Huzurabad: జోరందుకున్న బెట్టింగ్ లు.. ఈటల వైపు రూ.10 లక్షల పందెం.. ఎగబడుతున్న బుకీలు..

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad By Elections: హుజురాబాద్ లో ఈటలనే గెలుస్తాడు ..లేదు. లేదు .. గెల్లు శ్రీనే గెలుస్తాడు . బీజేపీనే గెలుస్తుంది, లేదంటే లేదు .. టీఆర్ఎసే గెలుస్తది . ఈటలకు ఇంత మెజార్టీ వస్తుందని ఒకరు , లేదు టీఆర్ఎస్కే భారీ మెజార్టీ వస్తుందని మరొకరు . ఇలా ప్రతీ విషయంపైనా బెట్టింగ్లు ఊపందుకున్నాయి.

  • Share this:
    (P.Srinivas,News18,Karimnagar)

    హుజురాబాద్(Huzurabad) లో ఈటల(Etala)నే గెలుస్తాడు ..లేదు. లేదు .. గెల్లు శ్రీనే గెలుస్తాడు . బీజేపీనే గెలుస్తుంది, లేదంటే లేదు .. టీఆర్ఎసే గెలుస్తది . ఈటలకు ఇంత మెజార్టీ వస్తుందని ఒకరు , లేదు టీఆర్ఎస్కే(TRS) భారీ మెజార్టీ వస్తుందని మరొకరు . ఇలా ప్రతీ విషయంపైనా బెట్టింగ్లు ఊపందుకున్నాయి . రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికలు(Huzurabad By Elections) బెట్టింగ్లకు వేదికగా మారింది . ఐదు నెలలుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న ప్రచారంలో చివరికి గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ .. బెట్టింగ్ రాజాలు మాత్రం ఫుల్ బిజీ అయిపోయారు . మరో 13 రోజుల్లో పోలింగ్ ప్రక్రియ ముగియనున్న తరుణంలో రంగంలోకి దిగిన బుకీలు బెట్టింగ్లకు శ్రీకారం చుట్టారు .

    Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..


    రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ బెట్టింగ్ తంతు హుజురాబాద్ ఎన్నికల తంతును మించిపోతోందన్న ప్రచారం సాగుతోంది . గెలిస్తే అంత .. ఓడితే ఇంతే .. బెట్టింగ్ వలలు విసురుతున్న వలలో చాలా మందే చిక్కుకుంటున్నట్టుగా తెలుస్తోంది . బెట్టింగ్ వేసే వ్యక్తి చెప్పినట్టుగా ఆ అభ్యర్థి గెలిస్తే అతను పెట్టిన బెట్టింగ్కు ఐదు రెట్లు ఇస్తామని బూకీలు చెబుతున్నారు . కానీ , ఓడిపోతే మాత్రం బెట్టింగ్ లో పాల్గొన్న వ్యక్తి ఇచ్చిన డబ్బులు నిర్వాహకులే తీసుకుంటారు . కొంత మంది అయితే 10 రెట్లు కూడా ఇచ్చేందుకు వెనకాడకుండా ఛాలెంజ్ చేసుకుంటున్నారు .

    TRS Party Meeting: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ముగిసిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం..


    చివరకు గెలిచే అభ్యర్థుల మెజార్టీపై కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయని తెలుస్తోంది . ఈ ఎలక్షన్ లో బీజేపీ , టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉన్న కారణంగా .. కమలం , కారు మధ్యే ఎక్కువగా బెట్టింగ్ జోరు సాగుతున్నట్టు సమాచారం . రూ . 10 వేల నుండి రూ . 10 లక్షల వరకూ బెట్టింగ్ దందా సాగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది . తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న బెట్టింగ్లు తారస్థాయికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది .

    ఉప ఎన్నికలో అనూహ్యంగా కాంగ్రెస్ కు ప్లస్ చేకూరింది.. ఈ సారి జాగ్రత్త పడకపోతే వారు ఓడిపోవడం పక్కా..! ఎందుకంటే..


    రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు బెట్టింగ్ దందాలో మునిగి తేలుతున్నట్టు సమాచారం . పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ బెట్టింగ్ ల తీరు మారిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే సర్వేలన్నీ బిజెపి వైపు ఉండడంతో బెట్టింగ్ లు కూడా ఈటెల వైపు ఎక్కువ పెడుతున్నట్లు సమాచారం.. కొద్ది రోజుల్లో ప్రచారం ముగియడంతో ఇప్పటి నుండే బెట్టింగులు జోరందుకున్నాయని తెలుస్తుంది.
    Published by:Veera Babu
    First published: