Home /News /telangana /

KARIMNAGAR IRON ROD LANDED ON A MAN HEAD IN KARIMNAGAR DISTRICT SNR KNR

Telangana:దవడలోంచి తలపైకి వచ్చిన ఇనుప రాడ్డు..కరీంనగర్‌లో గాయపడ్డ బాధితుడి పరిస్థితి విషమం

(తలలో గుచ్చుకున్న ఇనుపచువ్వ)

(తలలో గుచ్చుకున్న ఇనుపచువ్వ)

OMG:కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో ప్రమాదం జరిగింది. మోరీ నిర్మాణం చేపడుతున్న చోట ఓ వ్యక్తికి ప్రమాదవశాత్తు ఇనుప చువ్వ దవడ భాగంలో గుచ్చుకొని తల భాగం నుంచి బయటకు వచ్చింది. అతికష్టం మీద బాధితుడి తలలో దిగిన రాడ్‌ని బయటకు తీశారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,New18,Karimnagar)
    కరీంనగర్(Karinagar)జిల్లాలో ఒళ్లు గగుర్పొడితే సంఘటన జరిగింది. హుజూరాబాద్(Huzurabad)పట్టణంలో వరంగల్ డిపో క్రాస్ వద్ద నిర్మాణంలో ఉన్న మోరి ఇనుప రాడ్డు(Iron rod)యువకుడి దవడ(Jaw) భాగంలో గుచ్చుకొని తల నుండి బయటికి వచ్చింది. ఘోర ప్రమాదం చూసిన అక్కడే ఉన్న మరికొందరు స్థానికులు, యువకులు దవడ నుంచి తలలోకి పొడుచుకున్న ఇనుపచువ్వను తొలగించడానికి తీవ్రంగా కష్టపడ్డారు.

    తలలో దిగిన ఇనుప చువ్వ..
    బాధితుడి బాధ వర్ణనాతీతంగా ఉండటంతో ప్రయత్నాన్ని నిలిపివేసి ... ఇనుప కట్టర్‌తో రాడ్‌ని తొలగించారు. బాధితుడ్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇనుప రాడ్డు దవడ నుంచి నేరుగా తలలోంచి బయటకు రావడం కారణంగా పరిస్థితి విషమం గా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించడానికి హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు డాక్టర్లు.

    బాధితుడి పరిస్థితి విషమం..
    బాధితుడి దవడలో ఇనుప చువ్వ గుచ్చుకోవడానికి మోరీ నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే కారణమని బాధితుడి తరపు బంధువు మండిపడుతున్నారు. నిర్మాణ పనులు చేపట్టే చోట ఎలాటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం లేదని..ఇష్టానుసారంగా ఇనుప చువ్వలు, పనిముట్లు ఇష్టానుసారంగా పడేయడంతో పాటు పనులు జరుగుతున్న చుట్టూ ఎలాంటి ఫెన్సింగ్ నిర్మించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Injured, Karimnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు