Home /News /telangana /

Huzurabad : కేసీఆర్ ఓడితే ఈ అభ్యర్థే కారకుడవుతాడా? -ప్రచారం చేయకుండానే ఓట్లు -రాష్ట్రపతి రేసులోనూ..

Huzurabad : కేసీఆర్ ఓడితే ఈ అభ్యర్థే కారకుడవుతాడా? -ప్రచారం చేయకుండానే ఓట్లు -రాష్ట్రపతి రేసులోనూ..

హుజూరాబాద్ అభ్యర్థి శ్రీకాంత్

హుజూరాబాద్ అభ్యర్థి శ్రీకాంత్

కేసీఆర్ ప్రతిష్టకు ముడిపడిందిగా భావిస్తోన్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో.. కారు గుర్తును పోలిన చపాతీరోలర్ గుర్తును సాధించుకుని ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ హాట్ టాపిక్ గా నిలిచాడు. దుబ్బాక సీన్ ఇక్కడా రిపీటైతే టీఆర్ఎస్ ఓటమికి శ్రీకాంతే కారణమవుతాడు. గడిచిన 3ఏళ్లలో ఆరు ఎన్నికల్లో పోటీ చేసిన అతను ప్రచారం చేయకుండానే ఓట్లు సాధిస్తున్నాడు. 2022లో రాష్ట్రపతి ఎన్నికల బరిలోనూ నిలబడతానంటున్నాడు..

ఇంకా చదవండి ...
(P.Srinivas,News18,Karimnagar)
తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా భావిస్తోన్న హుజూరాబాద్ ఉప ఎన్నిక (Huzurabad by election) టీఆర్ఎస్ పాలిట ఇబ్బందికర అభ్యర్థిగా ఉన్నాడు సిలివేరు శ్రీకాంత్. కాcm kcrరు గుర్తును పోలిన ఏ గుర్తు వల్లయితే టీఆర్ఎస్ దుబ్బాకలో ఓడిందో.. అదే రోలింగ్ పిన్ గుర్తును సాధించుకున్న ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆరు ఎన్నికల్లో పోటీ చేసిన అతను.. వచ్చే ఏడాది జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల బరిలోనూ నిలబడతానంటున్నాడు. ప్రధాన రాజకీయ పార్టీల విధానాలు నచ్చవని చెప్పే శ్రీకాంత్.. తాను పోటీ చేసే ఏ ఎన్నికలోనూ ప్రచారం నిర్వహించకుండానే ఓట్లు పొందుతున్నాడు..

మూడేళ్లలో ఆరు ఎన్నికలు..
జమ్మికుంటకు చెందిన సిలివేరు శ్రీకాంత్ అనే వ్యక్తి హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రధాన పార్టీ అభ్యర్థులకు తలనొప్పిగా మారారు. గతంలో శ్రీకాంత్ 4సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా , ఒకసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి, ప్రచారం లేకుండానే ఓట్లు రాబట్టుకున్నాడీయన. హుజూరాబాద్ ఉప ఎన్నిక అతనికి ఆరోది. 2018లో హుజరాబాద్ అసెంబ్లీ స్థానంలో నామినేషన్ వేసినా చివరి నిమిషంలో తప్పుకున్నాడు. అయితే, 2019లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి 6800 ఓట్లు సాధించాడు. 2019లో హుజూర్ నగర్ ఉప ఎన్నికలో 584 ఓట్లు, 2020లో దుబ్బాక బైపోల్ లో 594 ఓట్లు, ఇటీవలి నాగార్జునసాగర్ ఉపఎన్నికలో 55 ఓట్లు రాబట్టుకున్నాడు. ప్రస్తుతం హుజూరాబాద్ లో ప్రజా ఏక్తా అనే పార్టీ నుంచి బరిలోకి దిగిన అతను ఎన్నికల కమిషన్ తో పోరాడి మరీ టీఆర్ఎస్ కారు గుర్తును పోలిన రోలింగ్ పిన్(రొట్టెల పీట, కర్ర) గుర్తును పొందాడు.

Samantha : కోర్టులో సమంతకు షాక్ -ఆమె లాయర్‌కు జడ్జి క్లాస్ -naga chaitanyaతో విడాకులపై రచ్చతో..


కారు గుండెల్లో కంగారు..
నిజానికి కారును పోలిన గుర్తులను ఫ్రీసింబల్స్ గా స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించరాదని, కారును పోలిన గుర్తుల్ని బ్యాన్ చేయాలని టీఆర్ఎస్ గట్టి పోరాటమే చేసింది. కానీ ఎన్నికల సంఘం మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థనల్ని పట్టించుకోలేదు. దీంతో చూడటానికి కారు గుర్తులా కనిపించే ‘చపాతీ రోలర్ (రోలింగ్ పిన్ )’ గుర్తు శ్రీకాంత్ కు దక్కింది. గత ఏడాది దుబ్బాకలో హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పై బీజేపీ కేవలం వెయ్యి ఓట్ల తేడాతో గెలిచింది. కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ కు (స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజు)కు ఏకంగా 3,570 ఓట్లు పడ్డాయి. కారుకు దగ్గరగా ఉండే లారీ, ఆటో గుర్తులకు కూడా ఓట్లు పడ్డాయి. దీంతో ప్రతిసారి ఐడెంటికల్ గుర్తులపై టీఆర్ఎస్ ఈసీతో పోరాడాల్సి వస్తోంది. కేసీఆర్, ఈటల వ్యక్తిగత పోరుగా భావిస్తోన్న హుజూరాబాద్ లో కారును పోలిన శ్రీకాంత్ (చపాతీ రోలర్ గుర్తు)కు ఎన్ని ఓట్లు పడతాయి? అవి టీఆర్ఎస్ గెలుపోటములను ప్రభావితం చేస్తాయా? అనేది ఉత్కంఠ రేపుతున్నది.

Huzurabad ఉప ఎన్నిక ఫలితం ఇదేనా! -డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా?


రాష్ట్రపతి పదవికి పోటీ..
ప్రధాన రాజకీయ పార్టీల పనితీరును తప్పు పట్టే సిలివేరు శ్రీకాంత్.. తన జెండా ఎజెండా ప్రజలేనని, వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తానని చెబుతాడు. జనానికి కావలసింది బర్లు గొర్లు కాదని, విద్య,వైద్య ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలంటాడు. తెలంగాణలో ఇన్ని సార్లు పోటీ చేసినా ఏ ఒక్కసారీ ప్రచారం నిర్వహించలేదని, అయినా కూడా తనకు ఓట్లు పడుతున్నాయని శ్రీకాంత్ తెలిపాడు. ఏదో ఒక రోజు ఎమ్మెల్యేగా గెలుస్తానంటోన్న అతను.. 2022 లో రాష్ట్రపతి పదవికి కూడా పోటీ చేస్తానని చెప్పాడు.

మీ నగరం నుండి (కరీంనగర్)

తెలంగాణ
కరీంనగర్
తెలంగాణ
కరీంనగర్
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Etela rajender, Huzurabad, Huzurabad By-election 2021

తదుపరి వార్తలు