హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: యూట్యూబ్ లో చూసి ఎలా చేయాలో నేర్చుకున్నాడు.. చివరకు ఏమైందంటే..

Telangana: యూట్యూబ్ లో చూసి ఎలా చేయాలో నేర్చుకున్నాడు.. చివరకు ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: వాహనాల చోరీ ఎలా చేయాలనే వివరాలను యూట్యూబ్ నుంచి సేకరించి అపహరించడం ప్రారంభించాడు. నాలుగు నెలల కాలంలో 12 ద్విచక్రవాహనాలను చోరీ చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. కరీంనగర్ అదనపు డీసీపీ పి.అశోక్ అరెస్టు వివరాలను వెల్లడించారు. పూర్తి వివారలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

(పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

సోషల్ మీడియా ఎంతటి దారికితీస్తోంది ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. ఆత్మహత్య ఎలా చేసుకోవాలి, హత్యలు ఎలా చేయాలి అనే విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మరీ దారుణాలకు పాల్పడుతున్నారు. చివరకు కటకటాల పాలవుతున్నారు. ఓ వ్యక్తి ఇలానే వాహనాల చోరీ ఎలా చేయాలనే వివరాలను యూట్యూబ్ నుంచి సేకరించి అపహరించడం ప్రారంభించాడు. నాలుగు నెలల కాలంలో 12 ద్విచక్రవాహనాలను చోరీ చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. కరీంనగర్ అదనపు డీసీపీ పి.అశోక్ అరెస్టు వివరాలను వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మడ్డి శ్రీనివాస్ అలియాస్ జల్సా, ( 33 ) 10 వ తరగతి వరకు చదువుకున్నాడు . 2020 లో రామడుగు మండలం, గోపాల్ రావు పేటలో, రూ .4 లక్షల పెట్టి ఆటో స్టోర్ వ్యాపారం సాగించాడు . లాక్ డౌన్ కారణంగా నష్టం రావడంతో దాన్ని అమ్మేశాడు . 2021 మార్చిలో కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటకు మకాం మార్చాడు .

ఇల్లు గడవటం ఇబ్బందిగా మారడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు . యూట్యూబ్ లో ద్విచక్రవాహనాలు ఎలా చోరీ చేయాలి అనే అంశాలను తెలుసుకున్నాడు . కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఒంటరిగా సంచరిస్తూ ఇంటి ముందు నిలిపిన ద్విచక్రవాహనాల హ్యాండిల్ విరగగొట్టి , హ్యాండిల్ కింద భాగంలో ఉన్న వైర్లను కలిపి అపహరించుకుపోవడం ప్రారంభించాడు .కరీంనగర్ ఉమ్మడి జిల్లా, పెడగపల్లి , రామడుగు , కొడిమ్యాల మండలాల్లో రూ .4 లక్షల విలువగల 12 ద్విచక్రవాహనాలను అపహరించాడు . వాటిని తెలిసిన వారి వద్ద ఒక్కోటి రూ .10 వేలకు తాకట్టు పెట్టాడు . నగరంలో వాహనాల చోరీల పై దృష్టి సారించిన రెండో పట్టణ పోలీసులు పక్కా సమాచారం మేరకు మడ్డి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారించారు .

పోలీసుల అదుపులో నిందితుడు

12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు .శ్రీనివాస్ విచారించగా వ్యాపారం లో నష్టాలు రావడం తో అప్పులు ఎక్కువ కావడంతో ఎం చేయాలో తెలియని పరిస్థితుల్లో దొంగతనాలకు పాల్పడ్డానని పోలీసులు తెలిపారు. సమావేశంలో రెండో రాణా సీఐ టి.లక్ష్మీబాబు, ఎస్సై టి.మహేష్ ఉన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వల్ల మంచితో పాటు చెడు కూడా ఉందని.. వీటితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలాంటి ఘటనలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

First published:

Tags: Crime, Crime news, Karimangar, Youtube

ఉత్తమ కథలు