Huzurabad By Election: హుజూరాబాద్ లో పోటీకి ఈటల జమున.. ఈటలకు కేంద్ర మంత్రి పదవి..?

ప్రచారంలో భాగంగా ఈటల జమునకు స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు

Huzurabad By Election: త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఇప్పటినుంచే పలు పార్టీ నాయకులు జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమునను బరిలో నిలిపే అవకాశాలు ఉన్నాయని.. ఈటలకు కేంద్రంలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ఈటల వర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

 • Share this:
  (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

  హుజూరాబాద్ లో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఈటెల జమున అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది . ఈటల ఎపిసోడ్ జరిగిన మొదట్లో ఇక్కడి నుండి కెప్టెన్ లక్ష్మీకాంతరావు సతీమణి సరోజనమ్మ పోటీ చేస్తారని టీఆరెఎస్ వర్గాల్లో చర్చ జరిగింది . ఒకవేళ అదే నిజమైతే ఈటలకు బదులుగా జమునా రెడ్డిని బరిలో నిలిపే అవకాశాలు కూడా లేకపోలేదన్న వాదనలు వినిపించాయి . మరోవైపు ఇటీవలె బీజేపీలో చేరిన ఈటలకు వేరే పదవిని కట్టబెట్టారన్న ప్రచారం ఈటల వర్గంలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో జమునను పోటీ చేయిస్తారని అంటున్నారు. ఈటల వ్యూహంలో భాగంగానే జమునా రెడ్డి పోటీ చేసేందుకు సమాయత్తం చేస్తున్న సంకేతాలు పంపిస్తున్నారన్న కామెంట్స్ చేస్తున్నారు కొందరు . అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ చాలా మంది పేర్లను తెరపైకి తీసుకొచ్చింది . ఇంకా కసరత్తులు చేస్తూనే ఉంది . ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీ నాయకులను తికమక లో పడేసే స్కెచ్ ఈటల వేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  ఉద్యమ ప్రస్థానం నుండి కేసీఆర్ వెన్నంటి నడిచిన ఈటలకు ఆయన ఎత్తులు , పై ఎత్తులపై పట్టు ఉండటంతో అందుకు తగ్గ ప్లాన్ తోనే ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది . ఎన్నికల వాతావరణానికి ముందు బలంగా ఉన్న అభ్యర్థులను కూడా వీక్ చేసి టీఆర్ ఎస్ అభ్యర్థి గెలిచేందుకు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ వేస్తుంటారు . ఎత్తుగడలను తిప్పికొట్టడంలో భాగంగానే ఈటల తన భార్యను రంగంలోకి దింపి తనపై ఉన్న సానుభూతిని , ఓటు బ్యాంకును డైవర్ట్ కాకుండా చూసుకుంటున్నారని కూడా అంటున్నారు .

  ఏది ఏమైనా ఈటల జమునా రెడ్డి డైరెక్ట్ ఎంట్రీతో మైండ్ గేమ్ స్టార్టయిందా లేక ఆమె క్యాండిడేట్ కాబోతున్నారా అన్నదే ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ . దీనికి తోడుగా గత 3రోజుల నుండీ ఈటెల జమున నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రచారం చేస్తుండడం కూడా తాను పోటీ చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
  Published by:Veera Babu
  First published: