హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ప్రైవేట్‌ ఆసుపత్రుల దందాపై సర్కారు కొరడా .. ఆ జిల్లాలో ఎన్నింటికి నోటీసులిచ్చారంటే ..

Telangana: ప్రైవేట్‌ ఆసుపత్రుల దందాపై సర్కారు కొరడా .. ఆ జిల్లాలో ఎన్నింటికి నోటీసులిచ్చారంటే ..

KARIMNAGAR

KARIMNAGAR

Telangana: ప్రైవేట్  ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. నిబంధనలు పాటించని అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ , పాలీ క్లినిక్స్ , డయోగ్నోస్టిక్ సెంటర్లు , ఫిజియోథెరపీ సెంటర్లలో నాలుగు జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించా యి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  ప్రైవేట్  ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. నిబంధనలు పాటించని అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ , పాలీ క్లినిక్స్(Poly Clinics), డయోగ్నోస్టిక్(Diagnostic Centers)సెంటర్లు , ఫిజియోథెరపీ(Physiotherapy)సెంటర్లలో నాలుగు జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించా యి. కరీంనగర్(Karimnagar)జిల్లాలోని 300 ఆస్పత్రులను తనిఖీచేసి అనుమతులు లేని , నిబంధనలు పాటించని 100 ఆస్ప త్రులకు నోటీసులు జారీ చేశారు. జగిత్యాల(Jagityal)జిల్లాలో అధికారులు 40 ప్రైవేటు ఆస్పత్రుల్లో సోదాలు చేశారు . నిబంధనలు పాటించని 25ఆసుపత్రు లకు నోటీసులు జారీ చేశారు . ఒక ఆస్పత్రి అనుమతిని రద్దు చేయాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారు లకు సిఫారుసు చేశారు . పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో పెద్దపల్లి , గోదావరిఖని(Godavarikhani)లో కలిపి వందకు పైగా ఆస్పత్రులను తని ఖీచేసి 30 ఆస్పత్రులకు నోటీసులు అందించారు. రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla)జిల్లాలో ప్రధానంగా సిరిసిల్ల , వేములవాడ మున్సిపాలిటీలతో పాటు మండలాల్లో ప్రైవేటు ఆస్పత్రులు , డయాగ్నోస్టిక్ సెంటర్లు , ల్యాబ్‌లు ఉన్నాయి . జిల్లా లో 119 ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా ఇందులో 50 రిజిస్ట్రేషన్ అనుమతులు లేని  ఆస్పత్రులకు నోటీ సులను జారీ చేశారు .

  Telangana : అభాగ్యులు, అనాథలే వాళ్లకు ఆత్మీయులు .. 11ఏళ్లుగా వాళ్ల కోసం ఏం చేస్తున్నారో తెలుసా..?

  రాష్ట్ర వ్యాప్తంగా రైడ్స్..

  రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తుండడం ఆసుపత్రి వర్గాల్లో కలకలం రేపుతోంది . కొంతమంది నిర్వాహకులు తమ ఆస్పత్రుల్లో తనిఖీలు జరిగే అవకాశాలున్నట్లు గుర్తించి అత్యవసరంగా కొన్ని నిబంధనలను పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెడికల్ హబ్‌గా పిలువబడే కరీంనగర్ జిల్లాలో తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంతో పాటు హుజురాబాద్ డివిజన్‌లో తనిఖీలను నిర్వహించారు . జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువైరియాతో పాటు బృందం సభ్యులు విస్తృతంగా తనఖీ చేశారు . కరోనా సమయంలో కూడా తనిఖీలు నిర్వహించి ఆరు ఆస్పత్రుల లైసెన్సులను కేవలం 15 రోజులపాటు రద్దు చేసి చేతులుదులుపుకున్నారు. ఇలాంటి చర్యలు ప్రైవేటు దోపిడీని అరికట్టలేవని , ప్రభుత్వంకఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

  అరికట్టేందుకు చర్యలు..

  ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో అనుమతు లేని , నిబంధనలు పాటించని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసి మూడురోజుల్లో సమాధానమివ్వాలని , లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు జువైరియా  తెలిపారు. మరి స్పందని ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి. అనుమతి లేకుండా , ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఆస్పత్రులు నిర్వహించి ప్రజల రక్తాలు పీలుస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు ఉమ్మడి జిల్లాలో ఎన్నో ఉన్నాయి. నాటి కరోనా సమయంలో నేడు విజృంభిస్తున్న డెంగీ సమయంలో కొన్ని ఆస్పత్రుల యజమానులు ఒక్కో రోగి నుంచి 50 వేలకు పైగా వసూలు చేయడంతో పాటు మందులు వారిచేతనే తెప్పించి కోట్లు దండుకున్నారు. కొందరు వ్యక్తుల ధనాపేక్ష , అనైతిక చర్యలవల్ల వైద్య రంగం మొత్తం అపఖ్యాతి పాలవుతున్నదని పలువురు డాక్టర్లు వాపోతున్నారు.అయితే వారు ఈ విషయాన్ని బాహాటంగా ప్రకటించక పోవడంతో అలాంటి వారు మరింత రెచ్చిపోతున్నారు.

  ప్రత్యేక బృందాలతో తనిఖీలు..

  ఐఎంఏ సమావేశాలు నిర్వహిస్తూ అనైతిక ప్రాక్టీస్‌లపై పలు సందర్భాల్లో విచారం వ్యక్తం చేసినా వైద్య ఆరోగ్యశాఖను అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మాత్రం కోరడంలో వెనకడుగు వేస్తున్నారు. ఆస్పత్రుల్లో వసూలు చేసే మందుల ధరలు కూడా పొంతన లేకుండా ఉంటున్నాయని , బయటి షా పుల్లో ఎంఆర్పీపై 15 శాతం రాయితీ ఇస్తుండగా ఆస్పత్రుల్లో మాత్రం ఎంఆర్పీ ధరలకే ముక్కుపిండి వసూలు చేస్తున్నారని , బయట నుంచి మందులు తీసుకోవడానికి అంగీకరించడం లేదని రోగుల బంధువులు పలు సందర్భాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో కొన్ని కంపెనీలతో కాంట్రాక్టు కుదుర్చుకొని మందులు తెప్పించి వాడుతున్నారని , ఆ మందులు బయట షాపుల్లో ఎక్కడా దొరకవనే ఆరోపణలు ఉన్నాయి .

  OMG : మద్యం మత్తులో మిత్రుడి మర్మాంగం కొరికిన యువకుడు .. వామ్మో తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

  ప్రైవేట్‌ ఆసుపత్రులపై కొరడా ..

  కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొందరు నకిలీ సర్టిఫికెట్లతో ప్రాక్టీస్ చేస్తున్నారని ఫిర్యాదులున్నాయి . డాక్టర్ అని తన పేరు ముందు పేర్కొనే అర్హత లేని వారు డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రాక్టీస్ చేస్తున్నారని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ఇప్పటికే ఒకరిద్దరి వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ , వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి తీసుకువచ్చింది . ఇక ఆర్ఎంపీలు , పీఎంపీలలో కొందరు స్వార్ధపరులను , అంబులెన్సు డ్రైవర్లను మచ్చిక చేసుకొని వారికి కమీషన్లు ఇస్తే పేషెంట్లకు కొదవ ఉండదు . వారికి హాస్పిటళ్లలో ఐదు , పది శాతం భాగ స్వామ్యం కల్పించి రోగుల వద్ద దండుకుంటున్నారు . అవసరం లేకున్నా పరీక్షలు ప్రైవేట్ ఆస్పత్రులకు రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలకు చెందిన వారికి మధ్య అవినాభావ సంబంధం ఉంటున్నది. అవసరమున్నా లేకున్నా సీటీ , స్కానింగ్ , ఎంఆర్ఎస్ఐ , అలాస్ట్రాండ్ తదితర పరీక్షలకు ఆ కేంద్రాలకు పంపిస్తారు . పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వారు ఎదరు ఆస్పత్రుల నిర్వాహకులకు డాక్టర్లకు 40 శాతం వరకు కమీషన్లు ముట్టజెబుతారు . కొందరు నిజాయితీ పరులైన డాక్టర్లు తమ పేషెంట్లకు ఆమేరకు తగ్గించి బిల్లు తీసుకోవాలని పరీక్షా కేంద్రాలకు లేఖ పంపిస్తున్న సందర్భాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

  తనిఖీలు సరే చర్యలేవి..?

  ఎవరైనా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే లక్షల రూపాయలు వదిలించుకోవాల్సి వస్తుంది . వైద్యం వ్యాపారంగా మార్చుకున్న వారిని కట్టడి చేస్తే నైతిక విలువలతో సేవలందిస్తున్న డాక్టర్లను ప్రోత్సహించడమే కాకుండా రోగులకు మెరుగైన సేవలందే అవకాశం ఉంది. కరీంనగర్ పట్టణంలో రాజకీయనాయకులు , ఇతర వ్యా పార ప్రముఖులు , మెడికల్ షాపు యజమానులు , రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాల యజమానులు , ఆర్ఎంపీలు , అంబులెన్స్ యజమానులు కలిసిపలు ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. వీటిల్లో వైద్యానికి వేలాది రూపాయలు చెల్లిస్తూ పలువురు నష్టపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి , వారి సిబ్బంది తరుచుగా తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా వారి పర్యవేక్షణ ఉండడంలేదనే ఫిర్యాదులు ఉన్నాయి . అడపాదడపా ఫిర్యాదులు వచ్చినపుడు నామ మాత్రపు తనిఖీలు చేసి అంతా సజావుగానే ఉందని చేతులు దులుపుకుంటున్నారు . తాజా తనిఖీల్లో ఇలాంటి వారు నిర్వహిస్తున్న ఆసుపత్రులే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimnagar, Telangana News

  ఉత్తమ కథలు