Home /News /telangana /

KARIMNAGAR IPL CRICKET BETTING HAS INCREASED IN JAGITYAL AND CRORES OF RUPEES ARE CHANGING HANDS WITH THE HELP OF HIDDEN APPS KNR PRV

IPL Betting: జోరుగా ఐపీఎల్​ బెట్టింగులు.. ఆ యాప్​లతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్న వైనం..

ప్రతీకాత్మక చిత్రం (source - You tube)

ప్రతీకాత్మక చిత్రం (source - You tube)

ఐపీఎల్ వచ్చేసింది. అమాయకులు సొమ్ముకు ఆశపడి పందేలు కాస్తున్నారు. బెట్టింగ్ మాఫియా వలలో సులువుగా చిక్కుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలవడం నుంచి బాల్ బై బాల్ , ఓవర్ బై ఓవర్ అంటూ తుది విజేత తెలిసే వరకు వివిధ రకాలుగా బెట్టింగ్​లకు దిగుతున్నారు.

ఇంకా చదవండి ...
  (న్యూస్ 18 తెలుగు. కరస్పాండెంట్​. శ్రీనివాస్. పి)

  ఐపీఎల్ (IPL) మ్యాచ్​లను చిన్నా , పెద్దా తేడా లేకుండా అందరూ వీక్షిస్తుంటారు . ఫలితం తేలే వరకు టీవీలు , స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు . ఈ తరుణంలోనే కరీంనగర్​లో బెట్టింగ్ (Cricket Betting) రాయుళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు . అమాయకులు సొమ్ముకు ఆశపడి పందేలు కాస్తున్నారు. బెట్టింగ్ మాఫియా వలలో సులువుగా చిక్కుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలవడం నుంచి బాల్ బై బాల్ , ఓవర్ బై ఓవర్ అంటూ తుది విజేత తెలిసే వరకు వివిధ రకాలుగా బెట్టింగ్​ (IPL Betting)లకు దిగుతున్నారు. దీనికి తోడు సెల్​ఫోన్​లలో అందుబాటులోకి వచ్చిన క్రికెట్ బెట్టింగ్ యాప్స్​ ద్వారా​ మరికొందరు యథేచ్ఛగా జూదాలకు పాల్పడుతున్నారు. సులువైన సంపాదనే లక్ష్యంగా పందేలకు అలవాటు పడి లక్షల రూపాయలు పోగొట్టుకొని చివరకు తమ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు .

  ఐపీఎల్​ మ్యాచ్​లపై పందేల జోరు..

  జగిత్యాల (Jagityal)లో జనం ఐపీఎల్ మ్యచ్‌లను చూసేందుకు ఎగబడుతున్నారు . ప్రజల్లో ఆసక్తిని అనుకూలంగా మలుచుకొని కొన్ని ముఠాలు బెట్టింగ్ కు తెరతీశాయి . మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి నిముషానికి  పందాలు కట్టించుకుంటున్నారు బెట్టింగ్ (Betting) వాళ్ల అట కట్టించేందుకు పోలీసులు శత విధాలా ప్రయత్నిస్తున్నా .. ప్రయోజనం లేకుండా పోతోంది. ముఖ్యంగా యువత బెట్టింగ్‌కు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు . బెట్టింగ్ కు ఫోన్ పే , గూగుల్ పే ద్వారానగదు లావాదేవీలు సాగిస్తుంటారు . వీరికి తోడు అటో డ్రైవర్లు . రోజువారీ కూలి పనులు చేసుకునేవారు సైతం  పందెల మోజులో కొట్టుమిట్టాడుతున్నారు  మార్చి 26 వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచ్​లు మే 22 వరకు కొనసాగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా నిఘా పెట్టినా ఫలితం శూన్యంగా మారుతోంది . పందేల రూపం (IPL Betting)లో రూ.కోట్లు చేతులు మారుతున్నా చూస్తూ ఉండక తప్పని పరిస్థితి నెలకొంది .

   హిడెన్ యాప్ కీలకం ప్రస్తుతం..

  స్మార్ట్ ఫోన్లలో క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయి . వీటిలో రూ .10  వెల నుంచి బెట్టింగ్ చేసే వెసులుబాటు ఉంది . ఇవి చాలా వరకు హిడెన్ మోడ్‌లోనే (Hidden Apps) ఉంటాయి . పోలీసులు తనిఖీ చేసినా ఈ యాప్‌లు కనిపించవు . ఒకప్పుడు పెద్ద నగరాలకు మాత్రమే బెట్టింగ్ (IPL Betting)  విధానం ఉండేది. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని అన్ని ప్రాంతాలకు విస్తరించింది .

  కర్ణాటక ముఠాలు వచ్చి..

  కర్ణాటకలోని శ్రీనివాసపుర . ముళబాగల్ . నంగళి , కోలార్ , కేజీఎఫ్ , హోసకోట్లకు చెందిన కొన్ని బెట్టింగ్ గ్యాంగుల హవాలే జిల్లాలో నడుస్తోంది . వీరు కేవలం స్మార్ట్ఫోన్ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నట్టు సమాచారం . మ్యాచ్‌కు ముందు బెట్టింగ్ (IPL Betting) రేట్ నిర్ణయించి ఆన్లైన్లో ఆన్లైన్ సామ్మ జమచేయించుకుంటారు అనంతరం గెలిచిన వారికి డబ్బు చెల్లిస్తారు . ఇందులో 10 నుంచి 15 శాతం కమీషన్లు వసూలు చేస్తుంటారు .అలాంటి ఒక గ్యాంగ్ జగిత్యాల జిళ్లకు వచ్చి బెట్టింగ్ నిర్వహిస్తూ ఉండడం విశేషం.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Betting, Cricket betting, IPL 2022, Jagityal, Karimangar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు