Huzurabad by Elections: హుజూరాబాద్ లో వేడెక్కిన రాజకీయం.. ఎన్నికలకు ముందే వెలిసిన ఫ్లెక్సీలు.. హుజురాబాద్ బయలుదేరిన ఈటల..

వెలిసిన ఫ్లెక్సీలు

Huzurabad by Elections: ఈటల రాజీనామా తర్వాత అందరి చూపు హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికపై పడింది. ఇప్పటికే పలు పార్టీల బ్యానర్లు, ఫెక్సీలు వెలిశాయి. అయితే బీజేపీలోకి చేరిన తర్వాత ఈటల నియోజకవర్గానికి బయలుదేరారు. నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    ( పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

    మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ , పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా , ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి సమక్షంలో బీజేపీలో చేరిన అనంతరం హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కాయి . ఈటల రాజీనామా స్పీకర్ కూడా ఆమో దించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది . ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఎప్పు డైనా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది . ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ ఇప్పటికే సన్నద్ధమైంది . ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను గులాబీ బాస్ కెసిఆర్ ఆర్థిక మంత్రి ట్రబుల్ షూటర్ గా పేరొందిన తన్నీరు హరీష్ రావుపై పెట్టారు . నియోజకవర్గంలోని హుజురా బాద్ , జమ్మికుంట మున్సిపాలిటీలకు , హుజురాబాద్ , జమ్మికుంట , ఇల్లందకుంట , వీణవంక , కమలాపూర్ మండలాలకు ప్రత్యేక ఇంచార్జిలను నియమించారు .ఈటెల బీజేపీ పార్టీ లో చేరిన వెంబడే ఒక్కసారిగా హుజురాబాద్ లో రాజకీయ హిట్ పెరిగింది అని చెప్పవచ్చు. ఈటెల పై, పోటీకి పలు అభ్యర్థుల పేర్లను గులాబీ బాస్ ఇప్పటికే పరిశీలిస్తున్నడని సమాచారం. ఉప ఎన్నికలు ఎపుడు వచ్చిన.. ఎదుర్కొనేందుకు ఇప్పటికే టీఆరెస్ నుండి పలువురు, మంత్రులు నియోజకవర్గంలో పాగా వేశారు.

    నియోజకవర్గంలో ఇప్పటికే అన్ని పార్టీల ప్రచారం మొదలైంది అనే చెప్పవచ్చు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే టీఆరెస్ పార్టీ ఫెక్సీలు, బ్యానర్స్, వాల్పాయింటింగ్ వెలిశాయి. అంటే దీనిని బట్టి తొందరలోనే హుజురాబాద్ లో ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయని, తెలుస్తుంది. ప్రధాన పార్టీ లు ఇప్పటికే అబ్యర్ధుల వేటలో ఉన్నారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చిన ఎదురుకునేందుకు అన్ని పార్టీలు సన్నదం అవుతున్నాయని తెలుస్తోంది.. చూడాలి.. తెలంగాణ లో ఒకే శాసనసభ సభకు ఎన్నికల సంఘం ఎన్నిక నిర్వహిస్తుందా.. లేద బెంగాల్ లో కూడా ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటితో పాటే తెలంగాణలో హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు నిర్వహిస్తారా అనేది వేచి చూడాలి. ఏదైమైనా తెలంగాణ రాజకీయంలో హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక అత్యంత ఉత్కంఠ భరితంగా సాగనుంది.

    హుజూరాబాద్ బయలుదేరిన ఈటల
    శామేర్పెట్ నుండి హుజురాబాద్ బయలుదేరిన ఈటల రాజేందర్. బీజేపీలో చేరిన తరువాత తొలిసారిగా నియోజకవర్గానికి బయలుదేరారు. అతనికి స్వాగతం పలికేందుకు హుజురాబాద్ లోని పరకాల క్రాస్ రోడ్డు వద్ద కార్యకర్తలు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నాగారం లో, నగురంలో పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈటల హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
    అతడితో పాటు నాయకులు వివేక్ వెంకటస్వామి, స్వామిగౌడ్ కూడా వెళ్తున్నారు.
    Published by:Veera Babu
    First published: