Karimnagar | కరీంనగర్‌కు కేంద్రం ఫస్ట్ ర్యాంక్.. ఏ కేటగిరీలో అంటే

Karimnagar Award | లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో కరీంనగర్‌కు మొదటి స్థానం లభించిందని గంగుల కమలాకర్ చెప్పారు.

news18-telugu
Updated: August 20, 2020, 9:10 PM IST
Karimnagar | కరీంనగర్‌కు కేంద్రం ఫస్ట్ ర్యాంక్.. ఏ కేటగిరీలో అంటే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
swachh survekshan 2020 | దేశం లో అత్యుత్తమ పరిశుభ్రత గల నగరాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షన్ లో అత్యుత్తమ ‘బెస్ట్ సిటిజెన్ లెడ్ ఇన్నోవేటివ్ 2020’ అవార్డు కరీంనగర్ నగరానికి దక్కడం చాలా సంతోషం అని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, నగర కమిషనర్ వల్లూరి క్రాంతిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. నగరంలో పరిపాలన, ప్రజలకు అందిస్తున్న సేవలు, శానిటేషన్, పౌర సేవలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే అవార్డు లలో దేశంలోనే కరీంనగర్ నగరానికి ఒక లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానం దక్కడం మనందరం గర్వించదగ్గ విషయం అన్నారు. గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి కరీంనగర్ నగరం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీర్ ల మార్గదర్శనం వారి నిర్ణయాలను అమలు పరచడం వల్లే కరీంనగర్‌కు ఈ అవార్డు లభించిందన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షన్లో ఈ సారి కరీంనగర్ నగరానికి మెరుగైన 72 వ రాంక్ సాధించిందని మంత్రి తెలిపారు.

నిత్యం నగరపాలక సంస్థ అన్ని రకాల చర్యలు తీసుకోవడం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వలన కరీంనగర్ ఈ స్థానంలో నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన సేవలు ప్రజలు అందించి మరింత మెరుగైన రాంక్ సాధిస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 20, 2020, 7:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading