(Srinivas. P , News 18, Karimnagar)
సాధారణంగా పోలీసులంటే (Police) కనీసం తినడానికి టైం దొరకని పరిస్థితి.. ఎప్పుడు ఏ ఫోన్ కాల్ వస్తుందో.. ఏ అధికారి ఫోన్ చేస్తడో.. సిటీలో ఎక్కడ ఏం జరుగుతుందో అని టెన్షన్ తో ఉంటారు.. అలాంటప్పుడు కనీసం తినడానికి కూడా టైం దొరికని పరిస్థితి మనం రోజూ చూస్తూనే ఉన్నాం.. అలాంటిది కరీంనగర్ జిల్లాకు చెందిన పోలీస్ అధికారి డీసీపీ శ్రీనివాస్ (Deputy commissioner of Police).. వెరైటీ బిర్యాని (Biryani) చేస్తూ నోరూరించే విధంగా గుమగుమలతో వివిధ వంటకాలు చేస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నారు.. మరి అది మనం అనుకునే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అనుకుంటే పొరపాటే.. మిల్లెట్స్ బిర్యానీ (Millets Biryani) చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. సాధారణంగా మనం మిల్లెట్స్ ద్వారా చపాతి, జావా, గడూక, అలాంటివి చూస్తుంటాం కానీ డీసీపీ శ్రీనువాస్ మిల్లెట్స్ ద్వారా వివిధ రకాల బిర్యానీ వండుతూ పోలీస్ శాఖలో మంచి పేరును సంపాదిస్తున్నారు.
మిల్లెట్స్ పండించేవాళ్లమని..
ఈ విషయంపై న్యూస్ 18 డీసీపీ శ్రీనివాస్ (DCP Srinivas) గారిని పూర్తి వివరాలు తెలుసుకోగా.. ఈ విధం గా చెప్పుకొచ్చాడు. తమది వ్యవసాయ రైతు కుటుంబమని, మహబూబాబాద్ సొంత ఊరు అని చెప్పారు. చిన్నతనం నుంచి మా అమ్మానాన్నలు కష్టపడి వివిధ రకాల మిల్లెట్స్ పండించేవాళ్లమని చెప్పారు. అయితే వాటిని ఎక్కువగా ఆహారంగా తీసుకునే వాళ్లమని డీసీపీ తెలిపారు. తనకు పోలీస్ ఉద్యోగం (Police job) వచ్చాక కూడా వాటిని తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేను హెల్త్ పరంగా హాస్పిటల్‌కు వెళ్లిన దాఖలాలు లేవన్నారు డీసీపీ.
ఐతే తను పోలీస్ శాఖలో శిక్షకుడిగా ఉన్నప్పుడు కొత్తగా ట్రైనింగ్ వచ్చిన కానిస్టేబుల్ ఎస్ఐ (SI)లు ఈవెంట్స్ కొట్టేటప్పుడు అలిసిపోయి కింద పడి పోయేవారని వారని తెలిపారు డీసీపీ. వారిని చూసి..ఏసీపీ శ్రీనివాస్ చలించిపోయి వీరికి ఏదైనా హెల్తి ఫుడ్ (Healthy food) ఇచ్చి ఫిట్‌గా ఉంచాలని ఆలోచించాడు. అప్పుడు తనకు చిన్ననాటి ఆహారపు అలవాట్లు గుర్తుకొచ్చి సొంత డబ్బులు పెట్టి 100 మంది ట్రైనీ ఎస్సై, కానిస్టేబుల్ కు మిల్లెట్స్ తెప్పించి ఆహారంగా అందించారు. అప్పటి నుంచి ట్రైనింగ్ (Training)లో ఎస్సై కానిస్టేబుల్ ఫిట్ గా ఉండటం చూశారు. వాళ్లంతా అలసిపోకుండా ఉండటంతో చాలా సంతోషపడ్డానని చెప్పారు డీసీపీ. అప్పటినుంచి మిల్లెట్స్ (Millets) తో వివిధ రకాల బిర్యానీని తయారు చేయడం నేర్చుకున్ననని న్యూస్ 18కి తెలిపారు. ఎవరైనా నేర్చుకోవాలంటే తనను సంప్రదిస్తే తప్పకుండ నేర్పిస్తానని ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Biryani, Karimangar, Police