Huzurabad By Elections: అతడి వైపే మొగ్గుచూపుతున్న బెట్టింగ్ రాజాలు.. 20 వేల మెజారిటీ పక్కా అంటూ..

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad By Elections: నా పందెం పది వేలు .. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు గెలుస్తాడు లక్ష రూపాయలు బెట్ ! రాజేందర్ కు 20 వేల మెజార్టీ వస్తుంది .. పందెం రెండు లక్షలు .. " ఐదు వేల ఓట్లతో శ్రీనివాస్ గెలుస్తాడు ఐదు లక్షల బెట్ . ఇది ప్రస్తుతం హుజురాబాద్ లో జరుగుతున్న తంతు.

 • Share this:
  (P.Srinivas,News18,Karimnagar)

  నా పందెం పది వేలు .. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు గెలుస్తాడు లక్ష రూపాయలు బెట్ ! రాజేందర్ (Rajender) కు 20 వేల మెజార్టీ వస్తుంది .. పందెం రెండు లక్షలు .. " ఐదు వేల ఓట్లతో శ్రీనివాస్ (Gullu Srinivas) గెలుస్తాడు ఐదు లక్షల బెట్ . నాలుగు రోజుల క్రితం వరకు ఒకవైపే ఉన్న బెట్టింగ్ .. ఇప్పుడు రెండు ప్రధాన పార్టీల మధ్యకు చేరింది. టీఆర్ఎస్ , బీజేపీ అభ్యర్థుల గెలుపుపై మొన్నటిదాకా రూ . 100 , రూ . 200 కోట్ల వరకు సాగిన పందాల దందా రూ .1000 కోట్లకు ఎగబాకిందని తెలుస్తున్నది . ఈటల రాజేందరే గెలుస్తాడనే దానిపైనే ఎక్కువ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం. రూపాయికి .. వెయ్యి రూపాయలు అనే స్థాయిలో పందాలు నడుస్తున్నాయి. దీంతో ఇక్కడ రూ. వెయ్యి నుంచి మొదలైన బెట్టింగ్ .. రూ. కోట్లకు చేరుతోంది . అభ్యర్థుల మెజార్టీ , పార్టీల వారీగా వచ్చే ఓట్లపై సైతం బెట్టింగ్ కాస్తున్నారు.

  Uses Of Ladyfinger: బెండకాయ వంటలకే కాదు.. ఔషద పరంగా కూడా ఎంతో ఉపయోగకరం.. ఏ వ్యాధులకు ఉపయోగిస్తారంటే..


  బీజేపీ అభ్యర్థి గెలుపు , టీఆర్ఎస్ గెలుపుతోపాటు మెజార్టీ ఎంత ? అనే అంచనాపైనా పందాలు కాస్తున్నారు . ఈటల రాజేందర్కు 20 వేల మెజార్టీపై రూ . 100 కు పదింతలు అనే స్థాయిలో ఉంటే .. గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని , కనీసం వెయ్యి నుంచి ఐదు వేల ఓట్ల మెజార్టీ వస్తుందని రూ . 1000 కి నాలుగింతలు అని బెట్టింగ్ పెడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎంత శాతం మిగతాకోణంలో కూడా పందెం వేసుకుంటున్నారు .

  తెలంగాణ రాజకీయాల్లోనే అత్యంత ఖరీదైనదిగా హుజూరాబాద్ ఉప ఎన్నిక మారింది. దీనికి తోడు ఇప్పుడు బెట్టింగ్ రగడ మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల వేళ రాజకీయం ఉత్కంఠగా మారింది . ఏపీలోని బద్వేల్ లోనూ బై ఎలక్షన్ జరుగుతున్నది . అక్కడ పోటీ కేవలం వైసీపీ , బీజేపీ మధ్యనే ఉండటం , బరిలో టీడీపీ , జనసేన లేకపోవడం గమనార్హం .

  PMJDY: జన్ ధన్ ఖాతా ఉన్నవాళ్లకు శుభవార్త.. ఇలా చేస్తే రూ. 2.30 లక్షలు సొంతం చేసుకోవచ్చు.. వివరాలివే..


  దీంతో వైసీపీ కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండటంతో బెట్టింగ్ బంగార్రాజుల దృష్టి అటువైపు పడలేదు. నువ్వా నేనా .. అన్న రీతిలో సాగుతున్న హుజూరాబాద్లోనే థ్రిల్ ఉంటుందనుకొని , నాలుగు రాళ్లు సంపాదించుకోచ్చని భావించినట్టు తెలుస్తున్నది . బెట్టింగ్ అంటే ముందుండే ఏపీ నేతలు , వ్యాపారులతోపాటు కర్ణాటక , మహారాష్ట్రకు చెందిన వారు బెట్టింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నారని సమాచారం. ఏది ఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక బెట్టింగ్ దందాలో ఎవరి పంట పండిస్తుందో .. ఎవరిని నష్టాల పాలు చేస్తుందో నవంబర్ రెండవ తేదీన తేలనుందని చెప్పుకుంటున్నారు.

  Lucky Chance: ఈ రూపాయి కాయిన్ మీ దగ్గర ఉందా.. మీ పంట పండినట్లే.. కోటీశ్వరులు అయ్యేందుకు అవకాశం..!


  ఇదీ హుజూరాబాద్(Huzurabad) ఎన్నికలో గెలుపోటములపై సాగుతున్న బెట్టింగ్ దందా తీరు. ఐపీఎల్ ను మరిపించేలా దాదాపు రూ. వెయ్యికోట్ల చేతులు మారనున్నాయి. ఆంధ్రాప్రాంతానికికి చెందిన పలువురు బెట్టింగ్ రాయుళ్లు వరంగల్, కరీంనగర్ లోని హోటళ్లు , రిస్టార్టుల్లో తిష్టవేసి ఓటరు నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ అంచనాకు వచ్చి బెట్టింగులకు దిగుతున్నారు. గెలుపు , ఓటమి అనే కాకుండా మెజార్టీ ఎంత ? అనే అంశాలపైనా పందాలు కాస్తున్నారు.

  దీనికి తోడు కొందరు బుకీలు ఆన్లైన్లోనూ తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. మహారాష్ట్ర , కర్ణాటకకు చెందిన వారూ హుజూరాబాద్ ఎన్నికపై ఆసక్తిని చూపుతున్నారు . వాళ్లూ బెట్టింగ్లకు దిగుతున్నారు. బుధవారంతో ప్రచారం ముగియనుండటంతో బెట్టింగ్ బంగార్రాజులు మరింతగా రెచ్చిపోతున్నారు.
  Published by:Veera Babu
  First published: