హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: హుజురాబాద్ ఎఫెక్ట్.. మంత్రి గంగుల కమలాకర్ మెడకు ఉచ్చు..

Telangana: హుజురాబాద్ ఎఫెక్ట్.. మంత్రి గంగుల కమలాకర్ మెడకు ఉచ్చు..

 మంత్రి గంగుల కమలాకర్ (ఫైల్)

మంత్రి గంగుల కమలాకర్ (ఫైల్)

Telangana: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏళ్ల తరబడి నిబంధనలు తుంగలో తొక్కి గ్రానైట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదుతో స్పందించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘FEMA’ నిబంధనలు ఉల్లంఘించారని.. 9 గ్రానైట్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది ఈడీ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

(పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత కొంతకాలం నుంచి గ్రానైట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి నాణ్యమైన గ్రానైట్ ను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్పందించింది. తొమ్మిది మైనింగ్ క్వారీ లకు నోటీసులు జారీ చేసింది. 749 కోట్ల 60 లక్షల పైచిలుకు మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది వివరాల్లోకెళ్తే .. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో గ్రానైట్ క్వారీలు చాలా ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయి. ఇందులో చాలా గ్రానైట్ క్వారీలు పర్యావరణ అనుమతులను పట్టించుకోవడం లేదు. ఎంత సైజులో గ్రానైట్ క్వారీ లను కరీంనగర్ నుంచి విదేశాలకు ఎగుమతి చేశారు. దానికి చెల్లించిన పన్ను ఎంత అనే అంశం, అలాగే భూగర్భ జలాలు అడుగంటడం, వన్యప్రాణులు ఇబ్బందులు ఎదుర్కోవడం.. తదితర అంశాలతో తో కరీంనగర్ ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 2019 జూలై 31 న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అలాగే హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. తదనంతరం 2019 సెప్టెంబర్ లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సాయి సౌందర్య రాజన్ కి సైతం ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ క్రమంలో స్పందించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ..గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ కృష్ణపట్నం వైజాగ్ ఓడరేవుల వద్దకు వెళ్లి పరిశీలన చేశారు. అలాగే చెన్నై ఓడరేవు వద్దకు సైతం వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ క్రమంలో లో మైనింగ్ డిపార్ట్మెంట్ లో చూపించిన సైజు లకు వాస్తవంగా అక్కడ ఉన్న వాటికి సంబంధం లేదు. అనుమతి తీసుకున్న వాటికి మించిన సైజులో ఉందని వివరాలు సేకరించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమగ్ర నివేదికను మైనింగ్ అధికారులకు రిపోర్ట్ నెంబర్ 60 , 268 / ఎన్ఆర్ఐ/2013 అందించింది. ఈ క్రమంలో సివరేజ్ పనులు సైతం మెగా వేశారని తన నివేదికలో పేర్కొంది. దీంతో స్పందించిన అధికారులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే స్టేషన్ల నుంచి ఎంత మేర ట్రాన్స్పోర్ట్ చేశారు.. అనే కోణంలో పూర్తిస్థాయిలో విచారణ చేశారు. 1966 చట్టం ప్రకారం పెనాల్టీ తో సహా సీవరెజి.. ఫీజు సైతం వసూలు చేయాలని కోరింది.

ఈ మేరకు కరీంనగర్లోని శ్వేత ఏజెన్సీస్, ఏస్షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జె ఎం బాక్సి అండ్ కంపనీ, అరవింద్ గ్రానైట్, మైథిలి ఆదిత్య, కెవికేఏజేన్సీస్, సంధ్య తదితర క్వారీలు పన్నులు ఎగవేసారని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తేల్చిచెప్పింది . 749 కోట్ల 66 లక్షల రూపాయలను రికవరి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా విదేశాలకు ఎగుమతి చేసింది ఎంత.. పూర్తి వివరాలను అందించాలని ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆదేశాలు జారీ చేయడంతో కరీంనగర జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూడాలి దీనిపైనే గంగుల ఇతర క్వారీ యజమానులు స్పందన ఎలా ఉంటుందో.

First published:

Tags: Huzurabad, Huzurabad By-election 2021, Karimnagar, Minister gangula kamalakar, Telangana Politics

ఉత్తమ కథలు