పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు.. ఆ విషయం ఎక్కడ తెలిసిపోతుందేమోనని ఆత్మహత్య చేసుకున్నాడు.. విషయం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

Telangana: చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు యువకులు. వారంలో వివాహం జరగాల్సిన ఇంట విషాదం చోటుచేసుకుంది . కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోగా.. వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ సంఘటన మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  (పి. శ్రీనివాస్, జగిత్యాల జిల్లా, న్యూస్18 తెలుగు)

  చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు యువకులు. కొంతమంది సున్నితమైన మనస్థత్వం గలవారు ఉంటారు. వారు ప్రతీ చిన్న విషయానికి కూడా బాధపడుతుంటారు. పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో కొందరు.. ఇంట్లో దొంగతనం చేసి ఎక్కడ దొరికిపోతావేమోనని మరికొందరు ఇలా చిన్న కారణాలకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనిషి ప్రాణం ఎంతో విలువైనది. ఇలాంటి చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చి వెళ్తున్నారు. పిల్లలపై ఎన్నో ఆశలతో బతుకుతున్న వారికి కన్నీటిని మిగిల్చి వెళ్తున్నారు. అయితే ఇక్కడ జరిగిన ఘటన కూడా ఆ కోవలోకే వస్తుంది. ఏం జరిగిందంటే.. వారంలో వివాహం జరగాల్సిన ఇంట విషాదం చోటుచేసుకుంది . కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోగా.. వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో దుఃఖసాగరంలో మునిగిపోయారు . ఈ సంఘటన మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో చోటుచేసుకుంది.

  వెల్లుల్ల గ్రామానికి చెందిన భూమయ్య , నర్సు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె . పెద్దకుమారుడు ఓరగంటి రాజు ( 24 ) వ్యవసాయం చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు . కొద్దిరోజుల క్రితం వివాహ నిశ్చితార్థం జరిగింది . ఈ నెల 18 న వివాహం జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులంతా వివాహానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు . బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి పొలానికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన రాజు పొలానికి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  Read Also: భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం.. బలవంతంగా కారులో ఎక్కించి.. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై..


  దీంతో పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి చేసుకుని సంతోషంతో ఉండాల్సిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాజుకు చెవులు వినిపించవని.. పెళ్లి తర్వాత ఈ విషయం అదరికి తెలుస్తుందేమోనని.. ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
  Published by:Veera Babu
  First published: