Home /News /telangana /

KARIMNAGAR GOT VACCINATION RECORD WHICH COMPLETED AS 100 PERCENT SECOND DOSE VACCINATION VRY

Corona Vaccination Record : రికార్డు సాధించిన తెలంగాణ జిల్లా.. మరిన్ని చేరువలో.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Corona Vaccination Record : కరోనా వ్యాక్సినేషన్‌లో కరీంనగర్‌ జిల్లా రికార్డు సృష్టించింది. తెలంగాణలోనే మొదటి సారిగా వందశాతం రెండో డోసును పూర్తి చేసుకున్న జిల్లాగా రికార్డుకెక్కింది.

    కరోనా వ్యాక్సినేషన్‌లో కరీంనగర్‌ జిల్లా రికార్డు సృష్టించింది. తెలంగాణలోనే మొదటి సారిగా వందశాతం రెండో డోసును పూర్తి చేసుకున్న జిల్లాగా రికార్డుకెక్కింది. అంతే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో రెండు డోసులు పూర్తయిన జిల్లాగా బెంగళూరు అర్బన్‌ మొదటి స్థానంలో నిలవగా.. కరీంనగర్‌ జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

    తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ అంత్యంత వేగంగా కొనసాగుతుందనే దానికి కరీంనగర్ వేదిక నిలించింది. ఆ జిల్లా మొత్తం తెలంగాణ జిల్లాల్లో వంద శాతం రెండవ డోసును పూర్తి చేసుకున్న జిల్లాగా రికార్డు కెక్కింది. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలో 7,92,922 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించగా.. మొదటి డోసుతో ఇప్పటివరకు 8,27,103 డోసులు పంపిణీ చేశారు. ఇదే స్ఫూర్తితో సెకండ్‌ డోస్‌ సైతం రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. దీంతో మంగళవారం నాటికి జిల్లాలో 7,94,404 మందికి రెండో డోస్‌ పంపిణీ చేసి 100 శాతం పూర్తి చేసిన తొలి జిల్లాగా రికార్డు సృష్టించారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇది రెండవ జిల్లాగా రికార్డుకెక్కింది. ఈ జిల్లాల తర్వాత స్థానాల్లో ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాలు సైతం వంద శాతానికి చేరువలో ఉన్నాయి. మరోవైపు నిజామాబాద్‌, సూర్యాపేట, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో వందశాతం పూర్తయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు వందశాతం పూర్తయిన రికార్డు కూడా సొంతం కానుంది.

    Brother and sister love : తండ్రి ఒక్కడే.., తల్లులు వేరు.. కాని అన్నా చెల్లెల్ల మధ్య..

    ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఅర్ ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.

    మీ నగరం నుండి (కరీంనగర్)

    తెలంగాణ
    కరీంనగర్
    తెలంగాణ
    కరీంనగర్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Karimnagar, Vaccination

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు