( కరీంనగర్ జిల్లా...న్యూస్ 18తెలుగు కరస్పండెంట్ శ్రీనివాస్. పి.)
రాకెట్ యుగంలో కూడా మంత్రాలూ, తంత్రాలు, భానుమతి,అంటూ ప్రజల్లో భయాందోళనలు. తమతో పాటు కుటుంబ సభ్యులకు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు ,ఆ తర్వాత మరణాలు, మరోవైపు వీటన్నింటికి కారణం మంత్రాలు చేయడమే అనే అనుమానం.. ఏది జరిగినా వారే కారణమనే సాంఘిక పరిస్థితులు మొత్తం మీద పదుల సంఖ్యలో హత్యలు కొనసాగుతున్నాయి.
ఇలా కరీంనగర్ జిల్లాలో గడిచిన మూడేళ్లలో మంత్రాల నెపంతో 9 మంది హత్యకు గురయ్యారు. తాజాగా గురువారం తారాకరామనగర్లో ఒకేసారి ముగ్గురిని కిరాతకంగా హతమార్చటం సంచలనం సృష్టించింది . జిల్లాలో 2019 నుండి జరిగిన సంఘటనలు ఒకసారి చూస్తే... 14 హత్యలు జరగ్గా అందులో మంత్రాల నెపంతో ముగ్గురిని హతమార్చారు. 2020 లో 23 హత్యలు జరగ్గా మంత్రాల నెపంతో నలుగురిని చంపారు.. ఇక 2021 లో 25 హత్యలు జరగ్గా మంత్రాల పేరిట ఇద్దరిని హతమర్చారు . గత సంవత్సరం జరిగిన రెండు హత్యలను పరిశీలిస్తే కేవలం వివాహం జరక్కుండా చేస్తున్నారనే కారణంతో హతమార్చారు . గత అక్టోంబర్ 26 న కొడిమ్యాల మండలం సూరంపేటలో బొజ్జ నర్సయ్య ( 72 ) అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు . తనకు పెళ్లి కాకుండా మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో పిట్టల సుమన్ అనే యువకుడు గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది .
Adilabad : టూ వీలర్ కోసం హత్య .. మాయ మాటలు చెప్పి యువకుడిపై దారుణం..
డిసెంబర్ 26 న మల్యాల మండలం గొర్రెగుండంలో సుంకె దుబ్బయ్య ( 65 ) అనే వృద్ధుడిని కల్లు మండువాలో ఉండగా రేకుల మహేష్ అనే వ్యక్తి కొట్టి చంపాడు . తన కుమార్తెకు పెళ్లి కాకుండా మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది . జిల్లాలోని అన్ని పట్టణాలు , గ్రామాల్లో అనేక మంది ఎలాంటి సమస్య వచ్చినా ఇప్పటికే పూజలు , భూత వైద్యులనే ఆశ్రయించటం ఆశ్చర్యం కలిగిస్తోంది . అనారోగ్యమైనా , ఆర్థిక సమస్యలెదురైనా పూజలు చేసే వారిని , భూత వైద్యం చేసే వారిని సంప్రదిస్తుండటంతో ఇలాంటి వారి అమాకత్వాన్ని ఆసరా చేసుకుని ఏవో కారణాలు చెబుతూ పూజలు చేయిస్తుండటంతో నిజంగానే పలానా వ్యక్తి కారణంగానే సమస్యలెదురవుతున్నట్లు అనుమానాలు పెంచుకుంటున్నారు . సమస్య పరిష్కారమైతే పూజలు చేసేవారు , భూత వైద్యుల వల్లే మంచి జరిగిందని అనుకుంటుండగా జఠిలమైతే ఎవరిపైన అనుమానం ఉందో వారిపై కక్షలు పెరిగి హత్యలకు దారి తీస్తోందన్న అనుమానాలున్నాయి .
తారకరామనగర్ జరిగిన ముగ్గురి హత్య సైతం మంత్రాల అనుమానంతోనే జరిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది . మృతుల్లో ఒకరైన జగన్నాథం నాగేశ్వర్రావును ఇదివరకోసారి సిరిసిల్లలో మంత్రాలు చేస్తున్నావంటూ పంచాయితీకి పిలిచి మందలించారు . ఈ నేపథ్యంలో గురువారం కుల సంఘం పంచాయితీ జరుగుతుండగా పథకం ప్రకారమే నాగేశ్వర్రావు సహా అతని ఇద్దరు కుమారులను అతికిరాతకంగా పొడిచి చంపినట్లు భావిస్తున్నారు . కారణాలు ఇవేనా..
Dalita Bandhu : దళిత బంధు స్పీడప్.. 118 నియోజవర్గాల్లో అమలుకు డెడ్‌లైన్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ పల్లెటూర్లు ఉండడంతో.. ఇక్కడ ఆరోగ్య సమస్యలు అయినా, ఆర్థిక సమస్యల ఐనా ముందుగ టక్కున గుర్తొచ్చేది మూఢనమ్మకాలు., ఇలా మూఢనమ్మకాలపై ఆధారపడి చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితి. మరి జిల్లావ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి..
అనాది కాలం నుండి ఆచారాలు వస్తున్నాయని చాలామంది ఇప్పటికి కూడా ఎక్కువగా చేతబడి చేసే వారిని నమ్ముతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఉదాహరణకు గర్భిణీ డెలివరీ కావాలన్నా, అయ్యాక పాప, బాబు, బాగుండాలఅంటే హాస్పిటల్‌కు , డాక్టర్ దగ్గరికి వెళ్లాలి కానీ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం, గుండి గ్రామంలో ఇప్పటికి కూడా ఎక్కువ శాతం, బాలింతలు,గర్భవతులు, బుధవారం, ఆదివారం వస్తే, చాలు ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. కోళ్లు నిమ్మకయల తో ఊరంతా సందడిగా మారుతుంది. ఇప్పటి కూడా ఈ గ్రామానికి తెలంగాణ రాష్ట్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి బాధితులు వేల సంఖ్యలో వచ్చి మూఢనమ్మకాలు నమ్ముతున్న ఉన్న పరిస్థితి. మరి వీరి అందరి ఆరోగ్యం, ఆస్తులు బాగుందో లేదో తెలియదుగానీ పూజలు చేసే తంత్రికులు మాత్రం. కోట్లల్లో ఆస్తులు సంపాదించి పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ లో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.