• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • KARIMNAGAR GURUKULA SENIOR ASSISTANT SUICIDE DUE TO AVERSION TO LIFE WRITE ON SUICIDE NOTE IN SIRCILLA DISTRICT VB KNR

Attempt to suicide: జీవితంపై విరక్తితో చనిపోతున్నా.. నా చావుకు ఎవరూ బాద్యులు కారు.. అందరికీ నమస్కారం అంటూ గురుకుల టీచర్ ఆత్మహత్య ..

Attempt to suicide: జీవితంపై విరక్తితో చనిపోతున్నా.. నా చావుకు ఎవరూ బాద్యులు కారు.. అందరికీ నమస్కారం అంటూ గురుకుల టీచర్ ఆత్మహత్య ..

Attempt to suicide: జీవితంపై విరక్తి చెంది గురుకుల పాఠశాలలో సినియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకు ఎవరూ కారణం కాదు.. అమ్మ, బాపును మంచిగా చూసుకోండి అంటూ సూసైడ్ నోట్ రాసి.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

  • Share this:
    సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏండి రంజాన్ బాయి ఇంట్లో కొన్ని సంవత్సరాల నుంచి మరిమడ్ల ప్రభుత్వ గురుకుల పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సుల్తానాబాద్ కు చెందిన పి.మల్లేశం నేత (40 ) అద్దెకు ఉంటున్నాడు. సోమవారం ఉదయం 11-20 గంటల సమయంలో అద్దె గదిలో సూసైడ్ నోట్ రాసి ప్యాడ్ కు పెట్టీ అనంతరం బాత్ రూమ్ గదిలోకి వెళ్ళి గడియా పెట్టుకొని తన ఓంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మరణించాడు. గదిలో ప్యాడ్ కు రాసిపెట్టిన నోట్ లో ఇలా రాసి ఉంది. నా చావుకు ఎవరూ కారణం కాదు.. జీవితంపై విరక్తితో చనిపోతున్నాను అని రాశాడు. అంతే కాకుండా మా పెద్దక్క, చిన్నక్క, మా చెల్లి బావలు అందరూ మంచివారే అమ్మను బాపును చూసుకొండంటూ వేడుకున్నాడు. నాకు రావాల్సిన ఆస్తి మొత్తం శ్రీ కాంతి మరియు సన్నీకి ఇవ్వండని కోరాడు. గురుకుల పాఠశాలలో 22 సంవత్సరాల జర్నీలో ఎరినైనా ఇబ్బంది పెడితే క్షమించండంటూ కూడా అందులో రాశాడు.

    శవాన్ని ఆటోలో తరలిస్తున్న గ్రామస్తులు

    సూసైడ్ నోట్

    గురుకుల మిత్రులందరికీ నమస్కారం ఇక సెలవు అంటూ రాసి పెట్టిన సూసైడ్ నోటోలో మల్లేశం పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న ఏఎస్ఐ కిషన్ రావు సంఘటన స్థలానికి పరీశీలించి కేసు నమోదు చేశాడు. వారి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్లా జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
    Published by:Veera Babu
    First published: