హోమ్ /వార్తలు /తెలంగాణ /

Constable Save Life: అతడి సమయస్ఫూర్తి నిండు ప్రాణాన్ని కాపాడింది.. సోషల్ మీడియాలో అతడిపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు..

Constable Save Life: అతడి సమయస్ఫూర్తి నిండు ప్రాణాన్ని కాపాడింది.. సోషల్ మీడియాలో అతడిపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు..

ఘటనా స్థలంలో బాధితుడిని కాపాడుతున్న కానిస్టేబుల్

ఘటనా స్థలంలో బాధితుడిని కాపాడుతున్న కానిస్టేబుల్

Constable Save Life: అతడి సమయస్పూర్తి ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. అందరిలా విధులకు వెళ్లామా.. ముగించుకొని ఇంటికి వచ్చామా అని ఉండకుండా ఓ పోలీస్ కానిస్టేబుల్ సరైన సమయంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ వ్యక్తిని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆగిన గుండెకు పోలీస్ కానిస్టేబుల్ ఊపిరి పోశారు. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద బొమ్మకల్ కు చెందిన ఎండి అబ్దుల్ ఖాన్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీ అతన్ని కొట్టింది. దీంతో అబ్దుల్ ఖాన్ అక్కడికక్కడే పడిపోయి అపస్మారక స్థితికి చేరాడు. చుట్టుపక్కల జనం చూస్తూ ఉండి పోయారు. కానీ అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వన్ టౌన్ కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అపస్మారక స్థితికి కు చేరుకున్న యువకుడు ఛాతిపై ప్రెసింగ్ చేశాడు. అలా మూడు,నాలుగు నిమిషాలు చేయడంతో యువకుడిలో చలనం వచ్చింది. వెంటనే ఆ యువకుడిని 108లో ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తి పట్ల సీపీ కమలాసన్ రెడ్డి తో పాటు పలువురు అభినందించారు.

సిపి కమలాసన్ రెడ్డి మాటలును ప్రేరణగా తీసుకుని, ట్రైనింగ్ లో నేర్చుకున్న అంశాలతో సకాలంలో స్పందించి యువకుడు ప్రాణాలు కాపాడానని కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ తెలిపారు. ఖలీల్‌ గొప్ప పనిపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.


అందరూ అతడి సేవలకు సలాం కొడుతున్నారు. వైద్యులు ఈ విషయం తెలుసుకొని కానిస్టేబుల్‌ ఖలీల్‌ చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. ఖలీల్‌ ఎంతో సమయస్ఫూర్తితో, అత్యంత వేగంగా స్పందించారని కొనియాడారు. ప్రస్తుతం ఆ యువకుడు స్థానిక ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

First published:

Tags: Accident, Karimnagar, Telangana Police

ఉత్తమ కథలు