హోమ్ /వార్తలు /తెలంగాణ /

Wedding Cancel : కట్నం తీసుకుని పీటల మీద పెళ్లి ఆపాడు .. పెళ్లి కొడుకు హైడ్రామాలో క్లైమాక్స్‌ ఏమైందంటే

Wedding Cancel : కట్నం తీసుకుని పీటల మీద పెళ్లి ఆపాడు .. పెళ్లి కొడుకు హైడ్రామాలో క్లైమాక్స్‌ ఏమైందంటే

marriage cancel

marriage cancel

Wedding Cancel: కాసేపట్లో అమ్మాయి మెడలో మూడు ముళ్లు పడాల్సిన ముహుర్తం. ఎన్నారై సంబంధం కావడంతో పెళ్లి కూతురు తరపు బంధువులు పెద్ద సంఖ్యలో వివాహాన్ని చూడటానికి వచ్చారు. అంతా సాఫీగా జరిగిపోతుందనుకున్న సమయంలో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. పెళ్లి ఆగిపోవడానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలిసి షాక్ అయ్యారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  కాసేపట్లో అమ్మాయి మెడలో మూడు ముళ్లు పడాల్సిన ముహుర్తం. ఎన్నారై(NRI) సంబంధం కావడంతో పెళ్లి కూతురు తరపు బంధువులు పెద్ద సంఖ్యలో వివాహాన్ని చూడటానికి వచ్చారు. అంతా సాఫీగా జరిగిపోతుందనుకున్న సమయంలో పీటల మీద పెళ్లి(Wedding)ఆగిపోయింది. పెళ్లి ఆగిపోవడానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలిసి పెళ్లి కూతురు ( Bride)తల్లిదండ్రులతో పాటు వివాహాన్ని చూడటానికి వచ్చిన బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పెళ్లి ఎందుకు నిలిచిపోయిందో తెలియక బంధువులు, స్నేహితులు షాక్ అయ్యారు.

  Love marriage : ప్రేమించి పెళ్లిచేసుకొని విడిపోయారు .. 2ఏళ్ల తర్వాత రెండోసారి పెళ్లి.. గ్యాప్‌లో ఏం జరిగిందంటే  పీటల మీద పెళ్లి రద్దు..

  అచ్చం సినిమాల్లో తలపించే ఓ సన్నివేశం జగిత్యాలలో చోటుచేసుకుంది. ఓ ఎన్నారై పెళ్ళికొడుకు చేసిన నిర్వాకానికి కాసేపట్లో జరగాల్సిన వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. హన్మకొండకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అన్వేష్‌కు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన యువతితో ఇటీవలే పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అన్వేష్ అమెరికా లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండటంతో మంచి సంబంధం కదా అని వధువు తల్లిదండ్రులు  వారం క్రితం జరిగిన ఎంగేజ్మెంట్‌ నిర్వహించారు. 25లక్షల కట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. ఎంగేజ్‌మెంట్‌ సమయంలో 15 లక్షలు అందజేశారు. వారం రోజుల్లోనే పెళ్లి ముహుర్తం పెట్టుకుందామని అన్వేష్ చెప్పడంతో అమ్మాయి తల్లిదండ్రులు ముహుర్తం ఫిక్స్ చేశారు.

  సినిమా స్టైల్లో బ్రేక్ చేసిన వరుడు..

  ఈ నెల 21 ఆదివారం రోజున పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో పెళ్లి చేసేందుకు పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు పెళ్లి సమయంలో ఇస్తామన్న కట్నంలోని మిగిలిన 10లక్షలను కూడా సిద్దంగా ఉంచారు పెళ్లి కూతురు తల్లిదండ్రులు. మరికాసేపట్లో పెళ్లి కూతురు మండపంలోకి అఢుగుపెట్టక ముందే పెళ్లి కొడుకు పెద్ద బాంబు పేల్చాడు. మండపానికి చేరుకున్న అన్వేష్ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని హైడ్రామా ఆడాడు. తాను బాత్ రూంలో కాలు జారి పడ్డానని ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరడంతో  బంధువులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు.

  Telangana : లక్షలు కమీషన్ ఇస్తేనే అక్కడ ఉద్యోగం .. పని చేసిన తర్వాత జీతం రాదు .. జాబ్ గ్యారెంటీ లేదు  తన్నబోయిన వధువు బంధువులు..

  తర్వాత కూడా తనకు ఆనారోగ్యంగా ఉందని మరో ఆస్పత్రి లో చేరాడు. దీంతో అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఏలాంటి ఆనారోగ్య సమస్య లేదని చెప్పి పంపించారు.ఇలా సుమారు ఐదు గంటల పాటు పెళ్లి కొడుకు హైడ్రామా నడిపాడు. ఇదంతా చూసిన పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు నిలదీయడంతో తీరా ఈ పెళ్లి ఇష్టం లేదంటూ బాంబ్ పేల్చాడు. దీంతో పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు దాడికి యత్నించడంతో బంధువులు అడ్డుకున్నారు. ఇరువర్గాల పెద్దలు మాట్లాడి సమస్య పరిష్కరించుకుందామని అనడంతో పెళ్లి ఆగిపోయింది. ఊహించని ఈ పరిణామంతో పెళ్లికి వచ్చిన బంధువులకు అసలు ఏం జరుగుతుందో అర్ధం కాకా అయోమయంలో పడ్డారు. జగిత్యాలలో జరిగినట్లుగానే గతంలో కూడా ఆదిలాబాద్‌లో పెళ్లి కొడుకు యువతి మెడలో తాళి కట్టే సమయానికి ప్రియుడు ఎంట్రీ ఇవ్వడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimnagar, Telangana News, Wedding

  ఉత్తమ కథలు