Home /News /telangana /

KARIMNAGAR KARIMNAGAR DISTRICT PEOPLE BELIEVE DRINKING WATER FROM THE DOOD WELL WILL NOT CAUSE DISEASES SNR KNR

Karimnagar : కరీంనగర్ జిల్లాలో దూద్‌ బావి ..ఆ నీళ్లు తాగితే ఆ విషయంలో ఢోకా లేదంట

(బావి నీళ్లలో రోగాలు మాయం)

(బావి నీళ్లలో రోగాలు మాయం)

Medicinal water:దూద్‌ బావి. ఆ నీళ్లు తాగితే జబ్బులు ఇట్టే నయం అవుతాయని అక్కడి జనం నమ్మకం. నీళ్లు పాలు ఉన్నట్లుగా స్వచ్ఛమైన తెల్లగా ఉండటం వల్లే ఈజలం దివ్యఔషదజలంగా పనిచేస్తుందంటున్నారు. మరి అంతటి ప్రత్యేకత కలిగిన నీళ్లు ఎక్కడున్నాయో..ఆ దూద్‌ బావి గురించి ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్‌ తెలుసుకోవాల్సిందే.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,New18,Karimnagar)
    ఎక్కడైనా నీళ్లు నీలం రంగులో ఉంటాయి. కాని అక్కడి బావిలో నీళ్లు మాత్రం తెల్లగా పాలులా ఉంటాయి. చుట్ట పక్కల జలపాతం, సెలయేరు లాంటివి లేకుండానే బండరాళ్ల మధ్యలో వెలసిన బావి కావడంతో ఆ బావిలోని జలాన్ని ఔషదజలం(Medicinal water)గా భావిస్తున్నారు. అందుకే ఆ బావిని దూద్‌ బావి (Dudh well)అని పిలుస్తున్నారు. ఇంతకీ ప్రత్యేకతలు కలిగిన ఆ బావి ఎక్కడుందంటే కరీంనగర్ ( Karimnagar)జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్లు దూరంలో శంకరపట్నం(Shankarpatnam)మండలంలోని మొలంగూర్(Molangur)గ్రామంలో ఓ పురాతన బావి ఉంది . దాన్ని దూద్ బౌలిగా పిలుస్తారు. ఈ బావి (Well)లోని నీళ్లే ఇక్కడి జనం సర్వరోగ నివారణికిగా భావిస్తారు.

    రాతి గోడల మధ్యలో బావి..
    చుట్టూ పెద్ద గుట్టలు, రాతి గోడల మధ్య ఉన్న ఆ బావిలో పాల వంటి స్వచ్ఛమైన నీళ్లు లభ్యం అవుతున్నాయి. ఆ బావి నీళ్లు తాగితే రోగాలేవీ దరి చేరవనేది స్థానికుల నమ్మకం. అది ఇప్పటి మాట కాదు ప్రపంచాన్ని గడగడలాంచిన కరోనా కష్టకాలంలోనే ఈవిషయం నిర్ణారణ అయిందంటున్నారు స్థానికులు. కరోనా సమయంలో ఈ బావి నీళ్లు తాగడం వల్ల ఊరిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దాంతో అప్పటి నుండి ఈ బావి నీళ్లకు ప్రచారం ఊపందుకుంది. స్థానికులే కాదు చుట్టు పక్క గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి బావి నీటిని తీసుకెళ్తున్నారు.



    చరిత్ర కలిగిన బావి..
    ఊరిలో తొవ్విన బావో, పొలంలో నీళ్ల కోసం తోడిన బావి కాదు మొలంగూర్‌లో ఉన్న దూద్‌ బౌలి బావి చరిత్రతో ముడిపడి ఉంది. ఈ బావి నీటిని నిజాం నవాబు కూడా తాగేవారట. కరీంనగర్ నుంచి రోజూ గుర్రం మీద నిజాం నవాబు వచ్చి నీటిని తీసుకెళ్లేవారని ఇక్కడి పూర్వికులు చెబుతుంటారు. ఔషధ విలువలు ఉండటంతోనే నిజాం నవాబు ఈ బావి నీరు తాగే వారని చెబుతుంటారు. ఇప్పటికీ నల్లాల ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందుతున్నప్పటికీ .. మొలంగూరు గ్రామస్థులు ఆ బావి నీరే తాగుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. నీటి ప్రతేకత ఏంటో తెలుసుకోవడానికి జలవనరుల సంస్థ కూడా పరిశోధనని కూడా మొదలు పెట్టారట.

    ఇది చదవండి : గుడిలోకి వెళ్లి వచ్చేలోపే చెప్పులమ్ముకున్న కాంట్రాక్టర్ ..భక్తులు ఏం చేశారంటే


     

    ఎలా వెళ్ళాలి..
    కరీంనగర్‌ జిల్లాలో ఉన్న దూద్ బౌలి బావికి వెళ్లాలంటే బస్సులో వెళ్లాలనుకునే వారు కరీంనగర్ నుండి వరంగల్ బస్ ఎక్కి కథలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద దిగాలు. అక్కడి నుండి మోలగూర్‌ వెళ్ళే బస్సు ఎక్కితే సరిపోతుంది. ఇక వరంగల్ నుండి అక్కడికి వెళ్లాలనుకునే వారు వరంగల్లో బస్సు ఎక్కి కథలపూర్ ఎక్స్ రోడ్డు వద్ద దిగి అక్కడి నుండి మోలాగూర్ బస్సు ఎక్కితే సరిపోతుంది. కార్ బైక్ పై వెళ్ళేవారికి కూడా సేమ్ రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. ఇంతటి విశేష ప్రదేశంగా గుర్తింపు దక్కిన చారిత్రక ప్రదేశాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి పర్యాటప్రాంతంగా తీర్చిదిద్దితే బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Karimnagar, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు