (Suns) ముదురుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ నమోదైంది . శని, ఆదివారం.. కూడా ఇదే జిల్లాలో 43 డిగ్రీలను దాటేలా ప్రభావం కనిపించింది . గతానికి మించి ఈ ఏడాది వేసవి (Summer)లో ఒక్కటి, రెండు డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉందని ఇప్పటికే భారత వాతావరణ విభాగం ( ఐఎండీ ) నివేదికలో వెల్లడించింది . పగటి ఉష్ణోగ్రతలు మార్చి (march) నెలలో దడ పుట్టిస్తుండటంతో ప్రజలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మండు వేసవి మే నెలలో ఎండ ఎంతగా ఉంటుందోననే ఆందోళన మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా వ్యాప్తంగా గతేడాది 19 మంది వడదెబ్బ కారణంగా చనిపోయారు. అంతకుముందు సంవత్సరం కూడా 15 మంది వరకు ఎండల వల్ల ప్రాణాల్ని కోల్పోయారు . ఈసారి భానుడి ప్రతాపం భారీగానే ఉండనుండటంతో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని వాతావరణ నిపుణులు చెపుతున్నారు . ఇక నాలుగు జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు 2015 వ సంవత్సరంలో నమోదయ్యాయి .

    ఉమ్మడి జిల్లాలో (Karimnagar) గడిచిన కొన్నేళ్లల్లో అత్యధికంగా 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై రికార్డు నెలకొంది . ధర్మపురి ( జగిత్యాల ) 2015 మే 21 న 48.9 తీవ్రత కనిపించింది . తరువాత స్థానంలో జమ్మికుంట ( కరీంనగర్ ) లో 2015 మే 30 న నమోదైన 48.8 , మూడోస్థానంలో పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి పట్టణంలో 2015 మే నెల 22 న 48.6 డిగ్రీ సెల్సియస్ జోరు అగుపించింది . ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం 2016 ఏప్రిల్ 22 న 47.8 డిగ్రీ సెల్సియస్ ప్రభావం రికార్డు అంకెగా వాతావరణశాఖ గుర్తించింది . గత రికార్డులను చెరిపేసేలా ఈసారి తాపం ఉండే వీలుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గత మార్చిలో 38 డిగ్రీ ల ఎండ ఉన్నదని ఈసారి మర్చిలో 43 డిగ్రీ ల ఎండ ఉండటంతో ప్రజలు ఇప్పటి నుండే భయంతో వణికిపోతున్నారు..

    ఎండల నుండి ఉపశమనం పొందాలంటే డాక్టర్స్ ఏం చెబుతున్నారు..?

    అత్యధిక ఎండలు ఉన్న నేపథ్యంలో  బయటకు వెళ్లి పనులు చేసుకునేవారు ఉదయం 7 గంటల నుంచి. 11 గంటల వరకు పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి రావాలని, తర్వాత సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల లోపు పనులు పూర్తి చేసుకొని ఇళ్లలోకి చేరుకోవాలి అన్నారు. ముఖ్యంగా వృద్ధులు , చిన్నపిల్లలు, అలాగే గర్భిణీలు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పనులు చూసుకోవాలన్నారు. డి హైడ్రేషన్ కాకుండా కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, ఎక్కువ వాటర్ తీసుకుంటే డి హైడ్రేషన్ కాకుండా ఎండ వేడిమి నుంచి తట్టుకోవచ్చని డాక్టర్స్ అంటున్నారు. ఒక వేళ తప్పని పరిస్థితిలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే తమవేంట గొడుగులు తీసుకెళ్లాలని కూడా డాక్టర్ సూచిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Karimangar, Summer

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు