హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar Child Records: వయసేమో మూడు.. రికార్డులేమో బోలెడు.. అద్భుతాలు సృష్టిస్తున్న కరీంనగర్ బుడ్డోడు..

Karimnagar Child Records: వయసేమో మూడు.. రికార్డులేమో బోలెడు.. అద్భుతాలు సృష్టిస్తున్న కరీంనగర్ బుడ్డోడు..

శ్రీ హరన్​

శ్రీ హరన్​

మూడేళ్ల వయసులో (Three years age) సరిగ్గా మాట్లాడడమే రాదు పిల్లలకు అలాంటిది. ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్ (Indian Book of Records)సాధించాడు మన బుడ్డోడు.

( G. Srinivas, News18, Karimnagar)

మూడేళ్ల వయసులో (Three years age) సరిగ్గా మాట్లాడడమే రాదు పిల్లలకు అలాంటిది. ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్ (Indian Book of Records)సాధించాడు మన బుడ్డోడు. కరీంనగర్​కు (Karimnagar) చెందిన కాసం శ్రీహరన్ (kasam Sriharan) మాత్రం మాటలు నేర్చుకోవడమే కాదు .. ఏకంగా ఇండియా బుక్ లో రికార్డ్ సృష్టించారు. ఏడాదిన్నర నుంచే మాట్లాడటానికి యత్నించిన శ్రీహరన్ ను గమనించిన తాతయ్య విశ్రాంత తహసిల్దార్ శంకరయ్య బుడతడికి జ్ఞాపక శక్తికి  (Memory power)అనుగుణంగా మంచి విషయాలు నేర్పించాలని సూచించారు . దీంతో చిన్న చిన్నశ్లోకాలను నేర్పించారు .

2019 నవంబర్ 6 న జన్మించిన శ్రీహరన్ గాయత్రి మంత్రంతో  పాటు బ్రహ్మమురారి , సరస్వతి  మంత్రం (Saraswati Mantra) నేర్చుకోవడమే కాకుండా సునాయాసంగా అప్పచెప్పాడు. దీంతో తల్లి శ్రావణి వివిధ అంశాలను నేర్పడం మొదలు పెట్టింది . శ్లోకాలతో ప్రారంభమైన శ్రీహరన్ ప్రయాణం అనూహ్యంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డు (India Book of Records) వైపు మళ్లింది . 19 అంశాలు ధారాళంగా చెప్పగలడనే ఉద్దేశంతో తల్లిదండ్రులు శ్రావణి సుమన్ కుమార్​లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేయించారు .

అతి పిన్న వయస్సులో..

శ్రీహరన్ తొలి ప్రయత్నంలోనే 38 పదాలను ఆంగ్లం నుంచి హిందీలో అనువదించడం , 20 వైద్య పరికరాలను గుర్తించడంతో పాటు 13 పార్కు అంశాలను 18 రంగులు , 33 వాహనాల పేర్లు చెప్ప డంతో పాటు 16 ఎలక్ట్రానిక్ పరికరాలు 31 స్వతంత్ర సమరయోధులు, 13 దేవతా చిత్రపటాలను గుర్తించడం, 52 గృహ కోపకరణాలు , 30 రకాల పళ్లు , 29 రకాల కూరగాయలు, 22 మానవ శరీర అవయవాలు, 51 దేశాల జాతీయ పతాకాలు , 28 రాష్ట్రాల రాజధానులు (capitals) , 8 కేంద్రపాలిత ప్రాంతాల పేర్లతో పాటు గాయత్రి మంత్రం నాలుగు శ్లోకాలను ధారాళంగా చెప్పి అబ్బురపరిచాడు . దీంతో అతి పిన్న వయస్సులో వివిధ అంశాలు నోటికి ఆపచెప్పే వ్యక్తిగా  ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రశంసా పత్రాన్ని అందజేసింది.

శ్రీహరన్​

పిల్లల్ని చదవమని బలవంతం చేస్తే లాభాల కంటే నష్టమే అధికంగా ఉంటుందని శ్రీహరిన్ తల్లి శ్రావణి (Sravani) సూచిస్తోంది . ‘‘సరదాగా నేను చెప్పిన పదాలను మా బాబు ఉచ్చరించి గుర్తు పెట్టుకునేవాడు. ఎక్కడ కూడా ఎలాంటి కోచింగ్ కూడా తీసుకోలేదు . ఒత్తిడి చేస్తే నేర్చుకొనే అలవాటు పిల్లలకు ఉండదని అర్ధమైంది . శ్రీహరన్ ఏ ప్రాంతానికి వెళ్లినా తర్వాత మళ్లీ అక్కడికి ఎప్పుడు వెళ్లినా అక్కడి వస్తువులను అంశాలను గుర్తు చేసేవాడు. ఒక వస్తువు గురించి చెబితే ఆ వస్తువును తెలుగులో ఏమంటారు ? ఆంగ్లంలో ఏమంటారు అడిగి గుర్తు పెట్టుకొనే వాడు. చిన్నపిల్లలకు ఏదైనా సరదాగా ఉన్నప్పుడు నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటారు”అని శ్రావణి అంటుంది.

First published:

Tags: Children, Karimangar, School boy

ఉత్తమ కథలు