(పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)
తమ కొడుకు ఇంట్లో నుంచి వెళ్లి రెండు రోజులు అవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువలు వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు. స్థానికుల వేములవాడలో ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు కుబుంబసభ్యులకు సమాచారం అందించి వేములవాడకు బయలుదేరి వెళ్లారు. అక్కడ వాళ్ల కొడుకు పరిస్థితి చూసి షాక్ తిన్నారు. అతడు హిజ్రా వేషంలో ఉండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అతడిని అక్కడ నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా హిజ్రాలు అడ్డుకున్నారు. అడ్డుపడుతున్న హిజ్రాలను అతడి కుటుంబసభ్యులు చితకబాది.. అతడిని వారితో పాటు తీసుకెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
యువకుడిని హిజ్రాగా తయారు చేసేందుకు ప్రయత్నించిన హిజ్రాలకు యువకుడి తల్లిదండ్రులు , స్థానికులు దేహశుద్ధి చేశారు . ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో చోటుచేసుకుంది . వివరాల ప్రకారం .. పెద్దపల్లి జిల్లా ముంజపల్లి గ్రామానికి చెందిన వంగ మహేశ్ అనే యువకుడు గత రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన యువకుడి తల్లిదండ్రులు, బంధువులు , స్నేహితుల ఇళ్లలో ఆరా తీశారు. ఈ క్రమంలో వారు పోలీసులను ఆశ్రయించారు. తమ కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో మహేశ్ వేములవాడలో ఉన్నట్లు తెలియడంతో .. కుటుంబ సభ్యులు గురువారం అక్కడకు చేరుకున్నారు.
ఈ క్రమంలో హిజ్రా వేషంలో ఉన్న మహేశ్ ను చూసి యువకుడి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అనంతరం మహేశను తమ ఇంటికి వెళ్లాలని ప్రయత్నించగా .. హిజ్రాలు అడ్డుపడ్డారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు , స్థానికులు హిజ్రాలను చితకబాదారు. ఆ తర్వాత మహేశ్ ను వారి వెంట తీసుకువెళ్లారు . అయితే , కొద్ది రోజులుగా వేములవాడ ప్రాంతంలో హిజ్రాలు హల్ చల్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా వారి ఆగడాలను అరికట్టాలని ప్రజలు , పోలీసులను కోరుతున్నారు. తమ కొడకును ఈ స్థితికి తీసుకొచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hizra, Karimnagar