KARIMNAGAR IT SEEMS THAT KAUSHIK REDDY WILL BE GIVEN THE POSTS IN ANGER OVER THE SPEARS DETAILS HERE KNR VB
MLC Koushik Reddy: హుజురాబాదులో తగ్గని రాజకీయ వేడి.. ఈటెల మీద కోపంతో కౌశిక్ రెడ్డికి పదవుల పంట..?
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, సీఎం కేసీఆర్
MLC Koushik Reddy: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ముగిసి రెండు నెలలు అవుతున్నా ఇంకా రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. ఉప ఎన్నికల తర్వాత ఒకవైపు మాజీ మంత్రి , ఎమ్మె ల్యే ఈటల రాజేందర్ రోజు ఒక జిల్లా తిరుగుతూ ప్రభుత్వ , కేసీఆర్ విధానాలపై ధ్వజమెత్తుతున్నారు. ఆయనతో పాటు అయన సతీమణి హుజురాబాద్ నియోజకవర్గంలో వివాహాలు , పరామర్శల కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
హుజూరాబాద్(Huzurabad) నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ముగిసి రెండు నెలలు అవుతున్నా ఇంకా రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. ఉప ఎన్నికల తర్వాత ఒకవైపు మాజీ మంత్రి , ఎమ్మె ల్యే ఈటల రాజేందర్(Etala Rajender) రోజు ఒక జిల్లా తిరుగుతూ ప్రభుత్వ , కేసీఆర్(KCR) విధానాలపై ధ్వజమెత్తుతున్నారు. ఆయనతో పాటు అయన సతీమణి హుజురాబాద్ నియోజకవర్గంలో వివాహాలు , పరామర్శల కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రతినిత్యం ఇక్కడే తిరుగుతూ పార్టీ శ్రేణులను కలుస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
కాగా హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు టీఆరెస్ పార్టీలో చేరి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హుజురాబాద్ నియోజకవర్గ ప్రతినిధులకు ఇన్చార్జిగా వ్యవహరించి వారి క్యాంపు నిర్వహణ ఏర్పాట్లు చూశారు . అందరు ఒక్కతాటి మీదకు వచ్చి ఎమ్మెల్సీ గెలుచుకునేలా గెల్లుతో కలిసి పావులు కాదిపారు. కాగా స్థానికంగా బీజేపీని , ఈటలను ఎదుర్కొనేందుకు కౌశిక్ రెడ్డి సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ పదవికి తోడు ప్రభుత్వ విప్ కూడా ఇచ్చి నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో ఈటల కంటె పై స్థాయిలో ఉండేలా టీఆరెస్ వ్యూహం చేస్తున్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్‌లో పార్టీ శ్రేణులను కాపాడుకునే బాధ్యత కౌశిక్ రెడ్డిపై అధిష్టానం పెట్టినట్లు తెలుస్తోంది . అందుకే ఆయనకు ఎమ్మెల్సీ తోపాటు విప్ పదవి కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది . సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం రెండేళ్లు ఉన్నప్ప టికీ హుజురాబాద్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆపార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. బీజేపీ తరఫున ఈటల, టీఆరెస్ తరఫున కౌశిక్, గెల్లు శ్రీనివాస్‌లు ఇక్కడ రాజకీయ ఆధిపత్యం ప్రదర్శించి తమ పార్టీ శ్రేణులను కాపాడుకునే యత్నాలు ప్రారంభించనున్నారు.
2023 ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ హుజురాబాద్ ఉప ఎన్నిక వైబ్రేషన్స్ ఇంకా తగ్గకపోగా రాజకీయ ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన కౌశిక్ రెడ్డి విప్ పదవితో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహం రచిస్తున్నట్లు వారి అనుచరులు చెబుతున్నారు. ఏదైమినప్పటికీ ఈటెల మీద కోపంతో కౌశిక్ రెడ్డికి పదవుల పంట మాత్రం పండుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.