(P.Srinivas,New18,Karimnagar)
కరీంనగర్(Karimnagar)ఉమ్మడి జిల్లాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు , వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగు పారడంతో జలపాతాలు ఉప్పొంగాయి. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నీ జలాశయాలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్(Lower Maneru Dam)నీటి మట్టం పెరగడంతో డ్యామ్ గేట్లు అన్ని ఎత్తివేయడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రాజెక్టు(Project)లోంచి ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పాల నురగలాంటి జలకళను చూసేందుకు కరీంనగర్‌లోని పిల్లలు, పెద్దలు కుటుంబ సభ్యులతో కలిసి డ్యామ్‌ని సందర్శించడానికి వస్తున్నారు.
జలదృశ్యం..
మానేరు డ్యామ్ దగ్గర జలపరవళ్లు తొక్కుతున్న దృశ్యాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. సెల్ఫీలు దిగుతూ ప్రకృతి ఒడిలో ఒదిగిపోతున్నారు. నగరానికి ఆనుకుని ఉన్న దిగువ మానేరు జలాశయానికి పైనున్న మోయతుమ్మెద వాగు , శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి వరద ఉద్ధృతి అధికంగా వస్తుండటంతో నిన్న ఎల్ఎండీ వద్ద మొత్తం గేట్లను ఎత్తి దాదాపుగా 20 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు వదిలారు అధికారులు. మరోవైపు మానేరు ప్రవాహంతో జిల్లాలోని పలు మండలాల్లోని వాగులు వంకల్లో జళకళ ఉట్టిపడుతోంది.
కళకళలాడుతున్న డ్యామ్..
డ్యామ్ పరివాహక ప్రాంతంలో నిర్మించిన చెక్ డ్యామ్‌లతో పాటు మానేరు డ్యామ్‌ను దర్శించడం కోసం కరీంనగర్ వాసులతో పాటు వేర్వేరు జిల్లాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. టూరిస్టుల కోలహలంతో డ్యామ్ దగ్గర సందడి వాతావరణం కొనసాగుతోంది. వరుసగా మూడ్రోజుల పాటు సెలవులు కావడంతో కాలేజీ స్టూడెంట్స్, స్కూల్ విద్యార్దులు సైతం నాచురల్ బ్యూటీని ఆస్వాదించేందుకు గుంపులు గుంపులుగా తరలివస్తున్నారు.
Telangana | Jobs : ఆ రెండు ఉంటే అక్కడ జాబ్ గ్యారెంటీ .. నెలకు 25నుంచి 30 వేలు జీతం
జలకళను చూసి మురిసిపోతున్న సందర్శకులు..
ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు 317.3 మి . మీ వర్షం పడాల్సి ఉండగా .. 840.6 మి.మీ వర్షం పడింది. కాబ్బట్టి ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశమున్నందున ఇప్పటికే అన్ని జలపాతలు కూడా నీటితో కళకళలాడుతున్నాయి. ఎక్కువగా టూరిస్టులు, నగరవాసులు డ్యామ్ దగ్గరకు వస్తున్న సందర్భంగా ఎలాంటి అపశృతులు, ప్రమాదాలు జరగకుండా చూసేందుకు బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎక్కువ నీళ్లు ఉన్న జలపాతాల దగ్గర లోతు తెలియక చాలా మంది మునిగి ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Telangana News