హోమ్ /వార్తలు /తెలంగాణ /

‘‘ఓట్లు కొనే అడ్డగాడిదలను దయచేసి అసెంబ్లీకి పంపకండి.. పిల్లల భవిష్యత్తును ఉరితీయకండి’’.. అంటూ..

‘‘ఓట్లు కొనే అడ్డగాడిదలను దయచేసి అసెంబ్లీకి పంపకండి.. పిల్లల భవిష్యత్తును ఉరితీయకండి’’.. అంటూ..

ప్రచారం నిర్వహిస్తున్న స్వంతత్య్ర అభ్యర్థి

ప్రచారం నిర్వహిస్తున్న స్వంతత్య్ర అభ్యర్థి

హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా కోట శ్యామ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అతడు తన ప్రచారంలో భాగంగా గాడిద వేషధారణలో విచిత్రంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నాడు. ‘‘ఓట్లు కొనే అడ్డ గాడిద లను దయచేసి అసెంబ్లీకి పంపకండి.. మీ పిల్లల భవిష్యత్తును ఉరితీయకండి..’’ అంటూ నినదిస్తూ.. గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నాడు.

ఇంకా చదవండి ...

(P.Srinivas,News18,Karimnagar)

హుజురాబాద్ (Huzurabad) ఉప ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా కోట శ్యామ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అతడు తన ప్రచారంలో భాగంగా గాడిద వేషధారణలో విచిత్రంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నాడు. ‘‘ఓట్లు కొనే అడ్డ గాడిద లను దయచేసి అసెంబ్లీకి పంపకండి.. మీ పిల్లల భవిష్యత్తును ఉరితీయకండి..’’ అంటూ నినదిస్తూ.. గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా ఓటు యొక్క గొప్పతనాన్ని గడపగడపకు వెళ్లి తెలియజేస్తూ.. ఎర్రమందుకు, పచ్చనోటుకి, బీరు బిర్యానికి ఓటు అమ్ముకోకుండా ప్రజలకు అవగాహన కలిపిస్తున్నాడు స్వాతంత్ర అభ్యర్థి కొట శ్యాం కుమార్.

Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..


అతడి కుటుంబ నేపథ్యానికి వస్తే.. కరీంనగర్ (Karimnagar) జిల్లాకు చెందిన అతడు.. డిప్లమా ఇన్ అనిమేషన్ చేసి.. ఇంటీరియర్స్ డిసైనర్ గా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. సామాజిక కార్యకర్తగా ఎన్నో ప్రోగ్రాంలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్నాడు. ప్రతీ సమస్య పై న్యాయం కోసం పోరాడుతున్నాడు. 2018 సంవత్సరంలో అతడు కరీంనగర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేశాడు. అప్పడు అతడి గుర్తు బ్యాట్. వచ్చిన ఓట్లు 350 ఓట్లు.

2019 కరీంనగర్ ఎంపీ ఎలక్షన్స్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. అప్పటి అతడి గుర్తు.. క్రికెట్ బ్యాట్స్ మెన్. వచ్చిన ఓట్లు 1450 ఓట్లు. 2020లో దుబ్బాక ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో స్వతంత్ర అభ్యర్థిగా నిలుచొని ట్రాక్టర్ గుర్తుపై 1500 ఓట్లు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు హుజరాబాద్ లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. ఇప్పుడు అతడికి అతడికి కేటాయించిన గుర్తు బ్యాట్ అని అతడు తెలిపాడు. అతడి ప్రచారంలో భాగంగా.. నిరుద్యోగ, నిర్మూలన తన బాధ్యత అని.. మహిళా రక్షణే ధ్యేయంగా ఉన్నత విద్య , వైద్యం నూతన ఎజెండాగా తన ప్రచారంలో భాగంగా చెప్పుకొచ్చాడు.

Huzurabad By Elections: షాకిస్తున్న సర్వేలు.. అనూహ్యంగా మారుతున్న సమీకరణాలు.. ఆ అభ్యర్థికి ఓటమి తప్పదా..?


ప్రతి ఇంటా ఆరోగ్యం , ఆనందం

మార్పు కోసం ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ తన ప్రచారం సాగిస్తున్నాడు. 75 సం॥రాల స్వాతంత్ర దేశంలో అహింస , సత్యం , ధర్మం , న్యాయం , మంచితనం ఇవన్నీ కనుమరుగు అవుతున్నాయి . ఎక్కడ చూసిన స్వార్థం రాజ్యాన్ని ఏలుతుంది . దీనికి కారణం మనం కాదా ? 75 సం॥రాల స్వాతంత్య్ర దేశంలో కుంభకోణాలు , కుల్లు కుతంత్రాలు , హింసలు , హత్యలు , ఆత్మహత్యలు , కల్తీ ఆహారాలు చివరికి కల్తీ మనుషులు ... ఇలా మారటానికి కారణం మనం కాదా.. ? ఎటు వెళుతుంది సమాజం .. ఎటువైపు పోతుంది మానవ ప్రయాణం అంటూ ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యం , ఆనందం ప్రతి ఇంటిలో దూరమై పోయింది .


ట్యాబ్లెట్స్ లేనిదే రోజు గడవలేని పరిస్థితి వచ్చిందంటున్నాడు. అంతటా కల్తీ , అన్నింటా కల్తీ ఆడపిల్లలకు రక్షణ లేదన్నారు. ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలే వెలుగు చేస్తున్నాయన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా ఇటువంటి ఘటనలు ఎందుకు ఆగడం లేదంటూ ప్రశ్నించాడు. ఇక యువత విషయానికి వస్తే.. యువతకు భవిష్యత్తు లేదు.. చదివే చదువుకి.. చేసే జాబ్ కి సంబంధం లేదన్నారు. కల్తీ మందులు , కల్తీ విత్తనాల వల్ల పండించే పంటకు గ్యారంటీ లేదు . రైతుల బతుకులకు భరోసా లేదన్నారు. వచ్చే బడ్జెట్ కు.. ఖర్చులకు పొంతన లేకుండా పోయిందన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారం చేతిలో ఉన్నా ఇంత వరకు అభివృద్ధి చేయలేదంటూ ఈటల రాజేందర్ పై పరోక్షంగా మండిపడ్డాడు. నియోజకవర్గంలోని ప్రజలు పడుతున్న కష్టాలు ఎన్నటికీ గుర్తుకు రావని.. కాలనీల్లోకి వెళ్లే.. ఆ మురికి గుంటల మధ్య బతుకీడుస్తున్న ప్రజలు వారికి కనపడరు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్ల మీద ఎక్కడి గుంతలు అక్కడే ఉంటాయని.. కేవలం ఎలక్షన్స్ వచ్చిన సందర్భంలోనే ఏదో రకంగా వాటిని పూడ్చే ప్రయత్నం చేస్తారని తర్వాత షరా మామూలే అంటూ అధికారులపై విరుచుకుపడ్డాడు.

Minor Girl: చదువుకునే వయస్సులో ఇదేం దుర్మార్గపు ఆలోచన.. పాపం ఆ బాలిక పరిస్థితి..


వీటిని అన్నింటిని చూస్తూ ఉంటే.. సమస్యలు పరిష్కారం కావంటూ చెప్పుకొచ్చాడు. యువతలో కచ్చితంగా మార్పు రావాలన్నారు. యువత తలుచుకుంటే దేశ రూపురేఖలు మార్చవచ్చునన్నారు. మంచి వాళ్ళు చేతులు కట్టుకొని చూస్తున్నంత కాలం అసమర్థులే దేశాన్ని ఏలుతారనే భావించి స్వామి వివేకానంద కలలు గన్న ఆశయ సిద్ధి కొరకు మన హుజురాబాద్ ప్రజల అందరి తరపున అడుగులు వేస్తూ మార్పు కోసం నిరంతరం పోరాటం చేస్తున్ననాని అన్నాడు.

First published:

Tags: Huzurabad, Huzurabad By-election 2021

ఉత్తమ కథలు