KARIMNAGAR IS THE TICKET VALID FOR ONE OF THE FOUR AS A CONGRESS CANDIDATE DETAILS HERVE KNR VB
Huzurabad: అ నలుగురిలో ఒకరికి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఖాయం..! అధిష్టానం ఆలోచన కూడా ఇదేనా..
కాంగ్రెస్ పార్టీ జెండా
Huzurabad: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎట్టకేలకు కాంగ్రెస్ లో కదలిక వచ్చింది . హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో వడపోతల అనంతరం మాజీ మంత్రి కొండ సురేఖ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనా రాయణ , కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి , టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్ ల పేర్లను పరిశీలి స్తున్నారు . ఇందులో ఎవరికీ అనేది అధిష్టాణం చర్చోపచర్చలు జరుపుతోంది.
ఎన్నికల షెడ్యూలు(Election Schedule) విడు దల కావడంతో ఎట్టకేలకు కాంగ్రెస్ లో కదలిక వచ్చింది . హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో వడపోతల అనంతరం మాజీ మంత్రి కొండ సురేఖ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనా రాయణ , కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి , టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్ ల పేర్లను పరిశీలి స్తున్నారు . టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం భూపాలపల్లిలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభకు హాజరుకానున్నారు. నియోజకవర్గానికి చెందిన గండ్ర సంపత్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతు న్న సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు . ఈ సభకు హుజూరాబాద్ నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులను తరలించాలని నిర్ణయించారు . ఈ సభలో కాంగ్రె స్ అభ్యర్థి పేరును రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది .
కొండా సురేఖ వైపు అధిష్టానం మొగ్గుచూపుతున్నా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉండి అక్కడి నుంచి టికెట్ ఇస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేస్తానని తిరకాసు పెట్టడంతో కాంగ్రెస్ పెద్దలు డైలమాలో పడినట్లు తెలసింది . కొండసురేఖ కాంగ్రెస్ లో సీనియర్ నాయకురాలు , భర్త కొండ మురళి మాజీ ఎమ్మెల్సీ , సీనియర్ నాయకులు . హుజురాబాద్ కు ఆనుకొని ఉన్నపరకాల నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించారు . కొండ దంపతులది ఆదర్శ వివాహం భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కాగా , కొండ సురేఖ పద్మశాలి , హుజురాబాద్ నియోజకవర్గంలో పద్మశాలి ఓట్లు 20 వేల పైనే ఉంటాయి . వైఎస్ హయాంలో కొండా దంపతులు ఒక వెలుగు వెలిగారు . కొండా సురేఖ మంత్రిగా పనిచేశారు .
గతంలో హన్మకొండ ఎంపీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో కమలాపూర్ మండలంలో పర్యటించా రు . పరకాల కూడా కమలాపూర్‌కు ఆను కొని ఉంటుంది . ఇక్కడి వారితో పరిచయాలు ఉన్న కొండ సురేఖ పోటీలో ఉంటే త్రిముఖ పోటీ తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు . సురేఖ పేరు తరువాత పరిశీలనలో ఉన్న పేరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనా రాయణ పేరు . సత్యనారాయణ హుజూరాబాదు అనుకొని ఉన్న మానకొండూరు నుంచి గతంలో పోటీ చేశారు . ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పేరున్న డాక్టర్ . హుజూరాబాద్ లో బలంగా ఉన్న ఈ సామాజిక వర్గం ఓట్లు తమవైపు తిప్పుకోవచ్చని కాంగ్రెస్ ఆలోచిస్తుంది . కాంగ్రెస్ కిసానెమోర్చా జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి కూడా టికెట్ ఆశలో ఉన్నా రు .
హుజూరాబాద్ మండలం వెంకట్ రావుపల్లెకు చెందిన కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడు . గతంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా , తదనంతరం టీపీసీసీ అధికార ప్రతినిధి గా పనిచేసిన కరీంనగర్‌కు చెందిన ప్యాట రమేశ్ కూడ టికెట్ ఆశిస్తున్నారు . ఆయన పేరును పరిశీలిస్తున్నారు ... కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో టీపీసీసీ ఆశావహుల నుంచి దరఖాస్తుల ను స్వీకరించింది . మొత్తం 19 మంది దరఖాస్తుకు ఐదువేలు సమర్పించి దర ఖాస్తు చేసుకున్నారు .
దరఖాస్తు చేసుకు న్న వారి నుంచి ఇద్దరి పేర్లు , దరఖాస్తు చేసుకోని వారి నుంచి ఇద్దరి పేర్లను టీపీసీసీ పరిశీలిస్తుంది . దరఖాస్తులు చేసుకున్న వారిలో హుజూరాబాద్ నియోజకవర్గంనకు చెందిన జాలి కమలాకర్ రెడ్డి , సాయిని రవికుమార్ , గూడూరి స్వామిరెడ్డి , డాక్టర్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి , మొలుగూరి సదయ్య , నల్లకొండల్ రెడ్డి , తవుటము రవీందర్ , పత్తి కృష్ణారెడ్డి , పర్లపల్లి నాగరాజు , గూడెపు సారంగాపాణి , తొడుపునూరి ముక్తేశ్వర్ , వీరబోయిన కుమార్ , హుస్నాబాద్ నియోజకవర్గంనకు చెందిన ఒంటెల లింగారెడ్డి , మ్యాకల రవీందర్ , బొమ్మనపల్లి అశోక్ రెడ్డి , కొల్లూరి రాజు , కేతిరి లక్ష్మారెడ్డి , కరీంనగర్ కు చెందిన ప్యాట రమేశ్ , మానకొండూరు నియోజవర్గంకు చెందిన బాకారపు శ్రీనివాస్ యాదవ్ లు ఉన్నారు .
కాంగ్రెస్ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జీగా కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ డిప్యూటీ సీఎం . పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర రాజనర్సింహా నియోజక వర్గం ఎన్నికల సమన్వయకర్తలుగా సీనియర్ నాయకులుగా ఉన్న ఎమ్మెల్సీ టీ . జీవన్ రెడ్డి , మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు , మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లకు ఎంపిక బాధ్యతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ అప్పగించ డంతో వీరు చివరకు నాలుగు పేర్లను టీపీసీసీ అధ్యక్షుడి ముందు ఉంచినట్లు తెలిసింది . నేటి భూపాలపల్లి సభలో రేవంత్ చేసే ప్రకటన ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.