(పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)
తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామానికి చెందిన గోలి సరూప అనే ఓ మహిళ రైతు తనకున్న ఎకరం భూమిలో .. స్వయంగా తానే ఎద్దుల నాగలితో దున్ని విత్తనాలు వేస్తోంది. ఉదయం నుండి సాయంత్రం వరకు రోజుకు ఒక ఎకరం చొప్పున ఎద్దుల నాగలితో విత్తనాలు వేస్తామని ఆమె చెబుతోంది. తాను చిన్ననాటి నుండే తన తల్లితండ్రులకు పొలం పనులు చేస్తూ సహాయపడే దాన్ని అని ఇప్పటికీ కూడా ఎడ్ల తో నాగలి దున్నడం అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది. దున్నడమే కాకుండా వ్యవసాయ పనులు మొత్తం తనకువచ్చని అంటోంది.
అలాగే గ్రామంలో మహిళా సంఘం అధ్యక్షురాలిగా, గ్రామ కో ఆప్షన్ సభ్యులు గా ఉన్నానని చెప్పారు. తమకు ఒక కూతురు ఉందని.. ఆమె డిగ్రీ చదువుతుందన్నారు. తన వ్యవసాయ పనులు పూర్తి అయిన వెంటనే చుట్టుపక్కల రైతులకు కూడా.. వెళ్తాను అని రోజుకు పదహారు వందల చొప్పున కిరాయి వస్తుంది అనే స్వరూప తెలిపారు. మొత్తానికి మగవారి కంటే తాను ఎం తక్కువ కాదని నిరూపిస్తుంది బాలయ్యపల్లి గ్రామానికి చెందిన గోలి సరూప.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Women farmer