హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: బండి భగీరథ్‌ సస్పెన్షన్‌పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు .. ఏమని ఆదేశించిందంటే..

Telangana: బండి భగీరథ్‌ సస్పెన్షన్‌పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు .. ఏమని ఆదేశించిందంటే..

Bandi Bhagirath

Bandi Bhagirath

Bandi Bhagirath: బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తోటి స్టూడెంట్‌ని దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో యూనివర్సిటీ నుంచి సస్పెండ్ అయ్యాడు. తనను ఎలాంటి వివరణ అడగకుండానే సస్పెండ్ చేశారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపించింది. న్యాయస్థానం ఏమని ఆదేశించిందంటే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్‌( Bhagirath )కు తెలంగాణ హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. కాలేజీలో జరిగిన ఓ గొడవ విషయంలో తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్నల్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోరారు. భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై శనివారం(Saturday) విచారణ చేపట్టిన హైకోర్టు బండి భగీరథ్‌పై విధించిన సస్పెన్షన్‌పై స్టే విధించింది. పరీక్షకు రాసేందుకు అనుమతి ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బండి భగీరథను క్లాస్‌లకు కు అనుమతించాలని యూనివర్శిటీ(University)ని ఆదేశించింది.

భగీరథ్‌కు ఊరట..

హైదరాబాద్‌లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతోన్న బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్ కొద్దిరోజుల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్నాడు. కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బండి భగిరథ్‌ దాడి చేసిన వీడియో జనవరిలో వెలుగులోకి వచ్చింది. భగీరథ్ ఓ విద్యార్థిని ర్యాగింగ్ చేస్తూ రౌడీయిజం చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. మహేంద్ర యూనివర్సిటీ అతడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.

సస్పెన్షన్‌పై స్టే విధించిన కోర్టు..

ఇంత సీన్‌ జరిగిన తర్వాత భగీరథ్ చేతిలో దెబ్బలు తిన్న బాధితుడు తర్వాత మరో వీడియో విడుదల చేశాడు. భగీరథ్ స్నేహితుడి చెల్లిని తాను ప్రేమ పేరుతో వేధించానని తప్పు చేశాను కాబట్టే తనను భగిరథ్‌ నిలదీశాడని..అందులో భగీరథ్‌ది ఎలాంటి తప్పులేదని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తాను కాస్త ఎక్కువగా మాటలు తూలనాడానని అందుకు కోపం తెచ్చుకున్న భగీరథ్ తనను కొట్టినట్లు చెప్పాడు. ఆ వీడియోలో భగీరథ్ కొట్టటం నిజమే. కానీ.. తప్పు తనదేనని అన్నాడు. ఆ ఘటన తర్వాత భగీరథ్ తాను కాంప్రమైజ్ అయ్యామని వెల్లడించారు. తామిద్దరం ఒకే బ్యాచ్ వాళ్లమని.. ముందు నుంచి స్నేహితులమేనని తనపై దాడి చేసిన ఘటనను పూర్తిగా మర్చిపోయామని చెప్పాడు. గతంలో జరిగిన వీడియోను ఇప్పడు వైరల్ చేయటం అనవసరమని అన్నాడు. కొందరు కావాలనే..వీడియోను వైరల్ చేస్తున్నారని భగీరథ్ చేతిలో దెబ్బలు తిన్న సదరు విద్యార్థి చెప్పుకొచ్చాడు.

Telangana: లంబాడీలు ధరించే న‌గ‌లు తయారు చేసే కుటీర ప‌రిశ్ర‌మ ఎక్క‌డుందో తెలుసా..?   

కాలేజీలో దాడి కేసు..

రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఈ ఘటనపై బండి సంజయ్ కూడా స్పందించారు. తన కుమారుడి భవిష్యత్తు నాశనం చేయటానికి క్రిమినల్ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగటం సరైంది కాదని అన్నారు. కాలేజీ యాజమాన్యం కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని అన్నారు. తన కుమారుడి జీవితం నాశనం చేయాలని చూస్తున్న కేసీఆర్ పాపం పండుతుందని సంజయ్ మండిపడ్డారు. బండి భగిరథ్‌పై నమోదు చేసిన కేసు దర్యాప్తులో ఉండగానే కాలేజీ నుంచి సస్పెండ్‌ అయ్యాడు. దానిపైనే న్యాయం చేయమని హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు బండి భగీరథ్‌కు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.

First published:

Tags: Bandi sanjay, Karimnagar, Telangana News

ఉత్తమ కథలు