KARIMNAGAR HYDERABAD THREE OLD BOY ABHIJIT HAS PLACE IN THE INDIA BOOK OF RECORDS SNR KNR
Wonder Kid: బుడ్డోడు కాదు బ్రెయిన్ ఉన్నోడు..మూడేళ్ల ఏజ్‌లోనే మాస్టర్ డిగ్రీ మెమరీ
(మూడేళ్లకే మాస్టర్ బ్రెయిన్)
Wonder Kid:వాడు బుడ్డొడే కాని..అతడి బ్రెయిన్ మాత్రం మాములుగా లేదు భయ్యా. నోట్లోంచి మాటలు కూడా సరిగా రాని వయసులో వండర్ కిడ్ అనిపించుకుంటున్నాడు. ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. ఆ పిల్లాడిలో ఉన్న ఎక్స్ట్రా టాలెంట్ ఏంటో తెలుసా.
(P.Srinivas,New18,Karimnagar)
మూడేళ్ల వయసు కలిగిన పిల్లల్ని మీ అమ్మ,నాన్న పేరు ఏంటి అని అడిగితేనే టక్కున చెప్పలేరు. అలాంటిది ఆడుకునే బొమ్మలు వాటిపై ఉండే గుర్తుల ఆధారంగా అద్భుతమైన మేధాశక్తిని, జనరల్ నాలెడ్జ్(General Knowledge)ని సంపాధించాడు ఓ బాలుడు. కరీంనగర్(Karimnagar)జిల్లా దేశరాజుపల్లిDesharajupalli గ్రామానికి చెందిన కోల ప్రేమ్‌సాగర్(Kola Premsagar), మౌనిక(Maunika)దంపతుల బిడ్డే వండర్ కిడ్ అభిజిత్Abhijit. స్వస్థలం కరీంనగర్ జిల్లా అయినప్పటికి ఉద్యోగరిత్య ప్రేమ్‌సాగర్ హైదరాబాద్(Hyderabad)లో సెటిలయ్యాడు. అనే మూడేళ్ల బాలుడు ఆడుకోవడానికి తల్లిదండ్రులు కారు బొమ్మల్ని కొనిచ్చేవాళ్లు. బొమ్మకార్లపై సాధారణంగా ఉండే కారు కంపెనీల పేర్లను గుర్తు పెట్టుకోవడం నేర్చుకున్నాడు అభిజిత్. మొదట్లో సాధారణంగా భావించిన బాబు పేరెంట్స్ ఆ తర్వాత అతడిలోని ఆసక్తిని గమనించి ఓ డిఫరెంట్ ఫీట్‌కి ప్రిపేర్ చేశారు. కార్ల కంపెనీల లోగోలు (Logos)చూపిస్తే చాలు ఆ కంపెనీ పేరు(Company names)చెప్పే విధంగా అతనిలోని నాలెడ్జ్‌ని పెంచారు. ఈ విధంగా లోగోలను చూసి కార్ల పేర్లు చేప్పేయడంలో ఆరితేరిపోయాడు అభిజిత్. మూడేళ్ల వయసులో సుమారు 110 కంపెనీల వరకు లోగోలను చూసి కంపెనీల పేర్లను అది కూడా రికార్డు సమయంలో చెప్పే వరకూ వెళ్ళాడు. అభిజిత్ చెప్పే కార్ల పేర్లు ఇండియాIndiaలో తయరయ్యేవే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరున్న జర్మనీ(Germany)జపాన్( Japan), అమెరికా(America)లో తయారయే హై ఎండ్ మోడల్ కార్ల కంపెనీలు కూడా టక్కున చెప్పేస్తున్నాడు. ఇలాంటి ఫీట్‌ని అతి చిన్న వయసులోనే సాధించడం చూస్తున్న అభిజిత్ పేరెంట్స్ గర్వపడుతున్నారు. అంతే ఈ బుడ్డోడి బ్రేన్ షార్ప్నెస్కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్(India Book of Records)లో చోటు దక్కించుకున్నాడంటే ఎంత వండర్ కిడ్డో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
వండర్ కిడ్..
పిల్లాడిలోని ఔత్సాహికతను గుర్తించే ప్రోత్సహిస్తున్నామంటున్నారు అభిజిత్ తల్లి మౌనిక. మొదట్లో ఆడుకోవడానికి బొమ్మలు కొనిపించే వాళ్లమని తాము షాపింగ్ చేసే సమయంలోనూ తను కార్ల బొమ్మలనే ఎక్కువగా అడిగే వాడని ... అందుకే తాము కూడా అతని ఆసక్తిని గమనించి ఎంకరేజ్ చేశామని ఆమె అంటున్నారు. నోట్లోంటి మాటలు కూడా సరిగా రాని వయసులో ఉన్న అభిజిత్ ఇలా కార్లు పేర్లు చెప్పడమే కాదు...పాటలు కూడా అద్భుతంగా పాడుతాడు, డ్యాన్స్ చేస్తాడు తెలుసా.
వాటే మెమరీ..
చిన్న తనంలోనే అభిజిత్లోని మల్టీ టాలెంట్ స్కిల్‌ని గుర్తించిన తల్లిదండ్రులు అతడితో రకరకాల యాక్టింగ్ స్కిల్స్‌ని చేయిస్తున్నారు పేరెంట్స్. డాన్స్, మ్యూజిక్ కూడా నేర్పిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడే ఇంత మెమరీ పవర్ ప్రదర్శిస్తున్న తమ బిడ్డ భవిష్యత్తులో సైంటిస్ట్ కావాలని ఆశపడుతున్నామని అభిజిత్ తల్లి మౌనిక చెబుతోంది. పసి ప్రాయంలోనే వండర్స్ క్రియేట్ చేస్తున్న అభిజిత్ ఫ్యూచర్లో కూడా మరిన్ని వండర్స్ క్రియేట్ చేయాలని..ఎన్నో రికార్డ్స్ దక్కించుకోవాలని ఆశిద్దాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.