Home /News /telangana /

KARIMNAGAR HUSBAND STABS WIFE TO DEATH DURING INDEPENDENCE DAY CELEBRATIONS IN KARIMNAGAR SNR KNR

Crime news : జెండా పండుగకు వెళ్లి వస్తున్న భార్య పీక కోసి చంపిన భర్త ... కారణం తెలిస్తే షాక్ అవుతారు

(Karimnagar Murder)

(Karimnagar Murder)

Crime news: 76వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. వేడుకలకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న మహిళను కట్టుకున్న భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. హత్య చేయాడనికి కారణాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India
    (P.Srinivas,New18,Karimnagar)
    76వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ కరీంనగర్(Karimnagar)జిల్లాలో దారుణం జరిగింది. చిగురుమామిడి (Chigurumamidi)మండలం ఇందుర్తి(Indorthi) గ్రామంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని వెళ్తున్న సమయంలో అంగన్‌వాడి(Anganwadi) కేంద్రంలో ఆయాగా పని చేస్తున్న 30సంవత్సరాల శిరీష(Sirisha)ను ఆమె భర్త ప్రవీణ్(Praveen) మెడపై కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓవైపు జాతీయ పతాకం ఆవిష్కరించే సందడిలో అందరూ ఉండగానే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన శిరీష తీవ్రరక్తస్రావం కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది.

    Independence Day 2022 : టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో వాళ్లకు నో టికెట్ .. 15న పుట్టిన పిల్లలకు 12ఏళ్ల వరకు ఉచిత ప్రయాణం



    కిరాతకుడు..
    నిందితుడు ప్రవీణ్, మృతురాలు శిరీష మధ్య గత కొద్దిరోజులుగా మనస్పర్ధలు నెలకొన్నట్లుగా తెలుస్తోంది.భార్యభర్తల మధ్య గొడవల వల్లే ప్రవీణ్ ఇంతటి దారుణానికి పాల్పడినట్లుగా స్థానికులు, గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Karimnagar, Murder, Telangana crime news

    తదుపరి వార్తలు