హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: ఏమోలే.. ఒకే ఊరు కదా అని మాట్లాడింది.. కానీ అతడు ఇలా చేస్తాడని ఊహించలేకపోయింది..

OMG: ఏమోలే.. ఒకే ఊరు కదా అని మాట్లాడింది.. కానీ అతడు ఇలా చేస్తాడని ఊహించలేకపోయింది..

అంజలి, రాజు (ఫైల్)

అంజలి, రాజు (ఫైల్)

OMG: ఇటీవల కాలంలో అత్యాచార ఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని తెచ్చినా వీళ్లల్లో మార్పు రావడం లేదు. దీంతో మహిళా సంఘాలు, మహిళలు కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రేమించడం లేదని ముఖంపై యాసిడ్ దాడి చేయడం.. లేదంటే గొంతు కోసి చంపడం ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు యాసిడ్ దాడులు చేసే ఈ ప్రమోన్మాదులు ప్రస్తుతం.. ప్రియురాలి గొంతు కోసి చంపేస్తున్నారు.

ఇంకా చదవండి ...

ఇటీవల కాలంలో అత్యాచార ఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని తెచ్చినా వీళ్లల్లో మార్పు రావడం లేదు. దీంతో మహిళా సంఘాలు, మహిళలు కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రేమించడం లేదని ముఖంపై యాసిడ్ దాడి చేయడం.. లేదంటే గొంతు కోసి చంపడం ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు యాసిడ్ దాడులు చేసే ఈ ప్రమోన్మాదులు ప్రస్తుతం.. ప్రియురాలి గొంతు కోసి చంపేస్తున్నారు. తన ప్రేమను సాధించుకోవడానికి ప్రాణాలు తీసుకోవడానికైనా ప్రాణాలు తీయడానికైనా వెనకాడటం లేదు. తాజాగా ఓ ప్రమోన్మాది ప్రేమించమంటూ వేధించి యువతి గొంతు కోసి దారుణంగా హతమార్చిన ఘటన రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో చోటు చేసుకుంది.

Shocking News: జనవరి 1, 2022 నాడు ప్రమోషన్ పొందేవాడు.. ఆ పని చేసినందుకు ఇలా అయ్యాడు.. వివరాలిలా..


దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గోదావరిఖని రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కేకే నగర్ కు చెందిన 20 ఏళ్ల గొడుగు అంజలి తండ్రి చిన్న తనంలోనే చనిపోయాడు. ఆమె తల్లి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. అంతే కాకుండా కుమార్తెను కూడా ఉన్నదాంట్లోనే చదివిస్తోంది. తల్లి కూలికి వెళ్లిన సమయంలో ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని చూసిన చాట్ల రాజు (20) పరిచయం ఏర్పరచుకున్నాడు. రోజు ఇంటికి వచ్చి మాట్లాడుతుండేవాడు. తర్వాత కొన్ని రోజులకు ప్రేమిస్తున్నానంటూ వేధించడం మొదలు పెట్టాడు. ఈ విషయం ఆమె తల్లికి తెలవడంతో అతడిని హెచ్చరించింది. ఇంకోసారి ఇంటికి వస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చింది.

TSPSC-CM KCR: కేసీఆర్ కీలక నిర్ణయం.. ఉద్యోగాల భర్తీలో వారి వయో పరిమితి, రిజర్వేషన్లు పెంపు..


అంతే కాకుండా ఏడాది కిందట పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిపించింది. దీంతో కొన్నాళ్ల వరకు సైలెంట్ గా ఉన్న సదరు వ్యక్తి.. అంజలికి సంబంధాలు చూస్తున్నట్లు తెలుసుకున్నాడు. తర్వాత ఆమెకు ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టాడు. ఆమె తాను ఇంట్లో చూపించిన సంబంధం మాత్రమే చేసుకుంటానని చెప్పింది. దీంతో అతడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమెపై పగ పెంచుకొని ఓ రోజు ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. తనలో ఏం లోపం ఉంది.. ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవు అంటూ గట్టిగా అడిగాడు. ఆమె దానికి ససేమిరా అనడంతో అతడు ఇంట్లో టీవీ సౌండ్ పెంచి.. ఆమె వేస్తున్న కేకలు బయటకు వినపడకుండా చేశాడు. తన వెంట తెచ్చుకన్న కత్తితో ఆమె గొంతును పొడిచి.. అక్కడ ఉన్న కత్తిపీటతో దాడి చేసి హత్య చేశాడు.

Telangana Government Jobs: గుడ్ న్యూస్.. ఈ సారి రూ.80 వేల ఉద్యోగాల భర్తీ పక్కా..! అందుకే ఈ కమిటీ..


ఆమె రక్తపు మడుగులో పడి ఉంది.. అక్కడ నుంచి అతడు తప్పించుకొని వెళ్లాడు. ఈ నేపథ్యంలో అదే రోజు కొన్ని గంటల తర్వాత లక్ష్మితో కలిసి కూలీ పని చేసే ఓ వ్యక్తి ఉపాధిహామీ జాబ్‌కార్డు ఇచ్చేందుకు మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్లింది. ఎంత పిలిచినా ఎవరూ పలకకపోవడం, టీవీ సౌండ్‌ పెద్దగా వినిపిస్తుండటంతో లోపలికి వెళ్లిన ఆమెకు రక్తపు మడుగులో పడి ఉన్న అంజలి కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. పోలీసులకు ఈ విషయం చేరడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలోనే ఈ విషయం తెలుసుకున్న రాజు నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

First published:

Tags: Crime, Crime news

ఉత్తమ కథలు